http://visit2universe.com/?p=512 |
ఆగస్ట్ 15 నుంచి ప్రారంభించిన
అన్నాహజారే దీక్ష నెగ్గింది.హమ్మయ్య! ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం కలిగింది,
అన్నాహజారే (కిసాన్ బాబూరావ్ హజారే) చేతిలో
జయ పతాక రెప రెప లాడుతూన్నది.
144 సెక్షన్ , గృహనిర్బంధాలూ, ఖైదు చేయడం,
జైలులో కూడా నిరాహార దీక్షను
ఆపకుండా కొనసాగించిన మన అన్నా
పాలకుల గుండెల్లో గుబులు రేపి, దడ పుట్టించడం,
ఎట్టకేలకు అవినీతిపై పూరించిన సమర శంఖారావం -
చెవులల్లో బిరడాలు పెట్టుకుని మరీ భీష్మీంచుకు కూర్చున్న
అధికార గణాలకు కదలిక పుట్టించడం .................
ఒకటేమిటి?, వరసగా ఆగని, ఆపలేని చారిత్రక సంఘటనల పరంపరలు.......
సమతా రాజ్యం కోసం బంగారు స్వప్నాలను కంటూన్న
కోటానుకోట్ల నయనాలలో నింపుతూఊన్న ఆనందబాష్పాలు ఇవి,
ఇవిగో! అన్నా హజారే మహాశయా!
నీకు మా అశ్రు పుష్పాంజలులు!
జన ప్రభంజన హృదయ ఘోష వెల్లువలో
విరబూస్తూన్న శత దళ పద్మము "లోక్ పాల్ బిల్లు" అమలులోకి రాబో తూండడం
విజయ ఢంకా దుందుభి ధ్వానాలు దశదిశలా మార్మ్రోగుతూన్న వేడుకలు!!!!!!!!!అన్నా హజారే(Ralegan Siddhiలో
జూన్ 15, 1938)born on 15 June 1937 )
in Bhingar, a small village) జన్మించారు.
అన్నా హజారేగా సుప్రసిద్ధుడయిన కిసాన్ బాబూరావ్ హజారే :-
ఆరుగురు సంతానంలో ఒకడు కిసాన్ బాబూరావ్ హజారే.
పేదరికంలో మగ్గే ఆ సంసారంలోని బాలుని,
బొంబాయి(ముంబై)లోని
అతని మేనత్త తీసుకు వెళ్ళి, పెంచుకొన్నది.
అక్కడ జీవితంలో అనేక మలుపులు;
పూల వ్యాపారిగ, వీధి రౌడీగా ......
నిరాశా నిస్పృహలతో "ఆత్మ హత్య చేసుకొనాలని "యత్నించి,
రెండు సార్లు ఆ ప్రయత్నం నుండి విరమించుకున్నాడు.
భారతీయ సైన్యంలో ఉద్యోగంలో చేరాడు.
యుద్ధ సమయంలో,
పెను ప్రమాదాలనుండి రెండు సార్లు తృటిలో బయట పడ్డాడు.
అప్పుడు "తన జీవితానికి సార్ధకతను కలిగించే లక్ష్యాలను " నిర్దేశించుకున్నాడు.
న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ లో ఒక పుస్తకం కొనాడు అతను.
వివేకానందుని రచన "జాతి నిర్మాణ గమ్య సాధనకై యువతకు పిలుపు" అనే
ఆ బూక్ అతనిని చాలా ప్రభావితం చేసినది.
రాజస్థాన్ లోని రాలె గావ్ అతడి స్వంత ఊరు.
స్వగ్రామమైన రాలె గావ్ ను అభివృద్ధి పరచుటతో
సామాజిక సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు.
ఒకప్పుడు కరువు కాటకాలతో విల విలలాడీన రాలేగావ్ ,
సుక్షేత్రంగా మారింది.
ఉల్లిపాయలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగి,
ఈ నాడు 80 లక్షల రూపాయల రాబడి ఆర్జిస్తూన్నది.
