8, మార్చి 2011, మంగళవారం

రాజా వారికి ఏనుగులు లేవు













విజయ నగరంలో మహా రాజా వారి “హస్త బల్” అనే నాటక శాల, ఉన్నది.


ఆ స్టేజీ మీద ఆరుద్రకు సన్మానం వైభవంగా జరిగింది.
ఆ సన్మాన సభలో దిగ్గజాల్లాంటి పండితులు మాట్లాడారు.
మహా రాజా వారు ఏనుగులు కోసమని కట్టిన
ఈ ‘హస్త బల్ ‘ స్థలంలో సాహిత్యంలో గజ రాజు వంటి
ఆరుద్ర గారికి సత్కారం జరగడం గొప్ప ఔచిత్యం.”
అంటూ వక్తలు తమ ప్రసంగాలలో ఉటంకించారు.
అపరిమిత శ్రమతో అద్భుత పరిశోధనలను, అందించిన వ్యక్తి ఆరుద్ర.
“మహా రాజా వారికి ఏనుగులు లేవు.
ఇక్కడ ఆయన ఏ నాడూ ఏనుగుల్ని కట్ట లేదు.
ఇది అశ్వ శాల మాత్రమే!
’stable’ అంటే ‘గుర్రాల శాల ‘.
తెలుగులో “ఇ” అని -
ఇంగ్లీష్ లో S అనే letter
ఆది ని ఉన్న పదాలకు 'ఇ'ని చేర్చే
పదాల పరిణామం ఉన్నది.
ఉదాహరణకు ‘ఇస్కూలు ’ అని పలుకుతారు.
అలాగే -> stable పరిణతి జరిగింది.
స్టేబుల్, ఇస్టేబుల్, అస్తేబుల్,
అస్తబల్ అయి, హస్త బల్ ఐనది.” అన్నారు.
చరిత్రను అంత నిశిత పరిశోధన చేసిన ఆరుద్ర మీద
ప్రశంసల జల్లులు కురిశాయి.
భాగవతుల శివ శంకర శాస్త్రి,
(Bhagavatula Siva Sankara Sastri/ Arudra)
"ఆరుద్ర" కలం పేరుతో ప్రఖ్యాతి గాంచారు.
"సమగ్రాంధ్ర సాహిత్యము" తెలుగు సాహిత్యానికి
ఆయన అందించిన విశిష్ట రత్నము.

&&&&&&&&&&&&&&







కొన్ని సినిమాలకి తాపీ ధర్మా రావు, ఆరుద్ర
సంయుక్తంగా రచనల పని చేసారు.
వెండి తెర పైన “ తాపీ, ఆరుద్ర” అని వేసే వారు.
అందుకు, ఆరుద్ర అందుకున్న చమత్కారం ఇది.
“ఒకరు తాపీ, మరొకరు ఆదుర్దా.”

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...