11, నవంబర్ 2018, ఆదివారం

భక్త విజయదాసు - సుధా వాక్యం

కల్లూరులో సుబ్బనాచార్యులు నివసిస్తున్నాడు.
సుధా మంగళ కార్యక్రమాన్ని నిర్వహించే సుబ్బన్నకు గర్వం ఎక్కువ. 
"నాకు ఒక సుధా వాక్యం అనుగ్రహించండి, స్వామీ!" 
సుబ్బన్నను వినయంగా అడిగాడు విజయ దాసు. 
"న్యాయ సుధ - అల్పులకు బోధ పడదు. ' -
- అని అనుకుంటున్నావు కాబోలు" 
ఎగతాళి చేశాడు సుబ్బన్న.
"సుధా వాక్యం అనినచో ఏదో కన్నడ గీతం అనుకుంటునావా!?"
నేను కేవలం హరిదాసును స్వామీ!" 
అంటూ విన్నవించుకున్న విజయదాసును 
హేళన చేసాడు సుబ్బనాచార్యులు.
"కోపగించకండి స్వామీ! నేనే మహా గ్రంధాలను చదవలేదు - 
వ్యాస రాయలు, పురందరదాసులు నాకు గురువులు. 
వారి వాక్కును అనుసరించి, హరికీర్తన గాయకుడిని ఐనాను." 
;
'నట విట గాయకులతో సమానం - మీ హరిదాసులు.' 
అనే చులకన భావం మిళాయించిన పలుకులు 
అక్కడి పండిత వర్గానివి.; 
అటు వైపున కావడిలో నీళ్ళు మోసుకు వెళుతున్న 
బ్రాహ్మణుడి పిలిచి, అక్షింతలు చల్లి, 
"సుధా గ్రంధములోని సూత్రములను 
కొన్ని చెప్పండి, బ్రాహ్మణ స్వామీ!"  
అని వక్కాణించాడు విజయదాసు.

టీకా కర్తలకు సైతం బోధపడని క్లిష్టమైన సూత్రములను 
ఆ విప్రుడు - ఆశువుగా చెబుతూంటే 
అక్కడ ఉన్న పండితవరేణ్యులు నిర్ఘాంతపోయారు.
"నిజమైన భక్తాగ్రగణ్యుడు విజయదాసు." అని అర్ధం చేసుకుని,  
పశ్చాతాపపడి క్షమాపణ కోరారు సుబ్బనాచార్యులు, తదితరులు. 
గర్వం పటాపంచలు కాగా, మోకరిల్లి శిష్యుడు ఐనాడు సుబ్బనాచార్యులు. 
"విజయ కవచం" గానం చేస్తూ దీవెనలు ఒసగాడు విజయ దాసు.
; &; 
భక్త విజయ దాసు - [1685-1755 ] ;-
విజయ దాసు జన్మస్థలం చీకల పర్వి గ్రామము. 
దాసకూటమిలోని ప్రధములు పురందరదాసు,
ఐతే - రెండవ వ్యక్తి విజయదాసు.
అశ్వత్థ నారసింహ స్వామి వరప్రసాదంగా 1687లో 
చీకల పర్వి [ / చిప్పకూట*] లో జన్మించారు 
మాన్వి తాలూకా, రాయచూరు జిల్లా - అతని బాల్యం గడిచింది.
దాసర పాడగళు ;- దాస సాహిత్య నందనవనంలో 
విజయదాసు గానం చేసిన భజన పుష్పాలు గుబాళించినవి. 
భక్తి  - భజన సంప్రదాయానికి నిలిచిన జ్యోతి విజయదాసు.
;
Vijaya Dasara katte ;-
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''';
Chippagiri Address & Contact :
‘Sri Vijayadasara Seva Trust’, ; 
Sri Vijayadasara Katte, Aloor Taluk,
Kurnool District, Chippagiri Post-518396.
& Venkob Das (President) – + 919052042932  
;
Notes ;- కర్నూల్ మండలంలోని గ్రామం చిప్పగిరి *. 
భక్తి చరిత్రలు devotees history - 4 ;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...