ఆరుద్ర అసలు పేరు –భాగవతుల సదా శివ శంకర శాస్త్రి.ఆయన గడ్డం పెంచుకోసాగారు.గడ్డం పెంచుకుంటూన్న కొత్తల్లో,జరిగిన సంఘటన.ఆరుద్ర రోడ్డుమీద నడిచి వెళుతూన్నారు.ఒక జర్నలిస్టు ఎదురు పడ్డాడు.“ మీకు ఈ చిరు గడ్డం అందం ఇచ్చింది.అచ్చం షాజహాన్ లాగా ఉన్నారు.”అది వినగానే ఆరుద్ర “ గట్టిగా అనకయ్యా బాబూ!మా ఆవిడ వింటే వింటే కట్టించమంటుందీ!!!”ఠకాల్ న అన్నాడు."సౌదామిని"అనే సినిమాతో1951 లో వెండి తెరపైకి అరంగేట్రం చేసారుఆరుద్ర ఉరఫ్ భాగవతుల సదా శివ శంకర శాస్త్రి.నాలుగు వందల సినిమాలకు,ఐదు వేల పై చిలుకు పాటలు రాసిన స్పీడు కవి "ఆరు"ద్ర.రచయిత్రి రామ లక్ష్మి , ఈ హేతువాదికి అర్ధాంగి." నాకు జంధ్యము లేదు, నా శ్రీమతికి మంగళ సూత్రము లేదు."హాస్యోక్తిగా చెబుతారు ఆరుద్ర.రావి కొండల రావు రచనలు పుస్తకముల ముద్రణ జరిగింది.అతను తన పుస్తకములను తీసుకుని ఆరుద్ర వద్దకు వెళ్ళాడు.రావికొండల రావు ఒక పుస్తకమ్మీద “6ద్ర” అని ,మరొక పుస్తకం లో “sixద్ర ” అనీ ఆటో గ్రాఫు తో ,పుస్తకములను ఇచ్చాడు.ఆరుద్ర దరహాసం “ మౌంటెన్స్ డు నాట్ కం “తన”అంటూ తన మ్యాజికల్ జవాబును ఇచ్చారు.{ mountains do not come రావి కొండల రావు }“రూపంలో సొగసరి, ముఖ మెరుపు, గడ్డం నెరుపు,జుబ్బా, పైజమా , పైన శాలువాతో హడావుడిగా అగుపించే ఆరుద్రను“ సహృదయుడు, రస హృదయుడూ, సరస హృదయుడూ, చమత్కారీ,‘చమక్ కారీ, జోకు చెయ్యని సంభాషణ ఉండదు, జోకు చెప్పని ప్రసంగం లేదు."అంత్య ప్రాసలకు ఆరుద్రను వాడుడు" అన్నంతగాఆతని పాటలో ఎక్కువగా అంత్య ప్రాసే కనిపిస్తుంది.బాల్యంలో కష్ట పడి గారడీ విద్య ను నేర్చుకున్నాడు ఆరుద్ర.ఆ ఇంద్ర జాలాన్ని గీత రచనల్లో కూడా ఉపయోగించుకున్న సమర్ధుడు అతడు.పాటల్లో సైతం magic వాడి,“ఆహా! లిరికల్ మెజీషియన్” అనిపించుకున్నారు.Arudra ( read essay in my blog)
11, మార్చి 2011, శుక్రవారం
sixద్ర , mountains do not come ,
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 5
అధ్యాయ శాఖ ;- 30 A ;- తాటాకుల కవిలె కట్ట సేకరణ ;; ; లేఖక్ 1 ;- ఇందాక వస్తుంటే - వీరకుడు తిట్టుకుంటూ వెళ్తున్నాడు, ఎవరినో!? ల...

-
పార్లమెంటు ఉభయ సభలలో వాదోపవాదాలు , వాడిగా- వేడిగా సాగుతూండేవి. నియంత గా ప్రసిద్ధి కెక్కిన రష్యా దేశ నేత స్టాలిన్ . ఆ నిరంకుశ నాయకున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది....
-
పౌరాణికముల గాధావళి ఆధారముగా లోకోక్తులు ::: ''''''''''''''''...

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి