10, మార్చి 2011, గురువారం

నూట పదహార్లు, నాకు చాలు!


1942 లో “దీన బంధు” సినిమా నిర్మాణం కొనసాగుతూన్నది.
చిత్తూరు నాగయ్య ఆ movie లో
కథా నాయకుడు.
The Paul Muni of India’గా ప్రస్తుతి కెక్కారు చిత్తూరు నాగయ్య.
200 సినిమాలలో నటించారు.
తెలుగు,తమిళ,మలయాళ, హిందీ చలన చిత్రాలలో నటించారు.
ఆయన నటనతో ప్రేక్షకుల హృదయాలలో
అజరామరమైన స్థానాన్ని సముపార్జించారు.
ఇంత మంచి పాట - పడవ వ్యాహ్యాళి సీను కోసం తగునా?
ఇలాంటి తర్కమూ, మీమాంస అక్కడ వచ్చాయి.
ఒక పడవ షికారు దృశ్యాన్ని చేయ దలుచుకున్నారు నిర్మాతలు.
దర్శకులు “ఈ సీనుకు పాట రాసి పెట్టండి సుందరాచారి గారూ!” అని అడిగారు.
సంభాషణలు, పాటలను కూడా రాస్తూ ఉన్న
సుందరాచారి కలంలో అప్పుడు చిందులాడిన పద లహరికలే
“మా తెలుగు తల్లికి మల్లె పూదండ......”
నూట పదహారు రూప్యములను గౌరవముతో ఇస్తూ,
“ ఇంత మంచి పాటను బోటు షికారు – సీనులో వాడటం పొరబాటే ఔతుంది.”
అని దర్శక, నిర్మాతలు తలిచారు.
116/- రూపాయలు ఆయనకు గౌరవ పురస్కరంగా ఇచ్చారు.
అటు పిమ్మట వేరే పాటను రాయించుకునినారు.
(దీన బంధు లో టంగుటూరి సూర్య కుమారి నటించినది.
బలిజేపల్లి లక్ష్మీ కాంతం మున్నగు వారు గీతాల కల్పనలో పాలుపంచుకున్నారు.
1. మురళీ మురళీ
2. మురళీ మోహన
3. రారా! బిరాన.......
ఇత్యాది గీతాలు ఉన్నవి.)
టంగుటూరి సూర్య కుమారి గ్రామ ఫోను రికార్డు (His Master's Voice) కోసం
తనే తీసుకుని వెళ్ళి,
ఆ రచనను ఆలపించినది.
(అప్పుడు కూడా రచయితకు పారితోషికం - 116/ రూపాయలు లభించినది.
మొదటి ప్రపంచ తెలుగు మహా సభల్లో ప్రార్ధనా గీతంగా ఈ గీతాన్ని
టంగుటూరి సూర్య కుమారి గానం చేసింది.
అప్పటినుండీ ఆ రచనకు అమిత ప్రచారం లభించింది.
శంకరంబాడి సుందరాచారి 1961 లో రవీంద్ర నాథ ఠాగూర్ “గీతాంజలి”ని తెనిగించారు.
ఆయన చేసిన అనేక రచనలలో
సుందర రామాయణము
సుందర భారతము
బుద్ధ గీత ( మూడు సంవత్సరాలలో 15 వేల ప్రతులు sale అయ్యాయి.)
మున్నగునవి పేరెన్నిక గాంచినాయి.
శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయము-లో సభ జరిగినది.
అచ్చట విశ్వనాథ సత్యనారాయణ, రాయప్రోలు సుబ్బారావు, గడియారం వేంకట శాస్త్రి మున్నగు
సాహితీ దిగ్దంతులు ఉన్నారు.
ఆ సన్మాన సభలో శంకరంబాడి సుందరాచారి గారికి
“ ప్రసన్న కవి” అనే బిరుదుతో సన్మానం చేసారు.
అనేక సాహితీ సంస్థలు, సాంఘిక సేవా సంఘాలు
ఆయనను సత్కరించాయి.
చిత్రమేమిటంటే చాలా ఏళ్ళ వరకూ
ఆయన పాండితీ ప్రకర్షకు తగినంత గుర్తింపు రాలేదు ,
కానీ కొన్ని సంవత్సరాల వ్యవధి తర్వాత – ఈ పాట మన్నన పొందింది.
భారత దేశము తొలి ప్రధాని – జవహర్ లాల్ నెహ్రూ –
అతనితో మాట్లాడేటందుకు మూడు నిముషాలు మాత్రమే కేటాయించారు.
అటు తర్వాత నెహ్రూజీ క్రమంగా ఎక్కువ సేపు సంభాషించారు.
అలాగ మాట్లాడుతూ English భాషలో అనువదింప బడిన
దేశ భక్తి స్ఫూర్తి ని నింపుకున్న పాటను విని,
ఆ రచయిత శంకరంబాడి సుందరాచారి గారిని,
ఆలింగనం చేసుకుని, బహుమానించారు.
సుందరాచారి నిరాడంబర జీవనం గడిపిన వ్యక్తి.
1970 లో ఢిల్లీ ఆంధ్ర సంఘము - సభను ఏర్పాటు చేసింది.
అక్కడ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్
"మీకు ఎట్టి సన్మానం కావాలి?" అని అడిగారు.
"నూట పదహారు రూపాయలు, శాలువా చాలును."
అన్నాడు శంకరంబాడి.
మన తెలుగు నాట వివాహాది శుభ కార్యాల సందర్భాలలో
ఆడ పడుచు లాంఛనాలుగా
- నూట పదహార్లు ఇచ్చుట - సాంప్రదాయముగా ఆచరణలో ఉన్నది.
సుందరాచారి కూడా ఆ సంఖ్యనే అడిగారు.
ఆ నిరాడంబరమైన వ్యక్తిత్వానికి ముగ్ధులైనారు రాజేంద్ర ప్రసాద్.
అందరూ సుందరాచారి నిష్కల్మష తత్వాన్ని శ్లాఘించారు.
రచయితకు, ఆయన కోరినవే బహుమతిగా లభించినవని
వేరే చెప్పనక్కర లేదు కదా!!
"మా తెలుగు తల్లికీ మల్లె పూ దండ
మా కన్న తల్లి కీ మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపూలో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి
గలగలా గోదారి కదలి పోతుంటేను
బిరాబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
అమరావతి నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలిచి వుండేదాక
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మాచెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం - నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లి ! జై తెలుగు తల్లి ! "

**************************

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...