;
;
;
;
;
గోపాల బాలుడు- బృందావన సంచారి
మురళీ ధరుడు, మురిపాల క్రిష్ణుడు;
మన పాలి దేవుడు ||
;
గోరు ముద్దలన్నిటినీ మెసవుచుండును;
కూర్మి- యశోదమ్మ గారాలపట్టి వీడేను!
మాకెల్లపుడూ వీని ధ్యాస; వీడము ఈ ధ్యానము ||
;
గోటి మీద కొండనే నిలిపి ఉంచినాడు;
గోటి కింద పెద్ద పాము నణచినాడు గదటమ్మా!
సాటిలేని మేటి; అసాధ్యుడంటె వీడేను ||
;
గోరు మీద వెన్న ముద్ద చాలంటాడు; / కొసరుచుండెను;
సంగోరు భాగమీవే అని రాధను బులిపించును
గోపాలబాలుడు గోవిందుడు పురుషోత్తముడు ||
;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి