రైతు అనుముల మాచిరెడ్డి, కృష్ణా తీరాన
తంగెళ్ళ పల్లి నివాసి. గుంటూరు జిల్లాలోనిది ఈ గ్రామం.
అతని పెద్దకోడలు భవనాశిదేవి శివ భక్తురాలు. ఒకనాడు మామగారు ఆమెకు చెప్పాడు
"అమ్మయీ, ఇవాళ పొలంలో అనుములు నాటాలి. నేను పొలానికి వెళుతున్నాను.
ఇంటి పనులు పూర్తి అయ్యాక -
నువ్వు అనుములు విత్తనాలను తీసుకుని రా."
ఆ ప్రకారం ఆమె విత్తుల మూటతో బయలుదేరింది.
శివ నామ సంకీర్తనలు చేస్తూ నడుస్తున్న భవనాశిదేవికి
మార్గ మైధాన కొందరు శైవభక్తులు -
"భవతి బిక్షాం దేహి"అని యాచించించారు.
"శివార్పణం" అంటూ భవనాశిదేవి, వారికి తన వద్ద ఉన్న
అనుములను దానం చేసింది. ఆ జంగమదేవరలు ఆమెను దీవించారు.
పొలం దగ్గరికి వస్తూన్న భవనాశిదేవికి -
తన దగ్గర విత్తనాలు లేవు - అనే సంగతి స్ఫురణకు వచ్చింది.
మామగారికి ఏమి చెప్పాలో తెలీలేదు.
ఎటూ పాలుపోక, నెమ్మదిగా ఇసుక తీసుకుని,
మూట కట్టింది. ఆ మూటను నడుమున దోపింది.
తమ సుకేత్రానికి ఆమె చేరింది. పెద్దాయన -
"విత్తు భూమిపై చల్లు, పనుంది, వెళ్తున్నాను." అని చెప్పి వెళ్ళాడు.
శివ నామ స్మరణం చేస్తూ, పొలంలో తాను తెచ్చిన ఇసుకరేణువులను చల్లింది.
చిత్రంగా - దీనిని ఎవరూ గమనించలేదు.
నారు ఏపుగా పెరిగింది, అందరూ కోతల పని చేస్తున్నారు.
మాచిరెడ్డి ప్రభృతులు - తమ తమ పొలాలలో పైరు కోతలు కోసే పనిని మొదలెట్టారు.
;
చిత్రంగా ప్రతి ఆనప కాయలోనూ బంగారు అనుములు -
ధగధగలాడుతూ కనిపించాయి.
తర్వాత భవనాశిదేవి - తాను ఇసుక చల్లిన విషయం అందరికీ తెలిపింది.
"క్షమించండి." అంటూ మోకరిల్లింది.
పల్లె ప్రజలు "మీ కోడలు భవనాశిదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమే."
అని ప్రశంసించారు.
;
అప్పటి నుండి మాచిరెడ్డి యొక్క ఇంటి పేరు - అనుముల - ఐనది.
ప్రజలు వారికి బ్రహ్మరధం పట్టారు.
తమకు ప్రభువుగా మాచిరెడ్డికి అధికారం ఇచ్చి, గౌరవిస్తున్నారు.
మాచిరెడ్డి పరిపాలనలో ప్రజలు సుఖంగా, నిబ్బరంగా ఉన్నారు.
మాచిరెడ్డి బంగారు అనుములలో కొంత భాగాన్ని దానం చేసాడు.
"ప్రజా సంరక్షణ కోసం - కోటను కట్టండి."
అని మాచిరెడ్డికి విప్రోత్తములు సలహా ఇచ్చారు.
మాచిరెడ్డి తంగెళ్ళ గ్రామం చుట్టూ పెద్ద గోడను కట్టించాడు.
;
ఒకనాడు ప్రజానీకం కోసం - మంచినీటి కొరకు -
అనుముల మాచిరెడ్డి దిగుడు బావిని త్రవ్వించసాగాడు.
ఎంతో లోతుకు నీటి కోసం త్రవ్వారు,
చెమట ధార పోసి,, చేసిన శ్రమ కాస్తా, నిష్ప్రయోజనమైంది.
నిరాశగా చతికిలబడ్డాడు అనుముల మాచిరెడ్డి.
ఆ రేయి కలలో గంగాభవానీదేవి ప్రత్యక్షం ఐనది.
"భక్తా! నీ కోడలు భవనాశీ దేవి - ఈ కూపములోనికి ప్రవేశించి,
నన్ను పూజిస్తే - జల పడ్తుంది, ఆ సమయాన ఆమె నాలో ఐక్యం ఔతుంది."
గంగాభవాని ఆనతి విని అనుముల మాచిరెడ్డి నిశ్చేష్ఠుడైనాడు.
కానీ ఆయన కోడలు
"గంగాభవానీ దేవికి నేనంటే ఎంతో ప్రేమ,
కనుకనే గంగమ్మ తల్లి నాకు ఈ గొప్ప అవకాశాన్ని వరంగా అనుగ్రహించింది."
ప్రజలకు త్రాగు నీరు లభిస్తుంది,
లోక కళ్యాణార్ధం ఈ మహత్కార్యం కోసం,
నా బ్రతుకును అంకితం చేయడం -
నాకు ఎంతో మహద్భాగ్యం."
అంటూ ముందువెనుకలాడుతున్న - స్నేహితులకు, బంధువులకు నచ్చజెప్పింది.
తు.చ. తప్పకుండా గంగమ్మ వాక్యాన్ని ఆచరణలో పెట్టింది.
బావి అడుగున ఆసీన ఐనది భవనాశీ దేవి.
ఆమె అర్చనలు పూర్తి అయీ అవకుండగనే - పుడమి నుండి జల - జల జలా ఉబికింది.
బావి అడుగున ఆసీన ఐనది భవనాశీ దేవి.
ఆమె అర్చనలు పూర్తి అయీ అవకుండగనే - పుడమి నుండి జల - జల జలా ఉబికింది.
ఆ ప్రాంతాలలో నీటి ఎద్దడి మటుమాయమైంది.
త్యాగమయి భవనాశి అందరి మనో మందిరములందు కొలువై ఉన్నది. .
ఆ ప్రాంతాలలో నీటి ఎద్దడి మటుమాయమైంది.
ఆ బావికి "భవనాశమ్మ బావి" - అని పేరు వచ్చింది.
&
తంగెళ్ళ గ్రామం క్రిష్ణానదికి- ఈ ఒడ్డున ఉన్నది, ఎదుట రెండో తీరాన -
ప్రసిద్ధ మట్టపల్లి నరసింహస్వామి కోవెల ఉన్నది.
మట్టపల్లి నరసింహస్వామి కోవెలకు
భూరి దానాలు, విరాళములు ఇచ్చిన
మాచిరెడ్డి అనుముల జీవితములు ధన్యమైనవి.
===============================,
;
అనుముల వారి గృహ నామం ;-
anumula waari gRha naamam ;
;
raitu anumula maacireDDi, kRshNA teeraana
tamgeLLa palli niwaasi. gumTUru jillaalOnidi ee graamam.
atani peddakODalu BawanASidEwi Siwa bhakturaalu. okanADu maamagaaru aameku ceppaaDu
"ammayee, iwALa polamlO anumulu nATAli. nEnu polaaniki weLutunnaanu. imTi panulu
puurti ayyaaka - nuwwu anumulu wittanaalanu teesukuni raa."
aa prakaaram aame wittula mUTatO bayaludErimdi.
Siwa naama samkeertanalu cEstuu naDustunna భవనాశిదేవిki
maarga maidhaana komdaru Saiwabhaktulu -
"Bawati bikshaam dEhi"ani yaacimcimcaaru.
"SiwaarpaNam" amTU భవనాశిదేవి, waariki tana wadda unna
anumulanu daanam cEsimdi. aa jamgamadEwaralu aamenu deewimcaaru.
polam daggariki wastuunna భవనాశిదేవిki -
tana daggara wittanaalu lEwu - anE samgati sphuraNaku waccimdi.
maamagaariki Emi ceppaalO teleelEdu.
eTU paalupOka, nemmadigaa isuka teesukuni,
mUTa kaTTimdi. aa muuTanu naDumuna dOpimdi.
tama sukEtraaniki aame cErimdi. peddaayana -
"wittu bhuumipai callu, panumdi, weLtunnaanu." ani ceppi weLLADu.
Siwa naama smaraNam cEstuu, polamlO taanu teccina isukarENuwulanu callimdi.
citramgaa - deenini ewaruu gamanimcalEdu.
naaru Epugaa perigimdi, amdaruu kOtala pani cEstunnaaru.
maacireDDi praBRtulu - tama tama polaalalO pairu kOtalu kOsE panini modaleTTAru.
;
citramgaa prati aanapa kAyalOnuu bamgaaru anumulu -
dhagadhagalADutuu kanipimcaayi.
tarwaata BawanASidEwi - taanu isuka callina wishayam amdarikee telipimdi.
"kshamimcamDi." amTU mOkarillimdi.
palle prajalu "mee kODalu BawanASidEwi saakshaattu lakshmeedEwi awataaramE."
ani praSamsimcaaru.
appaTi numDi maacireDDi yokka imTi pEru - anumula - ainadi.
prajalu waariki brahmaradham paTTAru.
tamaku prabhuwugaa maacireDDiki adhikaaram icci, gaurawistunnaaru.
మాచిరెడ్డి pari paripaalanalO prajalu sukhamgaa, nibbaramgaa unnaaru.
maacireDDi bamgaaru anumulalO komta BAgaanni daanam cEsADu.
"prajaa sam rakshaNa kOsam - kOTanu kaTTamDi." ani wiprOttamulu
మాచిరెడ్డిki salahaa iccaaru. / tamgeLLa graamam cuTTuu pedda gODanu kaTTimcADu.
;
okanADu prajaaneekam kOsam - mamcineeTi koraku -
anumula maacireDDi diguDu baawini trawwimcasaagaaDu.
emtO lOtuku neeTi kOsam trawwaaru, cemaTa dhaara pOsi,
cEsina Srama kaastaa, nishprayOjanamaimdi.
macireDDi anumula nirASagaa catikilabaDDADu anumula maacireDDi.
aa rEyi kalalO gamgaabhawaaneedEwi pratyaksham ainadi.
"BaktA! nee kODalu bhawanASee dEwi - ee kuupamulOniki prawESimci,
nannu puujistE - jala paDtumdi, aa samayaana aame naalO aikyam autumdi."
gamgaabhawaani aanati wini anumula maacireDDi niScEshThuDainaaDu.
kaanee aayana kODalu "gamgaabhawaanee dEwiki ''''''''''''
nEnamTE emtO prEma, kanukanE gamgamma talli
naaku ee goppa awakaaSAnni waramgaa
anugrahimcimdi." prajalaku traagu neeru labhistumdi,
lOka kaLyaaNaardham ee mahatkaaryam kOsam,
naa bratukunu amkitam cEyaDam -
naaku emtO mahadbhaagyam."
amTU mumduwenukalADutunna - snEhitulaku,
bamdhuwulaku naccajeppimdi.
tu.ca. tappakumDA gamgamma waakyaanni aacaraNalO peTTimdi.
baawi aDuguna aaseena ainadi BawanASee dEwi.
aame arcanalu puurti ayee awakumDaganE - puDami numDi jala - jala jalaa ubikimdi.
aa praamtaalalO nITi eddaDi maTumaayamaimdi.
tyaagamayi BawanASi amdari manO mamdiramulamdu koluwai unnadi.
aa baawiki "BawanASamma baawi" - ani pEru waccimdi.
&
tamgeLLa graamam krishNAnadiki- ee oDDuna unnadi, eduTa remDO teeraana -
prasiddha maTTapalli narasim haswaami kOwela unnadi.
maTTapalli narasim haswaami kOwelaku
bhuuri daanaalu, wirALamulu iccina
maacireDDi anumula jeewitamulu dhanyamainawi.
;
భక్తి చరిత్రలు devotees history - 8 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి