అంకోలం నిజ బీజ సంతతిః
అయస్కాంతో ఫలం సూచికా ||
అమోఘ ప్రతిభా శాలి శ్రీ ఆది శంకరాచార్య రచించిన
"శివానంద లహరి" లోని 61 వ శ్లోకంలో
ఇలాగ - ఊడుగ చెట్టు అనగా అంకోలం తరువును గురించిన ప్రస్తావన ఉన్నది .
తాత్పర్య :
" Eranzhil tree / azhinjil (Tamil) /అంకోలం విత్తనములు
తన మాతృ వృక్షమునకు అతుక్కుంటాయి.
ఆ వృక్షమునకు గల ఇనుము వంటి గుణము కల
ఆ చెట్టు ముళ్ళకు అయస్కాంతము పట్ల ఆకర్షిత గుణమును కలిగి ఉన్నాయి
లతలు/ తీగ పాదపము మ్రాను చుట్టూతా పెనవేసుకుంటుంది.నది సముద్రములో కలుస్తుంది.పశుపతి నాధుని, మహేశుని చరణ పద్మములకు భక్తి భావనలు లీనమౌతాయి."
అంటూ శ్రీ కంచి పీఠాధిపతి ఈ మహత్తర శ్లోకానికి వివరణను ఇచ్చారు.
Kanchi Mahaperiyavar, Sri Chandrasekharendra Sarasvathi Swami:
భక్తి మార్గము యొక్క విశిష్టతను
" శివానంద లహరి"లోని 61వ శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని చేసిన వర్ణన ఆణి ముత్యమే కదా!
తమిళ నాడులో "అంకోల గణపతి దేవళము" ఉన్నది.
స్వయం భూ గణపతి అంకోల పాదపము వద్ద వెలసెను;
అందు చేత ఆ సైకత వినాయకుడు - అంకోల గణపతి గా వాసి కెక్కెను.
తెలుగులో అనేక వ్యవహార నామాలు కలవు;
Udaga, Uduga, Ooduga, Ankolamu, Urgu, Nalludugu, Nalla ankolamu chettu, Nallankolamu, Nallauduga, Nallaukolamu, Udugachettu, Uru
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి