ఫొటో సౌజన్యము - మాల్గుడి డేస్ |
అధ్యాపకుల ఆటవెలది పద్యం ఒక బాలుని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది, భవిష్యత్తులో అతడు గొప్ప వ్యక్తిగా మారడానికి కారణమైంది.
20వ శతాబ్దం ఆధునికతను సంతరించుకుంటూన్న రోజులవి. చేతులకు మురుగులు, చెవులకు పోగులు, గిరిజాల జుట్టు –ఈ తరహా అప్పటి వేషధారణతో పిల్లవాడైన తాపీ ధర్మారావు స్కూల్లో ప్రవేశించాడు.క్లాసు పాఠాలకు సంబంధించి,కొన్ని ప్రశ్నలు వేశారు టీచర్.ఆ ప్రశ్నలకు జవాబు తెలియక,బాలుడు ఐన తాపీ ధర్మారావు తెల్ల మొహం వేయాల్సి వచ్చింది.అప్పుడు మాష్టారు నోటి వెంట వచ్చిన సమాధాన పూర్వక ప్రశ్నా పద్యం చెప్పారు...“మురుగులుంగరములు, ముత్యంపు సరులు;పురుషుని గైసేయు భూషణములె?అర నిమేషమునకు అన్నియు నశియించు.విద్య యొక్కటె యెపుడు విడని తొడవు!”చదువరులు సులభంగానే ఊహించి ఉంటారు.“నన్ను ఎద్దేవా చేయడానికే ఈ ఆటవెలదిని ఆడించారు” అని అనిపించింది ఈ కొత్త విద్యార్ధికి.అంతే! ఇల్లు చేరగనే, గమ్మున కర్ణాభరణాలనూ,కర కంకణాది ఆభరణాలనూ తీసేసారు.ఇతః పూర్వమే నానుడిగాప్రసిద్ధికెక్కిన పద్యములోని నాలుగో పంక్తినితన తండ్రి కూడా మందలిస్తూ చెప్పాడు కూడా!ఈ చిన్ని పరిహాసం,తాపీ ధర్మారావుని విద్యాసాధన పట్ల దృఢచిత్తునిగా మార్చి,సమున్నత వ్యక్తిగా నిలబడడానికి హేతువైనది.“ఆరు నూరైనా, నూరు ఆరైనా సరే!చదువులో ప్రథమ స్థానంలో నిలబడాలి ” అని అనుకున్నఆ నాటి బాలుడైన తాపీ ధర్మారావు.క్రమంగా సాహిత్యాన్ని సంఘసంస్కరణలకు ఆలంబనముగా మార్చి,అత్యున్నత గౌరవ యశస్సులను ఆర్జించగలిగిన మేధావి అయ్యాడు.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ఆ బిరుదు తాపీదే! 6 జూన్ 2011 (Link 2)తాపీ ధర్మారావు (Web patrika) (Link 1)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి