9, నవంబర్ 2018, శుక్రవారం

శ్రీరామ పాంచాలీ/ కృత్తివాసి రామాయణం

కృత్తివాస రామాయణం - గా ప్రసిద్ధి చెందిన రచన - శ్రీరామ పంచాలీ ; 
వనమాలి యొక్క జ్యేష్ఠ పుత్రుడు కృత్తివాసుడు / కృత్తిబాసి
పశ్చిమ బెంగాల్ వాసి, 
కృత్తివాసుని తాత మురారి ఓఝా ప్రోత్సాహంతో దైవదర్శన యాత్ర చేసారు. 
కృత్తిబాసి - చేసిన తీర్ధ క్షేత్ర దర్శనం ఫలించింది, 
భగవదనుగ్రహం లభించి, ఇతిహాస రచనలను 
భక్త కృత్తివాసుడు వంగదేశప్రజలకు అందించారు.
కృత్తివాస or  కృత్తిబాసి [ 1381-1461] ఉన్నత విద్యాభ్యాసం కోసం - 
వంగదేశానికి పంపించారు పెద్దలు.
పదకొండేళ్ళ వయసులో చదువులకై పర సీమలకు వెళ్ళి,
బెంగాల్ కు తిరిగివచ్చిన కృత్తివాస తన ఊరికి పునరాగమనం - 
సాంప్రదాయానుసారం - రాజమర్యాదలను పొందాడు కృత్తివాస.
రాజు గరుడ - స్వయంగా కృత్తివాసునికి పుష్పహారం వేసి, 
పట్టు శాలువా కప్పి, పన్నీరు చల్లి సత్కరించాడు.
కృత్తివాస్ తీర్ధయాత్రలలో భాగంగా ఒడిసా రాష్ట్రంలోని చందనేశ్వర్ కి వెళ్ళాడు. 
తీర్ధ యాత్రాదుల సందర్భంలో, అతనిలో ఇతిహాస రచనా సంకల్పం కలిగింది. 
కృత్తివాసుడు భక్తిప్రపత్తులతో ఆదికవి వాల్మీకి రచించిన 
శ్రీమద్రామాయణమ్ మహాకావ్యాన్ని - బెంగాలీ భాషీకరణ చేసాడు.&
కృత్తివాస రామాయణం - ప్రభావం - 
తర్వాతి కాలం - భక్తి సాహిత్యంపై అమితంగా ఉన్నది. 
వైష్ణవ సారస్వతం, రామాయణ గాధలు పరిమళభరితం ఐనవి.

హిందీలో తులసీదాసు, రబీంద్రనాధ టాగూర్ - 
మైఖేల్ మధుసూదన దత్తు ఇత్యాదుల రచనల శైలికి
 పూలబాటను పరిచింది  శ్రీరామ పాంచాలీ/ కృత్తివాస రామాయణం. 
The British Museum and the School of Oriental and African Studies in the United Kingdom ;
రవీంద్ర భారతి -  అనేక విశ్వ విద్యాలయాలలో, లైబ్రరీలలోనూ 
శ్రీరామ పాంచాలీ వ్రాత ప్రతులు ఉన్నవి. 
;
REF ;- Sri Ram Panchali, Bengali poet, Krittibas Ojha ;
শ্রীরাম পাঁচালী ; is popular as - কৃত্তিবাসি রামায়ণ .

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...