29, మార్చి 2013, శుక్రవారం

"లిపిక" - బెన్ హర్ Horses


"లిపిక"- ఈ పేరు సంస్కృతములోని "లిపి" నుండి వచ్చినదే అనిపిస్తూన్నది కదా!
ఐతే చిత్రముగా -మధ్య యూరోపులో ప్రఖ్యాతమైనది.  
"అశ్వ హృదయ పరిజ్ఞానులు" అందరికీ ఆప్యాయత పొందిన పేరిది.  
సరే! ఇంతకీ ఇది దేని నామధేయమో సెలవివ్వాలి- అంటే- ?????? 
సమాధానము:- "శ్రేష్ఠమైన తురగ జాతి name ఇది."     
"బెన్ హర్"( 1959, హీరో:-  Charlton Heston ) సినిమా గొప్ప హిట్, 
14ఆస్కార్డు అవార్డులను గెలుచుకున్న మూవీ కదా!

ఇందులో chariot  race చిత్రీకరణ "న భూతో, న భవిష్యతి".   
రధాలకు పూన్చిన గుర్రాలు తెరపైన నిజంగానే పరుగులు తీసాయేమో.... అనిపిస్తాయి. 
రధముల పందెములలో - హీరో బెన్ హర్ ఎక్కిన రధానికి- శ్వేతాశ్వాలను కట్టారు. 
కథానాయకునివి (ఛార్ల్ టన్ హెస్టన్) తెల్ల గుర్రాలు ఐతే-  
ప్రతినాయకుడు (/ villain") "మెసాలా" రధానికి కట్టినవి - నల్ల గుర్రాలు.  
మన ప్రాచీన నాటకములలో వలెనే - 
బెన్ హర్ దర్శకులు - తెలుపు - నలుపు రంగులను - 
పాత్రల స్వభావోచితముగా - ప్రతీకాత్మకముగా ఉపయోగించుకున్నారు. 
ఇటలీలో అధికముగా సినీ షూటింగు చేసారు. ఐనప్పటికీ - 
ఇటలీ దేశములోని గుర్రాలను వాడలేదు.
ఈ సీను కోసమని- 
"ప్రత్యేకముగా స్లోవేనియా దేశము (Slovenia) నుండి - 
"గుర్రములను" తెప్పించినారు; 
అవే "లిపిక  అశ్వరాజములు".
(Lipizzaner horses/ lipica and arabic horse breeding in the stud farm 1580 ) 

తుషారము (= Snow పొగమంచు) వన్నె కలిగి, 
ఉత్తమ జవనాశ్వములని- ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి.
స్లోవేనియా ( Slovenia ) లోని "లిపిక" అనే ప్రాంతము వీనికి - బ్రీడింగు సెంటరు.
మే 19 వ తేదీని స్లోవేనియా ప్రజలు "లిపిజ్జనీర్ డే" పండుగను జరుపుకుంటారు - అంటే 
వారికి "లిపిక తురగ గమన, తురగ వల్గనముల" పట్ల ఎంత ఆరాధనా భావమో బోధపడ్తుంది."  

ఆర్చ్ డ్యూక్  ఛార్లెస్ 1580 May 18 న 
శ్రీకారము చుట్టిన అంశము ఇది, Day of Lipizzaner .    
ఆస్ట్రియా ప్రభు వర్గీయుడు ఛార్లెస్ - 
స్పెయిన్ దేశము నుండి కొనితెచ్చిన ఈ  శ్రేష్ఠమైన గుర్రములు- 
16 వ శతాబ్ది- నుండీ ఆరంభమై,  స్లావేనియా దేశ చరిత్రలో- సుస్థిరమైనవి.

పిల్లలకు పెట్టే పేరుల లిస్టులో ఎక్కువగా ఉన్నదీ అంటే -  
"లిపిక" కు - ఈ నామమునకు ఎంత క్రేజ్ ఉన్నదో అవగతమౌతుంది. 
నేడు "పందెపు గుర్రములలో మేటివైనవి" గా 
మార్కెట్టులో, విపణివర్గాలలో పరిగణించబడ్తూన్నవి. 

"లిపిక" -  బెన్ హర్ ఇటలీ సరిహద్దులలోను వియన్నా ఇత్యాది 
యూరప్ కంట్రీలలో లిపికా తురంగ స్వారీ శిక్షణా కేంద్రాలు పేరెన్నిక గన్నవి. 
అనేక పాశ్చాత్య మూవీలలోనూ, టి. వి. షో లలోనూ ఈ అశ్వరాజాలదే అగ్రస్థానం. 
;








క్వాడ్రిగా రథాలు :
ఇవి రోమన్ చారియట్స్, నాలుగు గుఱ్ఱాలు  ఈ తేరులకు పూన్చ బడతాయి, 
ఈ చతుర్ తురగ రథముల సవారీలు, horse races
ఇంగ్లీష్ హిస్టారికల్ కథావస్తు సినిమాలలోనూ, 
టెలివిజన్ షూటింగులలోనూ విరివిగా ఉపయోగించబడినవి.
బెన్ హర్ (Ben Hur, 1953) సినిమా వలన 
ఈ లిపికా అశ్వధాటి ప్రపంచ వ్యాప్తంగా గుర్తిపు వచ్చింది. 

original home of the snow-white 
"Lipizzaner" horses - Slovenia;
LipicaSlovenia
;


























;
ఈ అంశాల విశేషాలు కూడా ఆసక్తిదాయకమైనవే! 
The Quadriga was a four-horse chariot 
first driven by the Titan god (Link)  


konamanini viwes (51544) 



కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...