17, అక్టోబర్ 2010, ఆదివారం

శ్రీ ఈశుని పార్వతి దేవి
రావి చెట్టు, వేప చెట్టు
పెళ్ళి సంబరాలు ;
అరటి తోట, నారికేళం
తోటల దోబూచుల ఆటలు ;

అరటాకుల కల కండలు,
వెన్న ముద్ద, కొబ్బరి ముక్కల్లు ;
క్రిష్ణయ్యా! పదవోయీ!
అమ్మ వారి కోవెలకు

చెరకు గడలు మీళాయించి
ప్రసాదాల వైభోగం
శ్రీ ఈశుని పార్వతి దేవి
మనకొసగును అనుగ్రహం

జయ జయ జయహో

[ బౌద్ధారామము ]  ;- వసంతసేన ;- లేఖకులు పరుగెత్తుతూ వస్తున్నారు. లేఖక్ 1 ;- అమ్మా వసంతసేనా! వైద్య సేవిక వలన కాకతాళీయంగా మాకు తెలిసింది,  ...