3, నవంబర్ 2010, బుధవారం

అమృతాంజన దీపావళి













“ దీపావళి పండుగ తో పోలుస్తూ ఒక ప్రముఖ కవి
“ శిరో భారాన్ని తొలిగించే – అమృతాంజనము"– గురించి
ఒక వ్యాపార ప్రకటన కొఱకు ఈ గీతమును రాసారు.

ఋతు రాజంబు, వసంతంబు ;;;;;
రోగ రహిత రాజ్యం అమృతాంజనం –
వసంతమున మోడులు చిగుర్చును
మనుజుల మనముల నమృతాంజనము తలిర్చును ....... ||

అమృతాంజన దర్శనమున రోగము
లడవి దవ్వుగా పరిగిడుచు
చలి ఉష్ణము చతికిల బడును
కమనీయము దాని సేవ నెపుడు
కలలో నైనను మరువకుము! ..... ||

పుండే కాని, గాయమె కాని
కత్తి తగిలిన గంటే కాని
చర్మమునకు సంధించిన బాధల
చయ్యన బాపుట దాని నిధి! ||

ఆస్త్మా పీడితులగు వృద్ధులును
గోరింత దగ్గు కల బాలురును –
అమృతాంజన మర్దనతో
పీడా విముక్తులగుదురు ఒక తృటిలో... ||

తక్కిన మందులు ఏవో ప్క్కొక్క
రోగము మాంప సమర్ధము నేమో!...
అమృతాంజనము సర్వ రోగ
సంహారకమగు వజ్రాయుధము ..... ||

ఇతర డాక్టరుల వలెనే ఇయ్యది
బ్రతిమలాడినా రానిది కాదు
నిన్నంటుకొని తిరిగి కుదిర్చే
నేర్పు దానికె పెట్టని సొమ్ము ||

మన దేశంబు ఘన స్వాతంత్ర్య
మహిమ నిటుల నలరారే వేళ
మన కానందము అమృతాంజన
దీపావళి నిలిపే ఉత్సవ లీల ........ ||

"ఆంధ్ర పత్రిక" మహా నిర్మాత కాశీ నాధుని నాగేశ్వర రావు గారు
" అమృతాంజనము " మీద వ్యాపార ప్రకటనలను తయారు చేయిస్తూన్నారు.
"భారతి - పత్రికలో వేయిద్దాము," అని చెప్పగా
గరిమెళ్ళ ఈ తల నొప్పి గేయాన్ని రచించారు.

*****************************************
గరిమెళ్ళ సత్య నారాయణ _ 1893 లో
శ్రీకాకుళము జిల్లాలోని నరసన్న పేట తాలూకా లోని
గోనెపాడు గ్రామములో జన్మించారు(July 14, 1893 _ December 18, 1952).
తండ్రి గారి ఊరు – విజయనగరము జిల్లాలోని ‘ప్రియాగ్రహారము’.

“పెంకి పిల్ల” అనే పత్రికా సంపాదకుడు ‘ పసుమర్తి రాఘవ రావు’ చేసిన
ఇంటర్వ్యూలోని కొన్ని విశేషాలు ఇవి.
జానపద బాణీలో ఇష్టంగా గీతాలను రచించే గరిమెళ్ళ సత్య నారాయణ
“నాకు స్ఫూర్తి గురజాడ అప్పా రావుగారు,
గిడుగు రామ మూర్తి పంతులు గారు.” అని వక్కాణించారు.
నాటి తన సమకాలీన రచనల పట్ల
కొంత విముఖతను కలిగి ఉన్నారు గరిమెళ్ళ సత్య నారాయణ.

“ Let hundred flowers blossom..” – అన్నట్లు
ఒక తోటలో ఎన్ని రకాల పూల మొక్కలు ఉండవు!?
గులాబి మొక్కలు, సంపంగి మొక్కలు పోట్లాడుకొను చున్నవా?
మల్లె పూలు, జాజి పూలు సరసాలాడుకోవడం లేదా? .....”అంటూ -
“ ధన పిపాస లేనప్పుడే ‘జాతీయత’ ఏర్పడి,
తద్వారా ‘ సమ రస భావము’ ఏర్పడుతుంది.”
అని తన అభిప్రాయాన్ని వెలి బుచ్చారు గరిమెళ్ళ సత్య నారాయణ .
ఈ అమృతాంజన గీతమును - గరిమెళ్ళ సత్య నారాయణ రచించారు.

“మాకొద్దీ తెల్ల దొర తనము- దేవ!
మాకొద్దీ తెల్ల దొర తనము- ..... "

అనే గొప్ప స్వాతర్య గీత రచన చేసి,
ప్రజల నుండీ ఆప్యాయంగా
“Tiger Poet” అనే బిరుదును పొందారు .

----------------------------------------------

కొల్లాయి గట్టితే నేని
మా గాంధి- మాలడై తిరిగితే నేమి
వెన్న పూసా మనసు – కన్న తల్లీ ప్రేమ
పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు ||

నాలుగు పరకల పిలక నాట్య మాడె పిలక
నాలుగు వేదాల నాణ్యమెరిగిన పిలక ||

బోసి నోర్విప్పితే ముత్యాల తొలకరే!
చిరు నవ్వు నవ్వితే వరహాల వర్షమే! ||

-------------------------------------------

“ శ్రీ గాంధి నామం – మరువాం మరువాం
సిద్ధము జైలుకు వెరువాం వరువాం..........”

మున్నగు అనేక స్వరాజ్య గీతాలు ఆ నాడు మన త్రిలింగ దేశములో
జాతీయోద్యమ స్ఫూర్తినీ, దేశ భక్తినీ హిమ నగ సమున్నతంగా ఉత్తేజ పరిచినవి.

-------------------------------------------------------
(link)

గరిమెళ్ళ కు గాంధిజీ ఇచ్చిన బిరుదు

"ప్రజా పాటల త్యాగయ్య" మన గరిమెళ్ళ

"మా కొద్దీ తెల్ల దొర తనము..." అనే స్వాతంత్ర్య గీతము దశ దిశలా మార్మ్రో గింది.
G.T.H. బేకన్(1921) గరిమెళ్ళ చేత ఈ పాటను పాడించాడు.
"భాష రాని నాకే ఇంత గగుర్పాటును కలిగించింది.
స్వదేశీయులలో ఇంకెంత ఉత్తేజాన్ని కలిగిస్తుందో అర్ధమైంది"
అంటూ ఆ పాటను నిషేధించాడు.

గరిమెళ్ళ సత్యనారాయణ గారికి రాజద్రోహం నేరం కింద
ఏడాది కఠిన కారాగార శిక్షను విధించాడు.
ఆ తర్వాత సబర్మతీ ఆశ్రమంలో,
గాంధీజీ ఈ పాటకు అనువాదము చేయించమని పురమాయించారు.
టంగుటూరి ప్రకాశం పంతులు గారి
"స్వరాజ్యం" పత్రికలో ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రచురించారు.
N.G..రంగా, గరిమెళ్ళను "ప్రజా పాటల త్యాగయ్య" అని ప్రశంసించారు.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కవితలు బాగున్నాయి. మీ బ్లాగ్ చూడడానికి , చదవడానికి చాలా బాగున్నది . . . డా.శేషగిరిరావు -శ్రీకాకుళం

kusuma చెప్పారు...

Thank you, Sir!
మీ ఫొటోల సేకరణలు గొప్పగా ఉన్నాయి.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...