గజ రాజు వదనమును కలిగి ఉన్న "వినాయకుడు" ను,మొట్ట మొదట పూజ చేసి,అర్చన కార్యక్రమాలను కొనసాగిస్తారు మన భారతీయులు.కంబోడియా, థాయ్ లాండ్, మియన్మార్ (బర్మా), శ్రీ లంక మున్నగుఅనేక ఆసియా దేశాలలో "ఏనుగు" ఆరాధ్యనీయమైన జంతువు.అలగ్జాండర్ హిందూ దేశముపై దండెత్తినప్పుడు,పురుషోత్తమ మహా రాజు/ పోరస్ ఎదిరించి, నిలువరించాడు.ఆ గ్రీకు వీరునికి"గజ దళములను యుద్ధ రంగంలో వాడ గలుగుతూన్నభారతీయుల రణ చాతుర్యానికి" అబ్బుర పడ్డాడు.అప్పటి దాకా యుద్ధములలోకేవలం అశ్వములనూ, కాల్బలములను నేర్చుకుని ఉపయోగిస్తూన్న పాశ్చాత్యులు.ఆ నాటి నుండే యూరోపులో పోరులో ఏనుగులను కూడా వాడటము మొదలు పెట్టారు.కేరళలోనూ, గోవా నుండీ, అండ మాన్ దీవులూ, శ్రీలంక వఱకూసముద్రములోనే ఏనుగులు ఈదుకుంటూ వెళ్ళ గలవు;ఇలాగ గజ రాజులకు శిక్షణను ఇచ్చిన ఘనతప్రపంచములోనే _మన భారత దేశములోని మావటి వాళ్ళకే దక్కుతూన్నదీ -అని మనం ఘంటా పథంగా చాట గలము.రాజ స్థాన్లో గజేంద్రుల సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు.మత్తేభాల పోషణ,సంరక్షణ,అజమాయిషీ చేయడం మావటి వాళ్ళ విధులు .అలాంటి 51 మావటీల కోసమూ, వారి ఏనుగుల కోసమూ“కుంద గ్రామము” ను నెలకొల్పారు.”భారత దేశంలోని ప్రప్రథమ హస్తి గ్రామం”గా సంబరాలను జరుపుకుంటూ,యాత్రా సందర్శకులకు ఈ గ్రామము ప్రత్యేక ఆకర్షణగా మారింది.రాజ స్థాన్లో గజేంద్రుల సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు.రాష్ట్ర ఉత్తర ప్రాంతంలో భూమిని కేటాయించారు.చారిత్రక ప్రాముఖ్యత కలిగిన “ అమర్ కోట “ కు దగ్గరలోఈ mahouts village ని, రాజస్థాన్ స్టేట్ గవర్నమెంటు ఏర్పరచింది.ఈ పల్లె రాష్ట్ర రాజధాని “జైపూర్”కు సమీపం లో ఉన్నది .“ జంతు ప్రపంచానికి ఇది గొప్ప వరము.ప్రస్తుతము 51 ఏనుగులకు ఇచ్చట వసతి సౌకర్యాలను కల్పిస్తున్నాము,తక్కిన వానికి కూడా త్వరలోనే ఈ సదుపాయాలను ఏర్పాటు చేస్తాము.” అంటూ,Rajasthan Tourism Minister Bina Kak అభిభాషించారు“నాకు వర్ణించ లేనంతా ఆనందంగా ఉంది.మావటి వారి యొక్క 40 సంవత్సరాల కల ఈ నాడు సాకారం పొందింది. "అని “ గజ సంరక్షకుల అసోసియేషన్ ప్రెసిడెంట్ అబ్దుల్ రషీద్ చెప్పాడు.అమర్ దుర్గంలోని 113 ఏనుగులు టూరిస్టులను అలరిస్తూంటాయి.వైస్ ప్రెసిడెంట్ శ్యాం గుప్త“ ఇటు స్వదేశీయులకూ, అట్టి విదేశీ టూరిస్టులకూఏనుగు సవారీ ముఖ్య ఆకర్షణ, ప్రత్యేకించి,ఇందుకోసమే డిమాండు ఉంటూన్నది కూడా!” అని వివరించారు.జంతువుల కోసం నీటి కొలనును, వెటెర్నరీ క్లినిక్ నూ నిర్మించారు.“ ఒక ఏనుగు రోజూ నాలుగు రౌండ్లు సవ్వారీలను తిప్పుతుంది.ఇందుకు 20 డాలర్లు ఆదాయం, అంటే 20 డాలర్లు లభిస్తాయి.అందులో నుండి 200 రూపాయలు జంతు సంక్షేమానికై చేర్చ బడతాయి. "అని శ్యాం గుప్త చెప్పారు.ప్రతి ఏటా 1.4 million tourists అమర్ దుర్గాన్నీ, పల్లెటూరునూ దర్శిస్తారు.ఏనుగుల నెక్కి, సవారీ చేసే అవకాశమే ప్రధాన ఆకర్షణ కదా మరి!కాస్త భూత దయకు మనసులో కూస్తంత జాగానుమానవుడు ఇవ్వాలి.రాజస్థాన్ రాష్ట్రం బాటలోఇతర రాష్ట్రాలు అడుగులు వేస్తే,అటు జంతు సంరక్షణా దృక్పథంతో పాటు ఆదాయమూ,ప్రజలకు వివిధ ఉపాధి మార్గాలూ ఏర్పడతాయి కదూ! ఔనా మరి!*********************************************మన కేంద్ర ప్రభుత్వం “ జాతీయ వారసత్వ జంతువుగా -ఏనుగు”ను గుర్తించినది.ఆగస్టు 31, 2010 న భారత కేంద్రం “Elephant Task Force” ను నియమించింది.మన దేశంలో నిర్దాక్షిణ్యంగా ఏనుగుల వధ జరుగుతూన్నది.ఈ దుర్మార్గాన్ని నివారించే దిశగాఇండియన్ గవర్నమెంటు 12 మంది సభ్యులతో కూడిన“ ఎలిఫంట్ టాస్క్ ఫోర్సు” ను నియమించింది.కమిటీ సభ్యులు కొన్ని సూచనలను చేస్తూఒక నివేదికను తయారు చేసారు.“గజ రాజులకు ప్రత్యేక గుర్తింపును కల్పించడం ద్వారాహస్తి సంపదను కాపాడ గలమని చెబుతూ,వానిని సంరక్షించే మార్గాలను వివరించారు.పర్యావరణ మంత్రి జై రాం రమేష్ తన ప్రకటనలో ఇలా అన్నారు“ఏనుగులు ఎన్నో ఏళ్ళుగా మన సంస్కృతిలో భాగం.పులుల మాదిరిగానే వీటిని కూడా సంరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.”2010 August 13 న “వన్య ప్రాణుల బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశం లోకీలక అంశాలను చర్చించినారు.ఎలిఫంట్ టాస్క్ ఫోర్స్ ప్రతిపాదనను అనుసరించి,కేంద్ర ప్రభుత్వం “వన్య ప్రాణ సంరక్షణ చట్టము”నుసవరించేందుకు ఉద్యుక్తమైనది.రాబోయే శీతా కాల పార్లమెంట్ మీటింగులలో ఈటాస్క్ ఫోర్సు,కమిటీల ప్రపోజల్సుకు అనుగుణంగా బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నది.
27, అక్టోబర్ 2010, బుధవారం
గజేంద్రుల “కుంద గ్రామము”
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి