11, నవంబర్ 2018, ఆదివారం

పాండురంగ విఠల స్వామి,రుక్మిణీదేవి as cooks

ఒక రోజు నామ్ దేవ్ ఇంటికి అతిథులు అసంఖ్యాకంగా వచ్చారు.
'ఇంతమందికి వంట నేను చేయగలనా,
అతిధి దేవోభవ - గృహస్థు కర్తవ్యం అతిధి అభ్యాగతులను
ఆహ్వానించి, సంతోషపెట్టగలగాలి.
ఇవాళ నా విధిని - నేనొక్కడినే -
ఒంటి చేతితో ఎట్లాగ నిర్వహించగలను!?"
భక్తుని అంతర్మధనం - భగవంతుని ఎదను స్పర్శించింది.
అల వైకుంఠపురిలో ఉన్న విష్ణుమూర్తి -
మొసలికి చిక్కిన ఏనుగు విలవిలలాడుతుంటే -
వైకుంఠం యావత్తూ తన వెనుక పరుగులిడి వస్తున్నా గమనించకుండా -
కేవలం ఒక జంతువు - గజేంద్ర మొరను ఆలకించి ఉరుకులు పరుగులు తీస్తూ
ఈ ఇలకు వచ్చిన స్వామి .......
ఇప్పుడు నామదేవుని వేదనను తెలిసి, ఊరక ఉండగలడా!?
సతీ సమేతంగా స్వామి భక్త నామ దేవ్
ఇంటికి అరుదెంచాడు.
పాండురంగ విఠల స్వామి,రుక్మిణీదేవి 
వంటవాళ్ళు అవతారం దాల్చారు. 
భగవాన్ విఠల దేవుడు, రుక్మిణీ మాత - స్వయంగా వచ్చి, రుచ్యపాకములను వండి, 
భక్త నామదేవుని అభీష్టం మేరకు - అతిధులకు వడ్డనలో పాలుపంచుకున్నారు,
భగవాన్ విఠల దేవుడు, రుక్మిణి ఇద్దరు - ప్రసాదమును భుజించిన పావన గాధ నామదేవ్ ది.
నామ్ దేవ్ ;- వినోబా ఖేచర్ యొక్క శిష్యుడు. పండరీపురంలో జన్మించాడు నామదేవ్.
నామ్ దేవ్  [1270-1350] ;- 13 వ శతాబ్దంలో ఉన్న పండరీపురం భక్తుడు. 
చక్రధారి గోరా పరీక్ష పద్ధతి - తలపై తట్టి, 'ఈ కుండ ఇంకా బాగా కాలలేదు.' 
నామ్ దేవ్ అహంకారం పోయింది.
] నామ్ దేవ్ రచించిన పద్యాలకు "గాధలు" అని పేరు. 
] తుకారం మున్నగు భక్తుల పద్యాలను "అభంగాలు"అని అంటారు.
] గురు నానక్ సంకలనం చేసిన 'గ్రంధ సాహెబా'లో నామ్ దేవ్ రచించిన కొన్ని గాధలు చేర్చారు.
] "నా ఇంటిని పునర్నిర్మించి, బాగు చేసినదిన స్వామి పాండురంగడు. 
పూర్ణ భక్తియే ఆయనకు మీరు ఇవ్వాల్సిన కూలీ." 
;
=============================,
;
oka rOju నామ్ దేవ్ imTiki atithulu asamkhyaakamgaa waccaaru.
'imtamamdiki wamTa nEnu cEyagalanaa,
atidhi dEwOBawa - gRhasthu kartawyam atidhi abhyaagatulanu
aahwaanimci, samtOshapeTTagalagaali.
iwAL naa widhini - nEnokkaDinE -
omTEtitO eTlaaga nirwahimcagalanu!?"
bhaktuni amtarmadhanam - bhagawamtuni edanu sparSimcimdi.
ala waikumThapurilO unna wishNumuurti -
mosaliki cikki, wilawilalADutumTE -
waikumTham yaawattuu tana wenuka paruguliDi wastunnaa gamanimcakumDA -
oka jamtuwu - gajEmdra moranu aalakimci uruketti ilaku waccina swaami .......
ippuDu naamadEwuni wEdananu telisi, uuraka umDagalaDA!?
satee samEtamgaa swaami bhakta naama dEw
imTiki arudemcADu.
paamDuramga wiThala swaami,rukmiNIdEwi 
wamTawALLu awataaram daalcaaru.
;
bhagawaan wiThala dEwuDu, rukmiNee maata - swayamgaa wacci, rucyapaakamulanu wamDi, bhakta naamadEwuni abheeshTam mEraku - atidhulaku waDDanalO paalupamcukunnaaru,
bhagawaan wiThala dEwuDu, రుక్మిణి iddaru - prasaadamunu bhujimcina paawana gaadha naama dEw di.
నామ్ దేవ్ ;- winObaa KEcar yokka SishyuDu. 
pamDareepuramlO janmimcaaDu naamm dEw.
నామ్ దేవ్  [1270-1350] ;- 
13 wa SatAbdamlO unna pamDareepuram bhaktuDu.
cakradhaari gOraa pareeksha paddhati - 
talapai taTTi, 
'ee kumDa imkaa baagaa kaalalEdu.' 
నామ్ దేవ్ ahamkaaram pOyimdi.
] నామ్ దేవ్ racimcina padyaalaku "gaadhalu" ani pEru. 
] tukaaram munnagu bhaktula padyaalanu "aBamgAlu"ani amTaaru.
] guru naanak samkalanam cEsina 'gramdha saahebaa'lO 
నామ్ దేవ్ racimcina konni gaadhalu cErcaaru.
] "naa imTini punarnirmimci, baagu cEsinadina swaami paamDuramgaDu. 
puurNa bhaktiyE aayanaku meeru iwwaalsina kuulee."
;
భక్తి చరిత్రలు devotees history - 5 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...