7, మార్చి 2013, గురువారం

గరుత్మంతుడు ఆ దేశ చిహ్నము

“మహాభారతము” లో ఒక గాధ ఉన్నది. 
 దేవతలను అందరినీ ఓడించాడు గరుడుడు. 
ఐతే స్వామి ఆఖరి క్షణంలో విష్ణుమూర్తి వచ్చి ఆ పక్షిరాజుతో పోరాడి ఓడించాడు. 
ఐతే ఆ ఖగరాజు సాహస పరాక్రమాలకు ముగ్ధుడైనాడు శ్రీమన్నారాయణుడు. 
"విహగాధిపతి ఏమైనా వరములను కోరుకొనుము" అన్నాడు. 
విహంగరాజు స్వామిని కోరిన కోర్కెలు నెరవేరాయి. 
అవి "ఫా నారాయణునికి వాహనము" (vehicle) గా- 
భక్తులచే గౌరవమును పొందాడు.
అలాగే-ఆ-నారాయణమూర్తికి ధ్వజముపైన 
గరుడుడు ఆసీనుడై సుప్రతిష్ఠుడైనాడు. 
ఈ రీతిగా గరుత్మంతుడు "లోకపూజ్యుడు" ఐనాడు. 
గరుడ వాహనుడైన నారాయణుడు ఆరాధ్య దైవమైనాడు. 
 నారాయణుని (= విష్ణుమూర్తి యొక్క పతాకమున 
గరుడుడు చిహ్నరూపములో నిలచిఉన్నాడు. 

 *******************************; 

 థాయిలాండ్ దేశములో “పక్షి” అనగా గరుత్మంతుని అవతారమును 
తమదేశము యొక్క జాతీయ చిహ్నముగా ఎన్నుకున్నారు. 
గరుడుడు అమితశక్తికి,ప్రతీకగా ఉన్నాడు. 
థాయిలాండ్ గరుడ జాతీయచిహ్నముగా 
అనేక దేశాలకు ప్రత్యేకించి, 
సయాం (నేటి థాయిలాండ్)కి గరుడచిహ్నముగా విరాజిల్లుతూన్నది. 
వారు "ఫ్రాకృత్-ఫాహ్" పిలుస్తూన్నారు

అనేక శతాబ్దాల నుండీ ThaiLand coutry లో 
"గరుడ ప్రతిమ " (సింబల్) రాజచిహ్నముగా ఉపయోగములోఉన్నది. 
 గరుత్మంతుని ఏడవ-వజ్రవుధ్( King Vajiravudh (Rama VI in 1911) 
తన- రాజముద్రికా లాంఛనముగా-నిర్ణయించెను. 
 [ప్రాకృత్-ఫా = అనగా"పురాతన" లేక
"ప్రాకృత = తూర్పు పక్షి"అని-
సంస్కృత ధ్వనిని-బట్టి చెప్పవచ్చును] 
;
 *******************************;
 1350-1767ల కాలములో- అయుత్తయా (=అయోధ్య) సామ్రాజ్యపాలకులు 
 ప్రజానురంజకముగా పరిపాలన చేసారు. 
 Ayutthaya Kingdom (1350–1767) నాటినుండీ రాజముద్రికలు, రాజలాంఛనములలో 
 God Shiva, God garuda మున్నగు దేవతా ప్రతిరూపములను ముద్రించేవారు. 
 Shiva (known in Thailand as Phra Isuan), 
శివుని థాయిలాండ్ (Thailand)లో "ఫ్రా ఈసుయన్"( Phra Isuan) అని పిలుస్తారు. 

Ayutthaya Kingdom (1350–1767) పాలకులు అనేక-రాజముద్రలను విరివిగా వాడారు. 
వివిధ డిజైన్లు వానిలో ఉన్నవి. 
ఆతని కళాభిరుచికి అవి నిదర్శనములు. 
దంతములతో మూసలను చేసారు.
అలాగ చెక్కబడిన దంతముల బ్లాకుల వైవిధ్యతలు  ఆకర్షణీయాలు. 
సామ్రాజ్య పాలనా సౌలభ్యతకై వివిధ అధికారశాఖలకు వేర్వేరు-చిహ్నాల blocks ను సెలెక్ట్ చేసుకున్నారు. 

*******************************; 
Notes:-

"శ్రీ " గౌరవసూచక పదముగా, 
మాననీయ 'ఉపథ' గానూ 
థాయ్ లాండ్ భాషలో వాడుకలో ఉన్నది. 
ఉదాహరణకు ఈశ్వరుడు ఫ్రా ఈసువన్; 
శ్రీ విష్ణువు= ఫ్రా-నారాయణ; బ్రహ్మ= ఫ్రా ఫ్రోం; 
ఇంద్ర = ఫ్రా ఇంద్ర; ఇలాగన్న మాట! 

*******************************;


కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...