5, అక్టోబర్ 2010, మంగళవారం

కర్పూర హారతులు కనక దుర్గమ్మా!















వర మంజరీ సౌరభమ్ములను
ఈ - ధర వాసులకు ఒసగు కనక దుర్గమ్మా!!
హారతులు గొనుమా!
కర్పూర హారతులను గొనుమా! ||వర మంజరీ||

గిరి ఇంద్ర కీలాద్రి నీ - నిజ వాసమై
సుర రాజు సౌధాళినే మించెను
నీరదమ్ములు కొండ - కొమ్ములకు చేరి
నీహార ఛత్రమ్ములై వెలసెనమ్మా! ||వర మంజరీ||

నీ మృదు వీక్షణమ్ములందున దుర్గ!
పదహారు - కళల లే వెన్నియల కాంతులు
సౌజన్య వాణీ!సదా శివు(నీ) రా రాణి!
నట రాజు సామ్రాజ్ఞి!- నళినాక్షి! రావమ్మ!
హారతులు గొనుమా!
కర్పూర హారతులను గొనుమా! ||వర మంజరీ||

3 కామెంట్‌లు:

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

ఏవండీ, పాటతోపాటూ మీ స్వరాన్ని పొందుపరచాల్సింది

kadambari చెప్పారు...

ఆయన తాత సుదక్షణా పరిణయం రాసిన అప్పన్న కవి. వీరికి ఇద్దరు సోదరులు వరరాఘవకవి, అన్నయ్య. రామలింగయ్య తాత,ముత్తాతలు గార్లపాడు,తెనాలి అగ్రహారమైన తూములూరు - ఇత్యాది (ఇప్పటి వరకూ నాకు తెలీని) విశేషాలు ,మీ వ్యాసంలో వివరించారు.
థాంక్యూ, రహిమ్నుద్దిన్ షైక్ గారూ

pvsnsarma చెప్పారు...

mee pata chala bagundi. mee pataku ragam sidhamga undi. subhakankshalu.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...