1975 నుండి,మిలిటరీ నుండి స్వచ్ఛంద విరమణ లభించిన
తర్వాత హజారే జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసారు.
మద్యపానాన్ని మాత్రమే కాక,
పొగాకు సంబంధితమైన సిగరెట్టు, చుట్ట వంటి
సకల దుర్వ్యసనాలనూ నిర్మూలిస్తూ,
రాలె గ్రామ వాసులలో కొంగ్రొత్త చైతన్యాన్ని నింపాడు.
1992 లో అన్న హజారే కు
పద్మ భూషణ్, పద్మశ్రీ, కృషి భూషణ,
ఇందిరా ప్రియ దర్శిని వృక్ష మిత్ర -
అలాగ అనేక బిరుదులు అతనిని వరించినవి.
విలువైన జాతీయ బిరుదు ప్రదానములు ఇచ్చి,
భారత ప్రభుత్వం తన విజ్ఞతను చాటుకున్నది.
హరిత ఛత్ర పునరుద్ధరణ, వాటెర్ షెడ్ ,
వ్యవసాయ, క్షీరాభివృద్ధి, సామూహిక వివాహాలు చేయుట,
అవినీతిపై పోరాటము, గ్రామ సభలు, పొదుపు - ఒకటేమిటి,
అన్ని కోణాలలోనూ ఒక గ్రామాన్ని పరిపుష్ఠంగా మలిచిన ధీరోదాత్తుడు.
అహర్నిశము అవినీతిపై పోరు చేసిన సామాజిక వీరుడు అన్నా హజారే!
మడమ త్రిప్పకుండా నిర్దేశించుకున్న
అత్యున్నత గమ్యానికి నడకను సాగిస్తూన్న గాంధేయ వాది మన అన్నాహజారే.
నిష్కల్మష సంఘ జీవన స్వరూప భవన నిర్మాణ కృషిలోకొనసాగుతూన్న
అలుపెరుగని కార్యకర్త.
ఏ రాజకీయ పదవులూ లేకుండానే
ఆదర్శ భారతావనికి పునాది రాయి వంటి రూపంగా
అతడు నిలబెట్టిన కుగ్రామం "రాలె గావ్".
(చిరంజీవి నిర్మించిన 'రుద్ర వీణ ' సినిమాకు
"అన్నా హజారే బ్రతుకు చిత్రమే స్ఫూర్తి"
అనడంలో అతిశయోక్తి లేదు.)
అన్నా హజారే "Youth for Better India"
జంతర్ మంతర్ వద్ద -- పూనుకున్న నిరాహారదీక్ష;
అవినీతి పై ధర్మాగ్రహ వ్యక్తీకరణకు
భారతీయుల జయ జయహో! జేజేలు! జోతలు !!!!! ఆయన ఇప్పుడు సాధించబోతూన్న విజయం ;
ఆయన ఒక్కడిదే కాదు, సకల భారతావనిదీ కూడా!!!!!!
97 గంటల పాటు సాగిన ఆన్న హజరె దీక్ష - 'విజయ దీపిక'ను చేత పట్టింది, చిన్నారి అందించిన నిమ్మ రసమును తాగి, అన్నా హజారే దీక్షని విరమించారు!
[ఆదర్శ భారతావనికి దొరికిన ఆశా దీపము అన్నా హజారే
శనివారం 9 ఏప్రిల్ ౨౦౧౧ (కోణమానిని బ్లాగులో రచన)]
కోణమానిని (Link for Essay)[9 April 2011]
Anna Hazare says, ( See Link) ::::::;;;
"Doesn’t a mother administer bitter medicines to a sick child
when she knows that the medicine can cure her child?
The child may not like the medicine,
but the mother does it only because she cares for the child.
The alcoholics were punished so that their families would not be destroyed.”
(5 April 2011 to exert pressure
on the Indian government
to enact a strigent anti-corruption law
as envisaged in the Jan Lokpal Bill )