2, ఆగస్టు 2011, మంగళవారం

న్యూయర్క్ లోని “హరే క్రిష్ణ చెట్టు"


న్యూయర్క్ లోని “హరే క్రిష్ణ చెట్టు"






















న్యూయర్క్ పట్టణం అమెరికా లో ఉన్నది. 
అది సరే! ఐతే ఏమిటీ? అని సందేహం????
ఆ పాశ్చాత్య భూమిలో ఒక చెట్టు ఉన్నది.
అందులో చెప్పుకోదగిన విశేషం ఏమిటీ? అని సంశయ్???????
ఆ మహా వృక్షం పేరు "హరే క్రిష్ణ ట్రీ".
ఆ The Hare Krishna Tree  పవిత్ర వృక్షంగా భావించబడుతూన్నది. 
ఆ పాదపం వయసు చాలా ప్రాచీనమైనది!
వాతావరణ ఆటుపోట్లను తట్టుకుని, నిలబడిన తరువు అది.
A.C. Bhaktivedanta Swami Prabhupada,  
1966 వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ లో 
"హరే క్రిష్ణ భక్తి ఉద్యమము"ను నెలకొల్పారు. 
భక్తి వేదాంత స్వామి అందించిన శ్రవణప్రియమైన మంత్రము


"హరే క్రిష్ణ హరే క్రిష్ణ 
 క్రిష్ణ క్రిష్ణ హరే హరే
 హరే రామ హరే రామ
 రామ రామ హరే హరే!" 


The famous Krishna chant, 


“Hare Krishna, Hare Krishna, 
 Krishna Krishna, Hare Hare 
 Hare Rama, Hare Rama
 Rama Rama Hare HarE" 


Elm tree నీడలో భక్తివేదాంత స్వామి ప్రభుపాద అనుయాయులు 
"హరే క్రిష్ణ" పదే పదే మంత్రోచ్ఛారణ చేస్తూ, 
తన్మయులౌతూ నాట్యం చేసారు.
ఆ నాటి సమావేశంలో 
భక్త్యావేశంతో పరవశులైన వారిలో 
సుప్రసిద్ధ బీట్ కవి కళాకారుడు అల్లెన్ జిన్స్బర్గ్  
(famous Beat poet, Allen Ginsberg) కూడా ఉండటం విశేషం. 
అక్టోబర్ 16, 1966 న సుమారు రెండు గంటల సేపు 
ఈ అద్భుత సంఘటన ఆ ఎల్మ్ చెట్టు నీడలో ఆవిష్కృతమైనది.
నేటికీ హరే క్రిష్ణ సిద్ధాంత భక్తులు 
తమ భక్తికి ప్రతీకగా ఆ చెట్టును కొలుస్తూన్నారు. 
ఆ ఎల్మ్ తరువు వద్ద పుష్పముల దండలను, 
పూల గుత్తులనూ, ఇతర కానుకలను, టోకెన్ లనూ అక్కడ పెడ్తూంటారు. 
హరే క్రిష్ణ భక్తులు ఐచ్ఛికంగా ఈ పవిత్ర వృక్షమును పరిరక్షిస్తూన్నారు.  
The East Village Parks Conservancy వారి తోడ్పాటు 
ఈ మహత్కార్యానికి లభిస్తూన్నది. 
ఆ పర్యావరణ పరిరక్షణలో 
'తరు అర్చన' కూడా ఒక అంతర్భాగమే కదా!


న్యూయర్క్ లో “హరే క్రిష్ణ చెట్టు" ఆరాధన   (Link )

The Hare Krishna Tree is 
an American Elm (Ulmus americana) of undetermined age, 
but with the significant height and canopy 
coverage characteristic of its species
Tags to follow; 
Tompkins Square Park, ;New York City,
The East Village Parks Conservancy helps to care for the Elm trees in the park – ,  
To this day, adherents of the Hare Krishna faith pay tribute to the tree  
Rama Rama, Hare Hare,”

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...