
వట పత్ర శాయి – శిఖి పింఛ ధారి
పుట్టుక, కదలికలు లోక కళ్యాణములు
ప్రకృతికి ఎన లేని –
హర్షానందమ్ములు చెలియరో!....
ప్రకృతికి ఎన లేని – హర్షానందమ్ములు ||
మఱ్ఱి చెట్టుల నీడ – ఆవుల మందలు
అట్టె నిలిచేను – ఆగి చూచేను – చెలియరో!....
వ్రేపల్లె కిట్టమ్మ నును స్పర్శ కోసము
చెలియరో!....
వ్రేపల్లె కిట్టమ్మ నును స్పర్శ కోసము ||
మబ్బుల వీపుల మెరుపుల పిల్లలు
మర్రి తోపుల మీద – వంగి చూచేరు
నీలాంబరాలలో – మేఘ మల్‌హారాలు
చెలియరో!....
నీలాంబరాలలో – మేఘ మల్‌హారాలు ||
వచ్చిన వాడు – వట పత్ర శాయి
నాదు ఛాయల – విశ్రాంతి గై కొనె – ననుచు
మర్రి చెట్టుకు – వల్ల మాలిన గర్వము
చెలియరో!......
మర్రి చెట్టుకు – వల్ల మాలిన గర్వము ||
************************************
అందరికీ మా దీపావళి శుభాకాంక్షలు !
1 కామెంట్:
Thank you, sir!
Same to you,
మీకు,మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభా కాంక్షలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి