"సింహాచలము మహా పుణ్య క్షేత్రము,శ్రీ వరాహ నర సింహుని దివ్య ధామము."వీర భాను దీపుడు, కిమిడి ప్రభువు,వల్లభాసావాస మల్లుడు, కొండ వీటి రెడ్డి రాజులు,శ్రీ కృష్ణ దేవ రాయలు గారి పట్ట మహిషి, మున్నగు వారుసింహాచల స్వామికి విలువైన కానుకలను సమర్పించారు.స్వామిని అర్చించి, పలువురు అనేక శిల్ప, మండప,సోపానాది నిర్మాణాలను వెలయించారు.18 వ శతాబ్ద ఆరంభం నాటికి సింహాచల క్షేత్రముకటకము పరిపాలకుల ఆధ్వర్యంలో ఉండేది;కాల క్రమేణాపూసపాటి విజయ నగర ప్రభువులు నిర్వహణలోనికి వచ్చినది.నేటికీ ఇక్కడ ఉన్న అసంఖ్యాక శాసనాలు,దేవళమునకు భక్తులు సమర్పించిన భూ దానములు వగైరాలు,చక్రవర్తుల బహుమతులు – మున్నగునవి .ఎన్నిటికో శిలా, శాసన రూపాదులలో ఉండి,History Reaserch చేసే వారికిఅమూల్య వరములుగా ఒనగూడుతునాయి.చైత్ర శుద్ధ ఏకాదశి మొదలు పౌర్ణమి వఱకు జరిగే“శ్రీ స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు”భక్త జనులకు నయన పర్వములు చేస్తున్నాయి.సింహాచల క్షేత్ర మహిమలను కీర్తిస్తూశతకములు, సాహిత్యము వెలువడినవి.విజయ రామ రాజు గజపతి అధికారములో ఉన్నప్పుడుఒక విశిష్ట సంఘటన జరిగినది.మొగలాయీ సైన్యము దండ యాత్రలతో దేశము అల్ల కల్లోలముగ ఉన్నది.తురుష్క సైన్యం దేవాలయాలను ధ్వంసం చేసే వారు.సింహాచల క్షేత్రము కొండను ఎక్కాయి.కొంత మేర కళ్యాణ మండప స్థంభాలను పగల గొట్టారు.కోవెల తలుపులను కూడా విరగ్గొట్టి, లోనికి ప్రవేశించబోయారు.అప్పటికే లోపల ఇద్దరు భక్తులు ఉన్నారు.ప్రాణ త్యాగానికైనా సిద్ధ పడినఆ భక్తుల పేర్లు గోకుల పాటి కూర్మ నాథ కవి, హరి హర దాసు.వారిరువురు తలుపులు మూసుకునిస్వామి మీద ఆశువుగా శతకమును చెప్ప సాగారు.కూర్మ నాథ కవి పద్యాలను చెప్తూంటే,హరి హర దాసు వ్రాయ సాగాడు.వేద వ్యాసుని నుడువులుగా“మహా భారతము” అనే నామముతో ప్రసిద్ధికెక్కినహిందువుల ఇతిహాసము ఐన “జయం” నుతన దంతముతో వినాయకుడు రాసి పెట్టినమహత్తర సంఘటనకు సామ్యముగా ఇచ్చట జరిగినది.“ వై రి హర రంహ సింహాద్రి నర సింహ” అనే మకుటముతోసీస పద్య హారము వెలసినది.బయట ముష్కరుల సైన్యముప్రజలను భయభ్రాంతులను చేస్తూ ముట్టడి చేసారు.అప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగినది.వేలాది తేనెటీగల దండు ఒక్కుమ్మడిగా ఆ ముష్కరులపై దాడి చేసాయి.గుంపులు గుంపులుగా ఆ తేనెటీగలు దుష్ట బుద్ధి కల ఆ దుర్మార్గులను తరిమికొట్టాయి.విశాఖ పట్టణములోని “తుమ్మెదల మెట్ట” దాకాశత్రువులను పార ద్రోలినాయి.పూసపాటి విజయ రామరాజు పరిపాలనా కాలంనాటికిదేవాలయమునకు విశిష్ట సాంప్రదాయములు సమకూడినవి.“శ్రీ స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు” ,వైశాఖ శుద్ధ తదియ నాటి “స్వామి వారి నిజ రూప దర్శనము” లబ్ధినిప్రజా కోటి పొందుతున్నారు.ఆ నాడు వలిచిన “సింహాచల స్వామి వారి ” చందనము తోకలిపిన దివ్య తీర్థము లభిస్తుంది.అక్షయ తృతీయ ఉత్తరాది నుండి దిగుమతి ఐ,ఇప్పుడు మన దక్షిణ భారత సీమలలో కూడాప్రాచుర్యంలోనికి వచ్చిన పండుగ.సింహాచలములోక్రీస్తు శకము 1293 నుండి ఒక ఆచారము ఏర్పాటు ఐనది.గంధము, హరి చందనము, కర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యాలను నూరుట –ఒక పవిత్ర కార్యక్రమముగా మొదలు పెడ్తారు.పురూరవ మహా రాజుకు ఆకాశ వాణి ఇచ్చిన ఆదేశము మేఱకు" అక్షయ తృతీయ నాడు, చందన వలుపు ఉత్సవము జరుగుటకుబీజము పడినదని పౌరాణిక గాథ.ఆ రోజు శ్రీ వరాహ నరసింహ మూర్తి నిజ రూప దర్శనము అందరికీ లభిస్తూన్నది.3 రోజులు ముందు నుండి "జల ధారలను" విగ్రహముపై చిలకరిస్తూ ఉంటారు.ఇందు చేత గట్టిగా ఉన్న చందనము మెత్త బడి, వలవడానికి అనువుగా మారుతుంది.కప్ప స్తంభము ఇచ్చటి ప్రత్యేకత."సంతాన వేణు గోపాల స్వామి" అనుగ్రహము లభించి,"దంపతులకు సంతానము కలుగును."కప్పస్తంభము"ను తాకి, వరములు కోరుట ఇచ్చటి విశిష్టత.;;;;;;; అక్షయ తృతీయ (‘చందనొత్సవం’)
29, అక్టోబర్ 2010, శుక్రవారం
తుమ్మెదల మెట్ట దాకా పరుగు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి