13, మార్చి 2011, ఆదివారం

పట్నూలు వీధిలో 60 ఏళ్ళనాటి పుస్తకములు




“ పట్నూలు వీధి” తిరుపతిలో ఉన్నది.
దీనికి సాంఘికమైన చారిత్ర విశిష్టత
ఉన్న వీధి ఇది.
ఈ వీధికి “ పరసాల వీధి” అనే పేరు
కాల క్రమేణా వచ్చినది.
పట్నూలు – అనగా
పట్టు, నూలు అనే మాటల కూడిక.
పట్టు బట్టలను నేసే వృత్తిని
ఇక్కడి “ పద్మ శాలీలు” స్వీకరించారు.
ఇప్పటికీ అక్కడ ఒక పుస్తకము ఉన్నది.
ఈ పొత్తములో కథలూ, పద్య కావ్యాలూ, నాటకాలూ ఏమీ లేవు.
కానీ ఇది చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉన్న వస్తువు –
ఖచ్చితంగా చెప్ప వచ్చును.

60 సంవత్సరముల నుండీ,
నిరంతరముగా రాయబడిన
పుటతో అలంకృతమైనది ఆ గ్రంథము.
ప్రపంచ గమనంలో జరిగిన అనేక
మార్పులలో ఒకటి,
ఇండియాలో అనేక చేతి వృత్తులు ధ్వంసం అవడము .
పద్మశాలీలు కూడా ఆ దుష్పరిణామానికి గురి అయ్యారు.
ప్రాచీన కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చేనేత పని కూడా
నేడు అలాటి అవస్థలో ఉంది .
అదృష్టవశాత్తూ పుణ్య క్షేత్రమైన తిరుపతిలో ఉన్న
వస్త్ర కళా జీవులు నూతన ఉపాధిని చేపట్ట గలిగారు.
తిరుమలకు వచ్చే యాత్రికులకు వసతి,సౌకర్యాలు అవసరమౌతూన్నాయి.
భక్తులకు కావలసిన సదుపాయాలను కల్పించడం వలన
ప్రజలకు, కొత్త మార్గంలో జీవనోపాధి లభ్యం కాసాగింది.
సప్తగిరుల దరిని నివసిస్తూన్న “ పద్మశాలీలు” ఈ కోవలోనికి వచ్చారు .
సుమారు పాతిక కుటుంబాల వారు
భక్తులకు ఆతిథ్యము ఇచ్చే పుణ్య కార్యాన్ని నిర్వహించసాగారు.
ఏడుకొండల వేంకటేశుని దర్శనము చేసుకొనాలని
వచ్చే భక్త జనావళికి,పట్నూలు ఏరియా వాసులు
బస కల్పించే వారు.
కర్ణాటక, తమిళ నాడు, మహారాష్ట్రల నుండి
అధిక సంఖ్యలో ఇక్కడికి జనులు వస్తూండే వారు.
ఆ రోజులలో ఎద్దుల బండియే వాహనము.
ఎడ్ల బళ్ళ మీద వీరి గృహాలకు వచ్చి చల్లని నీడ పొందే వారు.
భోజనానంతరం ,కాలి నడకన కొండకు బయలు దేరే వారు.
వీరు తోడు వచ్చి, సహాయకులుగా తమ అండ దండలను అందించే వారు.
కొండ దిగి వచ్చిన తర్వాత, మరల ఇక్కడ
స్నాన పానాదులూ, పూజా పునస్కారములు చేసుకుని, సేద దీరేవారు.
తమ తమ ప్రాంతాలకు తిరుగు ముఖం పట్టే వాళ్ళు. వెళ్ళేటప్పుడు,
ఆ భక్త జనులు తమకు ఆతిథ్యం ఇచ్చిన గృహస్థులకు
తమకు తోచినంత ధనమును
ఆనందముతో పట్నూలు ఇంటి యజమానులకు ఇచ్చే వారు.
నేడు కూడా రమా రమి డజను / 12 ఇళ్ళ వారు,
ఈ సేవా సాంప్రదాయాన్ని అనుసరిస్తూనే ఉన్నారు.
కర్ణాటకలోని- మండ్య మద్దూరు, హసన్, ఉడిపి ప్రాంతాల నుండి,
అలాగే తమిళనాడులోని సేలం, దిండిగల్ ప్రాంతాల నుండీ,
మహారాష్ట్రలోని నాసిక్, నాందేడ్ జిల్లాల వారూ వస్తూ ఉంటారు.
తెలుగు నాట శ్రీ కాకుళం, విజయనగరం జిల్లాల నుండి
ఆనవాయితీగా భక్తులు వస్తూనే ఉన్నారు.
ఈ సాంప్రదాయ పరంపరలో అనుకోకుండా
ఒక బృహత్ గ్రంధము రూపొందింది.
ఇప్పటి టెపిఫోన్ డైరెక్టరీల మాదిరిగా ఆ పుస్తకం ఏర్పడింది.
దాదాపు 70 ఏళ్ళ నుండి,
కొండకు వచ్చే యాత్రీకుల చిరునామాల పట్టికలు అవి.
తమ ఇళ్ళలో దిగే వారి అడ్రసులు వీరి వద్ద ఉంటాయి.
ప్రతి సంవత్సరము పట్నూలు వారు,
తమ ఇండ్లలో విడిది చేసిన వారికి లేఖలు రాస్తారు.
ఇక్కడ
ఇళ్ళు ఇరుకుగా ఉన్నప్పటికీ, మట్టి మిద్దెలే ఐనప్పటికీ
స్నేహ భావంతో కూడిన ఆతిథ్య సేవ,
వారి సౌహార్ద్రత పట్ల గల నమ్మకమే
ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా
"పరసాల వీధి ఆతిథ్య సాంప్రాదాయాన్ని "నిలబెడుతూన్నది.
60 ఏళ్ళు పై బడిన ఆ చిరునామాల పుస్తకములు ,
ఇప్పటికీ పరసాల వీధిలో భద్రపరచి ఉంచారు.

(ఆధారము; ఆంధ్ర భూమి, 28 మే, 2006 ఆదివారము - సంచిక)

2 కామెంట్‌లు:

vijay చెప్పారు...

బాగున్నది మీ పోష్ట్.
అక్కడి వివరాలు ఇంకా తెలుపగలరు.
ఉదా: ఫోన్ నెం.
మేము కూడా ఒక సారి విడిది చేయగలము.

vijay చెప్పారు...

బాగున్నది మీ పోష్ట్.
అక్కడి వివరాలు ఇంకా తెలుపగలరు.
ఉదా: ఫోన్ నెం.
మేము కూడా ఒక సారి విడిది చేయగలము.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...