30, మార్చి 2011, బుధవారం
27, మార్చి 2011, ఆదివారం
వినోబా భావే
"వామన పండితుడు రచించినSanzasloki Gita (the Gita verse by verse) ను తెచ్చి పెట్టు, విన్యా!"ఆ పుస్తకాన్ని కొని తెచ్చి,తల్లికి ఇచ్చాడు వినోబా భావే.1915 లలో బరోడాలో జరిగిన "భగవద్గీతా ఉపన్యాసాలు"ఆమె రోజూ వినేది.బాల్యంలో సంఘటన వినోబా ఆలోచనలకు పునాది రాయిగా ఐనది.ఒక రోజు - Wordsworth poemsను చదువుతున్నాడు."ఏం చదువుతున్నావు, విన్యా!"అమ ప్రశ్నకు బదులిచ్చాడు -అమ్మా! నేను మంచి పుస్తకాలనే చదువుతున్నాను.""నువ్వు మంచి పుస్తకాలే చదువుతావునాకు తెలుసును. ఐతే భగవద్గీతను చదువు."పిల్లల వ్యక్తిత్వాలపై ఆమె ప్రభావము చాలా ఉన్నది.వారు సంఘ సేవకు తమ జీవితాలను అంకితం చేసారు.సంఘ సంస్కరణలలో మైలు రాళ్ళను నెలకొల్పిన ఘనత వారిదే!వినోబా భావే "భూదానోద్యమము" విజయవంతమైనది.ఆయన రూపొందించిన పద్ధతులతో,భూసంస్కరణలు పదుగురిచేత"శభాష్!"అంటూ మెప్పును పొందినాయి.వినోబా భావే మరాఠీ భాషలో శ్రీమద్భగవద్గీతా సారాంశము గురించిఅగణిత ఉపన్యాసాలను ఇచ్చారు.-రచించిన Discourses on Gita అమిత ప్రాచుర్యాన్ని పొందాయి.అనేక భాషలలో లెక్కలేనన్ని ప్రచురణలు జరిగాయి.ఈ పుస్తకములు పునర్ముద్రణలతో సరి కొత్త రికార్డులు వెలిసాయి.క్విట్ ఇండియా, స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొన్నాడుసబర్మతీ ఆశ్రమము వద్ద "వినోబా కుటీరము"సాంఘిక సేవలో పాత్రను పోషించింది."సర్వోదయ ఉద్యమము"ప్రజలలో నిద్రాణంగా ఉన్న సాంఘిక సేవాతత్పరతను మేల్కొలిపింది.మన రాష్ట్రంలో "పోచంపల్లి"వద్ద నుండిభూదానోద్యమాన్ని ప్రారంభించిన చరిత్ర పోచంపల్లి కి దక్కినది.
;;;;;;
(Acharya Vinoba Bhave. Born: 11 September, 1895. )
25, మార్చి 2011, శుక్రవారం
మాతృ మందిరము వద్ద మహా వట వృక్షము
;;;;;;;1968 లో ఆదర్శనగరము/ మరో ప్రపంచము –అనే సుందరస్వప్నానికి విల్లిపుత్తూరు జిల్లాలో,తమిళ నాడులో అంకురార్పణ జరిగినది.’అచ్చటి గ్రామ పట్టణము నామముఆరవిల్లి(Auroville in Pondicherry ).The Mother/ మాతృ దేవి గా గౌరవము పొందిన వనిత ఆమె.ఆమె పేరు మీరా అల్ఫ్సా( Mirra Alfassa).[Mirra Morisset and Mirra Richard(February 21, 1878 - November 17, 1973)]పాండిచేరి లోని అరవిందుని గురువుగాభావించిన ఈమె,ఆధ్యాత్మిక ప్రపంచములో –తాను చేసిన మంచి పనుల వలన – గుర్తింపును పొందారు.;;;;;పాండి చెరీ అరవిందుని ఆశ్రమము వద్ద,వేదాంతము, ఆధ్యాత్మిక భావాలు కల వారు ;యోగాసనములు మున్నగునవి, తపస్సు,పారలౌకిక చింతన, సంఘ సేవమొదలైన కార్యక్రమాల రూపొందించుటకుఅనువుగానూ, సేదదీరుటకై నిర్మించినదే "మాతృ మందిరముపాండి చెర్రీ అరవిందుని ఆశ్రమము వద్ద,ఆరవిల్లి గ్రామము (Auroville in Pondicherry ) వద్దఏర్పాటు అయిన బొటానికల్ గార్డెన్సు, 12 తోటలు/ ఉద్యాన వనాలుచూపరులకు కనువిందు చేస్తూన్నాయిఆరవిల్లె లోని వైజ్ఞానిక వనములోనెలకొన్న మహత్తర మహా పాదపము ఈ ఫొటోలోని గొప్ప మర్రి చెట్టు.100 సంవత్సరముల పై వయసు ఉన్న మర్రి చెట్టు ఇది.మాతృ మందిరము వద్ద ఉన్నఈ మహా వట వృక్షము 50 కి.మి. వైశాల్యములో విస్తరించి ఉన్నది.ఈ తరువు యొక్క ప్రతి ఊడ కూడా , మరల చెట్టుగా రూపొందినది.(మాతృ మందిరము వద్ద ఉన్న ఈ మహా వట వృక్షము)మర్రి చెట్టు ;
22, మార్చి 2011, మంగళవారం
fengshui లక్కీ మొక్కలు
ఫెంగ్ షుయ్ సాంప్రదాయంలోఇలాగ ప్రదక్షిణా దిశలో తిరిగిన వెదురు మొలకల మొక్కలుభాగ్యదాయినులు అనే భావన ఉన్నది.విపరీత పరిస్థితులను సానుకూలంగా మలిచే భాగ్యప్రదాతలు ఇవి,అని నమ్మకం ఉన్నది.lucky bamboo tree కాండ భాగములనుకళాత్మకంగా పెంచిన పద్ధతిని గమనించండి.ఆ మొక్కలు, చెట్లూ సౌందర్యానికి ఎత్తి పట్టిన దర్పణములు.కొన్ని నెలలూ, సంవత్సరాలూ పడుతుంది అవి ఇంత beautifulగా రూపు దిద్దుకోవడానికి.అందుకు ఎంతో నైపుణ్యమూ, ఓర్పు కావాలి.బోన్సాయ్ వంటి వృక్ష కళలు దర్శించే వారికి ఆహ్లాదాన్ని కలిగిస్తూంటాయి కదా!A fengshui lucky bamboo tree -the turning bamboo branches were saidto be able to turn fortune.Change the bad luck into good luck and fortunesee Link;
21, మార్చి 2011, సోమవారం
శ్యామ శాస్త్రి బొమ్మ
కర్ణాటక సంగీతానికి త్రి రత్నాలుత్యాగరాజు, ముత్తు స్వామి, శ్యామ శాస్త్రి లు(Trinity of Carnatic music ).శ్యామ శాస్త్రి రేఖా చిత్రాన్ని ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి వేశాడు,కానీ ఎందువలననో సగంలో ఆ పటము ఆగి పోయింది.పూర్తి కాని ఆ శ్యామ శాస్త్రి బొమ్మను,ఆయన అనుయాయులు పూజ గదిలో భద్ర పరిచి ఉంచారు.(The rest of the portrait was finished laterand it still survives,in the puja of Syama Sastri’s descendants. )ఎన్నో ఏళ్ళ అనంతరం ఆ బొమ్మపై దృష్టి సారించిన ఆర్టిస్టు ఎస్. రాజమ్,ఆ చిత్ర పటాన్ని వెలుగులోనికి తెచ్చాడు.తమిళ్ నాడులో 18 వ శతాబ్దం ఉత్తరార్ధములోకర్ణాటక సంగీత త్రి రత్నముల ((Trinity)ఫొటోలూ, చిత్రముల కొరకు అన్వేషణ జరిగినది.Music Academy వారు ,సాంప్రదాయక కళా అనుయాయులు ప్రయత్నించారు.అంతకు ముందరే/ మునుపు ఫురందరదాసు,స్వాతి తిరుణాల్(Purandara Dasa and Swati Tirunal) బొమ్మలను చిత్రించినS.రాజమ్* కు ప్రభుత్వం శ్యామ శాస్త్రి పట చిత్రణా బాధ్యతను అప్పగించింది.ఆయన తనకు ప్రభుత్వము తరఫున మ్యూజిక్ అకాడమీ వారు అప్పగించినఈ బృహత్ కార్యాన్ని భుజ స్కంధాలపై నిడుకొన్నాడు.శ్యామ శాస్త్రి భక్తుల వద్ద ఆ బొమ్మను కనుగొన్నాడు, చిత్ర సూత్రం కళా రీతిలో పూర్తి చేసాడు.( 40 సంవత్సరాల తర్వాత – “ఈ బొమ్మను వేసిన కళా కారుడు ఎవరు?”)అనే విషయం వివాదాలకు గురి ఐనది.)12 వ శతాబ్దము నాటి భారతీయ చిత్ర కళా రీతులను,దేవాలయ కళా పద్ధతులను రాజమ్ అనుసరించాడు.రేఖా చిత్రాలుగా వీనిని పేర్కొన వచ్చును.ఔట్ లైనులతో స్పష్టంగా చిత్రీకరణ ఉంటుంది,సహజ సిద్ధమైన రంగులను వాడుతారు.ఆయన “చిత్ర సూత్రము” అనే traditional painting method నుభక్తి శ్రద్ధాళువు ఐ అనుసరించాడు అని విమర్శకుల అభిప్రాయం.The Government of India and the Department of Posts06-01-1961 లో త్యాగరాజు బొమ్మను,1975/ 18-03-1976 లో ముత్తు స్వామి దీక్షితర్ బొమ్మను,21-12-1985 శ్యామ శాస్త్రి బొమ్మనుస్టాంపులుగా ముద్రించి, విడుదల చేసింది.ఎస్. రాజమ్(* మధురై లో సెప్టంబర్ 2 వ తేదీన, 1919 సంవత్సరంలోజన్మించాడు - (1919 to 2010 )ఎస్. రాజమ్ తమిళములో “సీతా కళ్యాణం” లో 1934 లో నటించాడు.ఆయన కర్ణాటక సంగీతములో నిష్ణాతుడుగా కీర్తి గడించాడు,కానీ చిత్రలేఖనంలో చేయి తిరిగిన కళాకారుడు- అని చాలా మందికి తెలియదు.ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్నిs. Rajam చెప్పారు.)స్టాంపులు (see the Link) ;
18, మార్చి 2011, శుక్రవారం
భట్టిప్రోలు బౌద్ధ స్థూపములు , లిపి మాతృక
భట్టిప్రోలు మన తెలుగు నాట ఉన్న చిన్న గ్రామము.గుంటూరుకు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ కుగ్రామం,క్రీస్తు పూర్వం నుండీ ఆంధ్రుల ఘన చరిత్రకు నిదర్శనము.మెగస్తనీసు 30 ఆంధ్ర దుర్గాలను పేర్కొన్నాడు,వానిలో విశిష్టమైనది "భట్టిప్రోలు".భట్టి ప్రోలు లిపి ->_________క్రీస్తు పూర్వం 500 నుండీ రూపు దిద్దుకో సాగినది.300 నాటికి “భట్టిప్రోలు లిపి" గా స్వరూపం దిద్దుకున్నది.మౌర్య లిపికి , ఎదిగిన లేఖనము అనవచ్చును.తెలుగు బాస కు భట్టిప్రోలు లిపి మాతృక - అని భావించ వచ్చును.లలోనే ఏర్పడిన తెలుగు భాషా మూల రూపంగా“భట్టిప్రోలు లిపి" -Linguistics లో ఉన్నత స్థానాన్ని పొందింది.కుబేరకుడు అనే రాజు పరిపాలన, మౌర్యుల కన్నా ముందేతెలుగు సీమకు ప్రతిష్ఠాకరమైన చారిత్రక నాగరికతవిలసిల్లినదనడానికి బలమైన ఋజువులు.కుబేరకుడు/ కుభీరక/ కుబేర ధనదుడుప్రతీపాల పురమును రాజధానిగా రాజ్య పాలన చేసాడు.[Pratipalapura (Bhattiprolu), ]నాటి ప్రతీపాల పురమే నేటి భట్టిప్రోలుబ్రాహ్మీ లిపి Brahmi script విభాగములోనిదిఅని చరిత్రకారుల అభిప్రాయం.క్రిష్ణా నదీ మైదానానికీ,బంగాళా ఖాత మహా సముద్ర తీరానికి చేరువలో ఉన్న కుగ్రామం ఇది.గుంటూరు- రేపల్లె రైలుమార్గము వద్ద ఉన్న ప్రాంతము."భట్టిప్రోలు శాసనాలు"తెలుగు లిపి యొక్క ప్రాచీనతకు ప్రత్యక్ష సాక్ష్యాలు.బ్రిటిష్ పాలకులు మొట్ట మొదటి సారి1870 లో భట్టిప్రోలు వద్ద తవ్వకములు జరిపారు.అటు పిమ్మట ఆ అంగ్లేయులే వరుసగా తవ్వకములు జరిపించినారు.[ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, చరిత్ర పట్ల ,మాతృ భూమి పట్ల పౌరులకు ఉండ వలసిన భక్తి శ్రద్ధలకు -బీజము వేసిన వారు వారేనని- ఒప్పుకోవలసినదే!]భట్టిప్రోలు వద్ద విక్రమార్క దిబ్బ - ను తవ్వగాఈ శిథిలాలు బయల్పడ్డాయి."ధాతు కరండము", స్థూపాలు మున్నగు అమూల్య సంపద ప్రత్యక్షమైనది.1870 లో బాస్వెల్, 1871 లో సర్ వాల్టేర్ ఎలియట్,అప్పటి నుండీ 1874 వఱకూ రాబర్ట్ సీ వెల్ ;పిమ్మట 1892 లో అలెగ్జాండర్ రే,అటు పిమ్మటచాలా కాలం తర్వాత -1984 లో బుహ్లార్, 1969 లోనూ, 1970 లలోనూడా. ఆర్. సుబ్రహ్మణ్యం మున్నగు వారెందరో పరిశోధనార్ధమై,భట్టిప్రోలు పల్లె సీమ వద్ద త్రవ్వకాలు జరిపించారు.archialogy of survey India ఆధ్వర్యంలో జరిగినవి."శిలా మంజూష" ఇక్కడి విశిష్ట వస్తువు.ఈ రాతి పెట్టెలో బుద్ధుని ధాతువులు, వెండి భరిణలు,నవ రత్నాలు, కుందన పుష్పాలు ఉన్నవి.మహా స్థూపాలు , చైత్యము, బౌద్ధ విహారాలు ఇత్యాదుల నిర్మాణాలు -భట్టిప్రోలులో విభిన్నంగా ఉండి,విశిష్టతను కలిగి ఉన్నాయి.8 అడుగుల ప్రదక్షిణా పథము,దారి సువిశాలంగా ఉన్నది.స్థూపము :-1. పద్మ దళాకారంలో ,2. 1700 చదరపు గజాల విస్తీర్ణము3.148 అడుగుల "మేధి" ( డ్రమ్ ఆకారము );4. 40 అడుగుల ఎత్తు కలిగి ఉన్నది. ;పాల రాయి తో కట్టిన గోడ కట్టారు.5. స్థూప నిర్మాణానికై- 45 ×- 30 × 8 కొలతలు గలఇటుకలను వాడారు.
ఇంగువ కార్తికేయ శర్మ, టి.వి.జి. శాస్త్రి, పి.ఆర్.కె. ప్రసాద్,సి. శివరామమూర్తి, ఎస్. శంకర నారాయణన్, చరిత్ర రీసెర్చ్ లో కృషి చేసారు.భట్టిప్రోలును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయదగిన సీమ - అనిమేధావులు పలువురు అభిప్రాయాలను వెలిబుచ్చారు.ఉత్తర ప్రదేశ్ లో బుద్ధ దేవుని విగ్రహమును నెలకొల్పారు.అతి గొప్ప విగ్రహము మనకు గర్వ కారణము.ఈ సందర్భంగామన ఆంధ్ర ప్రదేశ్ లోని [ SEE LINK]ఒక బౌద్ధ స్థూపము గురించి ప్రస్తావన ,విహంగావలోకనముగా చేద్దాము/చేసాము..
16, మార్చి 2011, బుధవారం
అరుదైన ఫొటో
కాశ్మీర్ లోనిక్షీర్ భవానీ మాత కోవెలను దర్శించాడుస్వామివివేకానందుడు.అక్కడి దేవళాలకు చారిత్రక నేపథ్యం ఉన్నది.శ్రీ లంకలో "త్రిపుర"గా కొలువబడే మహిళ ఆమె.రామాయణ కాలములో ఆమె హిందూ దేశాన్ని సందర్శించినది.ఇక్కడ ప్రజలు, "రాజ్ఞి" గానూ, దుర్గా దేవి అంశ కల దేవతగానూ భావించి,గౌరవ సేవా అర్చనలను చేస్తారు.ఆమె దుర్గా అవతారమే ఐనా,ఇక్కడ వైష్ణవ రూపిణిగా భక్త కోటిని పరిపాలించే జననీ దేవత ఈమె.1859 లో ఆయన కాశ్మీర్ లో కోవెలను దర్శించినప్పుడు,అక్కడి కాశ్మీర్ పండితులను కలిసినప్పుడు, తీసిన అరుదైన ఫొటో ఇది.[see link:
13, మార్చి 2011, ఆదివారం
టక్కు టిక్కు చమకుల బండి
జమ్మల మడుగు మాధవ రామ శర్మ* సంస్కృత అధ్యాపకులు.నాగార్జున యూనివర్సిటీలో M.A. students కి క్లాసులోసంస్కృత పాఠాలను చెబుతున్నారు .ఒక రోజుక్లాసులో lessons చెబుతున్నారు.పక్కనే రోడ్డు మీద వెళుతూన్నకార్లు, వాహనాల హారన్ మోతల హోరు"గయ్ గయ్"న వినిపిస్తూన్నాయి.ఆ హారన్ మోతల గోలతో అందరికీ విసుగు వచ్చింది.జమ్మల మడుగు మాధవరామ శర్మ గారు" ఏమిటా కారు కూతలు?**"అంటూవిసుగెత్తి, పుస్తకం మూసేసారు.[Car+కూతలు ]అలా bookని మూసి పెడ్తూండగా,కొన్ని కాగితాలు కింద పడ్డాయి. ఆ అధ్యాపకుడు"ఇవి ప్రేమ లేఖలు(*1) మాత్రం కావు"అన్నారు.అనువాద ఆంధ్ర చిత్రం "ప్రేమ లేఖలు" వచ్చింది.అప్పట్లో "ఆహ్"అనే హిందీ సినిమాకు"ఏకాంతము, సాయంత్రము"అనే పాట -రాజ్ కపూర్, నర్గీస్ లునటించిన"ఆహ్"అనే movieలోనిదే!
[* గండికోట కడప జిల్లాలో ఉన్న దుర్గము(Fort).ఈ చారిత్రక కట్టడములో" మాధవ రాయ , రంగనాథ స్వామి మొదలైన Temples"ఉన్నవి.తల్లి దండ్రులు ఆ పేరును పెట్టి ఉంటారు]ఇలాటిదే మరో చెణుకు, సారీ! చమత్కారము."చెణుకులు"ఎదుటి వారి మాటకు టక్కునచిట్టి వ్యంగ్యంతో విసిరే వాగ్బాణము - అన్న మాట.చమత్కారము, మామూలుగా సంభాషణలలో,స్వగతంలో గానీ దొర్లే హాస్యపు పుప్పొడి జల్లు.ఆచార్య బేతవోలు రామబ్రహ్మం కవి, రచయిత.ఆయన అవధానములు చేయడంలో కూడా ప్రతిభ కలిగిన మనిషి.#అష్టావధానాలలో ఒక ఐటం "అప్రస్తుత ప్రసంగము" .అవధానము చేస్తూన్న కావ్య రచయితను ,ప్రస్తుతం జరుగుతూన్న సాహిత్య పాండిత్యానికిసంబంధము లేనటువంటి ప్రశ్నను పృచ్ఛకుడు అడుగుతాడు.అంటే పిచ్చాపాటీలో దొర్లే తమాషా కబుర్ల లాంటి వాటిని సంధిస్తూ,ప్రశ్నలతో అవధాని ఏకాగ్రతకు భంగం కలిగిస్తూ,ఆతనిని విసిగిస్తాడన్న మాట.ఇలాగే ఒక పృచ్ఛకుడు రామ బ్రహ్మం గారిని," అప్రస్తుత ప్రసంగ విభాగం"లో సారస్వత ప్రసంగాలను మధ్యలో కెలికాడు."అవధాని గారూ! మీకు కాఫీ ఇష్టమా? టీ ఇష్టమా?"ఇదీ ఆ Question.బేతవోలు రామ బ్రహ్మం అధ్యాపక వృత్తిలో ఉన్నారు.Teacher ఐన ఆయన ఠక్కున చెప్పారు ఇలాగ" మనం టీచర్లం కదండీ!""టీ+చర్" - (see LINK)ఈ రీతిగా ఉండేవిఆనాటి సాహితీ వ్యాసంగాలతోఆంధ్ర దేశంలో సామాన్య ప్రజలు కూడామేధస్సును చురుకుదనం నింపే కాలక్షేపాలతోవాతావరణం కులాసాగా, ఉల్లాసంగా ఉండేది.నేడు, పత్రికలలో శీర్షికలను, పెట్టేటప్పుడు, శ్లేష్లతో,కాస్త వ్యంగ్యం మిళాయించిheadings ను పెడ్తున్నారు.ఈ పద్ధతికి పునాది వేసినవి నాటిTelugu Literature చమత్కార ప్రయోగాలే కదా !&&&&&&&&&&&&&&&&&&"తెలుగు"లో ఆలోచిస్తూ, ఇంగ్లీషు టైపింగులో -అప్పుడప్పుడూ, అక్షర తప్పులు - పడుతూంటాయి.ఇవ్వాళ " వద్యార్ధులు" - అని వచ్చింది ,చూసి, వెంటనే సరి దిద్దాననుకోండి.ఇలాటి అప్పు తచ్చులు- కు ఆద్యులు ,ముళ్ళపూడి వెంకట రమణ గారు .ఆయన దారి చూపించారు,తదుపరులు ఆ మార్గంలో నడవ యత్నించే బాటసారులు;కీర్తి శేషులు ము.వె.ర. కు కృతజ్ఞతాంజలి.[*1 [ఇప్పటి స్టూడెంట్సు ఐతే ఆ కూతకు -ఇంకొక చమక్కును విసిరే వాళ్ళే!అప్పటి బుద్ధిమంతులైన విద్యార్ధులు ఉన్న రోజులు,కాబట్టి దీనికి దీటైన ప్రత్యుత్తరం రాలేదు- అని అనుకుంటున్నాను.][** "కారు కూతలు కూయబోకుమురోరి...... "అంటూ ఘటోత్కచుడు ఏదో సినిమాలో "పద్య సంభాషణతో"తిట్టాడు]
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...