కాంభోజ రాజు చరిత్ర- హిందూ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన
జన, జానపద కథలలో ఒకటి.
కాంభోజ దేశము అనగా కంబోడియా.
అలాగే మన సంగీత ప్రపంచములోనికి
(అక్కడి నుండీ దిగుమతి ఐన సంగీత బాణీ - అని కొందరి అభిప్రాయ)
కాంభోజీ రాగము.
*****************;
చంపా, చంపక లత- అంటే సంపంగి చెట్టు.
చంపక మాల - పద్య ఛందస్సులలో
తొలి పంక్తులలో లక్షణ కారులు ఉట్టంకిస్తారు.
"చంపా రాజ్యము" - అనే అందమైన పేరుతో
గుబాళించిన కళాసామ్రాజ్యము కలిగినది కంబోడియా.
శివరాత్రి నాడు అక్కడి కొన్ని విశేషాలను గమనిద్దామా!
*****************;
చంపా రాజ్య ప్రజలు - కంబోడియా దేశంలో
క్రీస్తు పూర్వమునుండీ విలక్షణ సంసృతీ సంపదను కలిగిఉన్నారు.
కంబోడియా దేశంలో చంపా సామ్రాజ్యము,
చంపా నగరము అని ప్రాచీన కాలమున పేర్లు.
10 శతాబ్దానికి పూర్వము చంపా ప్రజల
లలిత కళలు ఔన్నత్యంతో గుర్తింపు పొందబడినవి.
కెంపోంగ్ చామ్ అనగా "చంపా ప్రజలు" అని భావం.
*****************;
చామ్ శైవమతములో (main symbols of Cham Shaivism )
లింగము, జటా లింగము, త్రిమూర్తి,
segmented , కోశ లింగములు ఆరాధించబడినవి.
సామ్రాజ్య చక్రవర్తులు గొప్ప శివాలయాలను కట్టించారు.
వారు కట్టించిన కోవెలకు, ఆ రాజు పేరుతో ఈశ్వర కోవెలగా పేరు పొందేవి.
గుడిని నిర్మాత యొక్క పేరు, ఈశ్వర - నామము
అనుసంధానములుగా పేరొందేవి.
*****************;
ముఖలింగము:- పరమేశుని ముఖమును వర్ణచిత్రీకరణ చేసి,
లేదా శిల్పములో చెక్కిన లింగము:
జట లింగము: ప్రత్యేక శైలిలో శివ జటాజూటములు అల్లినట్లుగా ఉండే లింగము,
Shiva's chignon hairstyle
త్రిమూర్తి: ఈశ, బ్రహ్మ, విష్ణుమూర్తీ ప్రతీకలు:
కోశ: చామ్ చక్రవర్తులు - లింగమునకు వేసే రజత/ స్వర్ణాది లోహపు తొడుగులు.
చామ్ శైవ మతములో ఈ "కోశ" లకు రాజులు ఇచ్చిన
వివిధ నామములతో ప్రత్యేకతను కలిగి ఉన్నవి.
;
ఇతర విశేషాలు:
1) క్రీ||పూ|| 874 - 1000 లలో చంపాసామ్రాజ్య రాజధాని
2) "ఇంద్ర పురము"(Indrapura )
3) భూదేవి గా యాన్ ప్రో నగర్
(Earth goddess Yan Po Nagar).
;
కొస మెరుపు:-
"చంపా! చంపా!"- అంటూ రాణి
వ్యంగ్యంగా పిలుస్తూంటుంది.
ఆమె ఎవరు?
నడుం మీద చెయ్యి వేసుకుని రాణీగారికి నీడలా-
గూఢచారి నిఘా డ్యూటీతో దాసి ఒకతె తిరిగింది.
ఆ దాసి ఎవరు?
Answer:-
ఆ మహారాణీ జమున,
ఆ కొంటె కరకు దాసీ పిల్ల వాణిశ్రీ.:
సినిమా మీకు గుర్తుకు వచ్చే ఉంటుంది
"మంగమ్మ శపధం".
2 కామెంట్‌లు:
' చంపా'రాజ్యం ప్రస్తుత వియెత్నాం లో మీకాంగ్ డెల్తాలో ఉండేది.బహుశా పూర్వం కాంబూజియా ,చంపా కలిసి ఒకే సామ్రాజ్యంలో ఉండి ఉండవచ్చును.అప్పటి హిందూ రాజ్యాలు పోయి ఇప్పుడంతా బౌద్ధమతం వ్యాపించింది.కాని ఆ దేవాలయాల శిథిలాలు మాత్రం నిలిచిఉన్నాయి.
మీరు చెప్పింది కరెక్టే కమనీయ గారూ!
నేటి వియత్నాం లో ఉన్నది.
ఆ పాయింటు రాద్దామనుకుంటేనే మర్చిపోయాను.
మళ్ళీ మీరు చెప్పిన పాయింట్సుని చేర్చి,
నా essay ని సరిదిద్దుతాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి