23, ఆగస్టు 2011, మంగళవారం

భయపెట్టిన హిందీ హీరోయిన్ మందాకిని
"సార్వభౌముడు" - తెలుగు సినిమా షూటింగు జరుగుతూన్నది. 
ఆ షూటింగ్ వేళలో - 
గొల్లపూడి మారుతీ రావుకు 
గడ గడా వణుకు పుట్టించే అనుభవాలు ఎదురైనాయి.
ముందర రచయితా, ఆనక యాక్టర్ ఐన మారుతి కాలమే కుంచెగా
వాస్తవ సంఘటనలు హాస్య పద చిత్రాలుగా వెలిసి,
కితకితలు పెట్టే నవ్వులు 
చదువరులను వరించినవి.  
"ఆ చలన చిత్రము కోసం ఆఖరి షూటింగు ఆ రోజున కొనసాగింది. 
Cinema లో అది చివరి ఘట్టం. 
స్విమ్మింగ్ ఫూల్ అంచున నిలబడిన నన్ను  
వెనకనుంచీ వచ్చి 
అడుగున్నర పొడుగున్న కత్తితో 
(చేతి కర్రలోంచి దూసి) పొడుస్తుంది.
అంతే – నేను కేక వేసి – 
స్విమ్మింగ్ ఫూల్ లో పడిపోతాను. రక్తం,చావు డూప్ పని.
మందాకిని నాకు కొత్త.
ఆమె వెనకనుంచీ పొడవడం ఎలా చెయ్యగలదో? 
ఆవిడకు టైమింగ్ సరిగ్గా వచ్చునో లేదో!
రాకపోతే తప్పుకునే అవకాశం కూడా లేదు - 
వెనక జరుగుతోంది కనక.
తీరా కత్తి నాకు తగిలినట్టు తెలియాలి. 
ఒక్క అంగుళం తపినా నా ప్రాణానికి ముప్పు. 
షాట్ మరోసారి చేసే అవకాశం లేదు.
 ఒక్కసారి స్విమ్మింగ్ ఫూల్ లో పడితే - 
బట్టలూ, విగ్గూ అన్నీ తడిసిపోతాయి. 
మళ్ళీ షాట్ తియ్యాలంటే 
మళ్ళీ నాకు మేకప్ చేసి, పొడి బట్టలు కట్టాలి - రెండు గంటల మాట.
మందాకిని సెట్లో వలపులు ఒలకబోస్తోంది. 
అందరూ మూర్ఛపోయే స్థితిలో ఉన్నారు. 
ఒక్క నేనే - ~~~~~ అక్షరాలా 'ప్రాణసంకటం'లో - ఉన్నాను. 
ఆమెను పదిసార్లు అడిగాను - 
"జాగ్రత్తగా చెయ్యగలవా?" అని. 
"ఫరవాలేదు. పొడుస్తాను" అంది. 
షాట్ లో వెయ్యి దేవుళ్ళని మొక్కుకున్నాను. 
కత్తి నాకు తగిలే ముందు - చిన్న అరుపు అరవమన్నాను. 
ఏం జరిగిందో, ఒక్క క్షణం ముందే స్విమ్మింగ్ ఫూల్ లో దూకేశాను. 
ఫైట్ మాస్టర్ రాజు మరొక్క షాట్ అన్నాడు. 
"చస్తే చెయ్యను" అంటూ విగ్గు తీసేసాను. 
ఆ భయానికి నాకు వారం రోజుల పాటు మెడ నరాలన్నీ పట్టేశాయి........."
ఇలాగ అనేక అనుభవాలను
అక్షరములు అనే అపరంజి దారములలో 
పూసగుచ్చినట్లు వర్ణించారు మన మారుతీరావు గొల్లపూడి. 


 ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; 


నవ్వు పుట్టించే ఈ సంఘటన "అమ్మ కడుపు చల్లగా" లో
 - ౩౫౪ ( page 354) పేజిలో  ఉన్నది. 
 ఇలాంటి ఇబ్బందికరమైన అనుభవాలు గూర్చి గొల్లపూడి మారుతీరావు - 
తన ఆత్మకథ - "అమ్మ కడుపు చల్లగా"లో రాసినవి - సరదాగా ఉండి,  
పఠితలు పుస్తకాన్ని చదవడానికి చేతిలోకి తీసుకున్నాక - 
ఆసాంతమూ చదివేలా చేస్తాయి.


400(౪౦౦) పేజీలతో 
ఈ  పుస్తకం అచ్చు రూపం అందంగా ఉన్నది.


వివరాలకు -

www.kalatapasvicreations.com 
ఫోన్ :- ౦౪౪-౨౨౪౯ ౧౯౩౯ ; (044-2249 1939 );
          040-6673 8871, 98856 363666
address:-
kala tapaswi creations, 
2 floor, Sama towers, 
Himayat Nagar, 
Hyderabad - 500029
;

;

2 వ్యాఖ్యలు:

ANALYSIS//అనాలిసిస్ చెప్పారు...

ఆ సినిమా సార్వభౌముడు కాదండి ... బాలకృష్ణ మందకిని నటించిన భార్గవరాముడు. అందులో క్లైమాక్స్‌లో గొల్లపూడిని కత్తితో పొడిచి స్విమ్మింగ్ ఫూల్లోకి తొయ్యాలి .అప్పుడు స్వుమ్మింగ్ ఫూల్లోనున్న మొసలి గొల్లపూడిని తినేస్తుంది ... అదీ సీన్

kadambari చెప్పారు...

ANALYSIS//అనాలిసిస్ గారూ!
ఈ essayని రాసేటప్పుడు,
కొంచెం ముందే నాకూ ఈ సందేహం వచ్చింది.
కానీ, గొల్లపూడి వాక్యాలనే యథాతథంగా రాసాను.
మీ సూచనను అనుసరించి,
సవరణలు తాజా వ్యాసంలో పొందుపరిచాను,
చూసి, మీ అమూల్య అభిప్రాయాన్ని చెప్పవలసినది.
మీ సలహాకు కృతజ్ఞతలు.
I try to see the vedio/ DVD.

సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 5

అధ్యాయ శాఖ ;- 30 A ;-  తాటాకుల కవిలె కట్ట సేకరణ ;; ;           లేఖక్ 1 ;- ఇందాక వస్తుంటే - వీరకుడు తిట్టుకుంటూ వెళ్తున్నాడు, ఎవరినో!?  ల...