అన్నా హజారే(Ralegan Siddhiలో జూన్ 15, 1938) జన్మించారు. అన్నా హజారేగా సుప్రసిద్ధుడయిన కిసాన్ బాబూరావ్ హజారే :- ఆరుగురు సంతానంలో ఒకడు కిసాన్ బాబూరావ్ హజారే.
పేదరికంలో మగ్గే ఆ సంసారంలోని బాలుని, బొంబాయి(ముంబై)లోని అతని మేనత్త తీసుకు వెళ్ళి, పెంచుకొన్నది.అక్కడ జీవితంలో అనేక మలుపులు; పూల వ్యాపారిగ, వీధి రౌడీగా ...... నిరాశా నిస్పృహలతో "ఆత్మ హత్య చేసుకొనాలని "యత్నించి, రెండు సార్లు ఆ ప్రయత్నం నుండి విరమించుకున్నాడు.భారతీయ సైన్యంలో ఉద్యోగంలో చేరాడు. యుద్ధ సమయంలో, పెను ప్రమాదాలనుండి రెండు సార్లు తృటిలో బయట పడ్డాడు.అప్పుడు "తన జీవితానికి సార్ధకతను కలిగించే లక్ష్యాలను " నిర్దేశించుకున్నాడు.న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ లో ఒక పుస్తకం కొనాడు అతను. వివేకానందుని రచన "జాతి నిర్మాణ గమ్య సాధనకై యువతకు పిలుపు" అనే ఆ book అతనిని చాలా ప్రభావితం చేసినది. రాజస్థాన్ లోని రాలె గావ్ అతడి స్వంత ఊరు. స్వగ్రామమైన రాలె గావ్ ను అభివృద్ధి పరచుటతో సామాజిక సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు.ఒకప్పుడు కరువు కాటకాలతో విల విలలాడీన రాలేగావ్ , సుక్షేత్రంగా మారింది. ఉల్లిపాయలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగి, ఈ నాడు 80 లక్షల రూపాయల రాబడి ఆర్జిస్తూన్నది.1975 నుండి,మిలిటరీ నుండి స్వచ్ఛంద విరమణ లభించిన తర్వాత హజారే జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసారు.మద్యపానాన్ని మాత్రమే కాక, పొగాకు సంబంధితమైన సిగరెట్టు, చుట్ట వంటి సకల దుర్వ్యసనాలనూ నిర్మూలిస్తూ, రాలె గ్రామ వాసులలో కొంగ్రొత్త చైతన్యాన్ని నింపాడు.1992 లో అన్న హజారే కు పద్మ భూషణ్, పద్మశ్రీ, కృషి భూషణ, ఇందిరా ప్రియ దర్శిని వృక్ష మిత్ర - అలాగ అనేక బిరుదు లు అతనిని వరించినవి. విలువైన జాతీయ బిరుదు ప్రదానలను ఇచ్చి, భారత ప్రభుత్వం తన విజ్ఞతను చాటుకున్నది. హరిత ఛత్ర పునరుద్ధరణ, వాటెర్ షెడ్ , వ్యవసాయ, క్షీరాభివృద్ధి, సామూహిక వివాహాలు చేయుట,అవినీతిపై పోరాటము, గ్రామ సభలు, పొదుపు - ఒకటేమిటి, అన్ని కోణాలలోనూ ఒక గ్రామాన్ని పరిపుష్ఠంగా మలిచిన ధీరోదాత్తుడు.అహర్నిశము అవినీతిపై పోరు చేసిన సామాజిక వీరుడు అన్నా హజారే!మడమ త్రిప్పకుండా నిష్కల్మష సంఘ జీవన స్వరూప భవన నిర్మాణ కృషిలోకొనసాగుతూన్న అలుపెరుగని కార్యకర్త.ఏ రాజకీయ పదవులూ లేకుండానే ఆదర్శ భారతావనికి పునాది రాయి వంటి రూపంగా అతడు నిలబెట్టిన కుగ్రామం "రాలె గావ్".(చిరంజీవి నిర్మించిన 'రుద్ర వీణ ' సినిమాకు "అన్నా హజారే బ్రతుకు చిత్రమే స్ఫూర్తి" అనడంలో అతిశయోక్తి లేదు.)
అన్నా హజారే Youth for Better India ; జంతర్ మంతర్ వద్ద -- పూనుకున్న నిరాహారదీక్ష; అవినీతి పై ధర్మాగ్రహ వ్యక్తీకరణకు భారతీయుల జయ జయహో! జేజేలు! జోతలు !!!!! ఆయన ఇప్పుడు సాధించబోతూన్న విజయం ; ఆయన ఒక్కడిదే కాదు, సకల భారతావనిదీ కూడా!!!!!! 97 గంటల పాటు సాగిన Anna Hazare దీక్ష - 'విజయ దీపిక'ను చేత పట్టింది, చిన్నారి అందించిన నిమ్మ రసమును తాగి, అన్నా హజారే దీక్షని విరమించారు!Anna Hazare says, ( See Link) ::::::;;;
"Doesn’t a mother administer bitter medicines to a sick child when she knows that the medicine can cure her child? The child may not like the medicine, but the mother does it only because she cares for the child. The alcoholics were punished so that their families would not be destroyed.”
PTI The Hindu Social activist Anna Hazare shows
a copy of the gazette notification after ending his fast
for 'Jan Lokpal Bill', at Jantar Mantar in New
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి