రాణి రూపమతి కథ రాజస్థాన్ జానపద గీతాల ద్వారా ప్రజలలో వినుతి కెక్కినది.
రాణీ పద్మినీ దేవికి మల్లే అత్యంత సౌందర్య వనిత రాణి రూపమతి.
అల్లా ఉద్దీన్ ఖిల్జీ దౌష్ట్యం నుండి విముక్తి పొండడానికి
తనదైన మార్గాన్ని ఎన్నుకున్న సాహస సాధ్వి పద్మిని.
అదే కోవలో జరిగిన కథ రాణి రూపమతిది.
చంబల్ నదీ తీర ప్రాంతాల్ని మాల్వా ను పాలిస్తున్న
(Malwa, Kesar Khan and Dokar Khan)
పఠాన్ సోదరులు కేసర్ ఖాన్, డోకర్ ఖాన్ లు ఆక్రమించారు.
******************,
హోలీ నాడు “కోట” ప్రాంతము కొంత దూరాన కైథూన్ లో–
700 వందల ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనలు ఇవి.
అందులో పఠాన్ ల ప్రతినాయక పాత్రలు లోకానికి వెల్లడి ఐనవి.
ఖాన్ ల గోరీలు జాగ్ మందిర్ వద్ద ఉన్నవి
******************,
భోంగసి ఆ ‘కోట’ ప్రాంతానికి అధికారి. ఖైతూన్ అధికారి భోమ్గసి -
ఈ ఊరు కోటకు 9 కిలోమీటర్ల దూరాన ఉంది.
వైన్, నల్లమందులను మితిమీరి వాడినందుచేత సీమా బహిష్కరణ శిక్ష పడింది.
రూపమతిభర్త ఈ భోంగసి. కోట నుండి బూందీ (ఖైటూన్) కి వెళ్ళమని- ఆజ్ఞాపించగా,
ప్రభుత్వ ఉత్తర్వులను భోంగసి శిరసావహించాడు.
ఊరు ఊరూ, పల్లె పల్లే అన్యాయంగా మోపబడిన పన్నులతో బాధింపబడుతూన్నవి.
అందుచేత ప్రజలు, రాజు విడచిన రాజ్యంలో ఉండలేమని, భోమ్ గసి నీ రూపమతినీ అనుసరించారు.
ఊరి నుండి వెలి వేయబడి, స్త్రీలు, పరివార జనం తోనూ బయలుదేరిన
భోమ్ గసి దంపతులను 60 గ్రామాల ప్రజలు అనుసరించారు.
బహిష్కార శిక్షా కాలం నాటికి తన ఆదాయ వనరుల్ని భార్యకూ, పిల్లలకూ చెందుతాయని-
రాజు ఆజ్ఞ జారీ చేసాడు.
రాజపుతానీ మహిళ ఐన రాణి రూపమతి ఆ ధనమును కూడబెట్టసాగింది.
ఆమె ధ్యేయం “చేయి జారిపోయిన కోట, ప్రాంతాలను మళ్ళీ స్వాధీనపరచుకోవడమే!
ప్రవాసములో బూందీలో ఉన్న తన పతి గుణవంతుడుగా మారాలి- అని
వేయి దేవుళ్ళకు మొక్కుకున్నది.
పిమ్మట ఈ కార్యాన్ని సాధించాలని తలచినది.
ఆమె తన మగని చిత్తములో ధీరత్వము నెలకొనుటకై ఎదురుచూడసాగినది.
ఆమె తమ మాతృభూమికై పరితపించసాగింది.
ఐనప్పటికీ తమదై న కోట పట్టణాన్ని ‘ సామరస్యపూర్వకంగానే’ సాధించదలచుకున్నది.
కోట ప్రదేశాలను కొనుగోలు చేయడమో, లేదా సంధి సౌమ్య పద్ధతిలోనో -
ఆమె మరల తమ స్వంత నేలతల్లిని సముపార్జించాలని తలచసాగింది.
ఆ నాటికి కేసర్ ఖాన్ “రాణి రూపమతి అతిలోక సుందరి” అని కర్ణాకర్ణిగా విని,
వేగులద్వారా నిజనిర్ధారణ గావించుకున్నాడు.
డొకర్ ఖాన్ మొదట కించిత్తు తటపటాయించినా –
తదుపరి “సరే!” అన్నాడు.
ఆమె దరహాసము కోటి లావణ్యాల తేనెపట్టు.
అపురూపం ఆమె సౌందర్య సంపద.
*****************,
రాణి రూపమతి, భోంగాసి లు నివాస కేంద్రం కోట దగ్గరి – ఖైటూన్ పైన దాడి చేయండి”
అంటూ వికటాట్టహాసంతో, వక్రబుద్ధి ఐన కేసర ఖాన్ హుకుం జారీ చేసాడు.
మరి కొన్నిరోజులలో హోలీ పండుగ వస్తుంది!!!!! కనుక హోలీ పండగ తర్వాతనైతే – తేలికగా గెలుస్తాము – అని స్నేహితుడు ఇబ్రహీం చెప్పాడు. తమ్ముని, స్నేహితుని సలహాలుసబబుగానే తోచిన ఖాన్ “సరే! అలాగే! చూద్దాం!” అంటూ అంగీకరించాడు.
రాణి రూపమతికి , కేసర్ ఖాన్ దురాలోచన తెలియవచ్చింది.
*****************,
శత్రువులు దుష్ట బుద్ధితో - తమను చుట్టుముడుతున్నారనే - వార్త తెలిసింది రాణికి. రూపమతి రాబోయే ఆపదను ఎలాగ ఎదుర్కోవాలి? అని యోచించసాగినది. వారి అనుచరులు “కిం కర్తవ్యమ్?” మలగుల్లాలు పడుతున్నారు. వసంత కాల ఆగమన వేళ అది! స్వీయ రక్షణకై తన మేధస్సుకు పదును పెట్టింది రాణి -సత్వరమే ఆమె ఒక పధకం వేసింది. రూపమతి వ్యూహ రచన ప్రకారం “మేము ఇక్కడ హోలీ పర్వమును ఘనంగా చేస్తున్నాము. మీరు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి రండి” అంటూ ఆహ్వానించింది. ఎగిరి గంతేసారు పఠాన్ లు ఇద్దరు.
హోలీ పండగ ఎప్పుడెప్పుడా? – అనీ ఆతృతతతో మీనమేషాలు లెక్కబెట్టసాగారు.
*****************,
ఒక శుభోదయం లో కామాతురులైన కేసర్ ఖాన్, ఇబ్రహీం ఖాన్ లు “కోట”కు వచ్చి బస చేసారు. ‘కోట-’లో సేవకులూ అందరూ మౌనంగా - రాణి రూపమతి పిలుపు కోసం వేచి ఉన్నారు.
ఆ కొలువులో ఒక సలహాదారుడు “సర్దార్జీ! రాణి రూపమతి మన మీద ఏదో కుట్ర పన్నుతూన్నది. మిమ్మల్ని కూలద్రోయడానికి పన్నాగాలు చేస్తూన్నదని నాకు అనుమానం వేస్తూన్నది” అన్నాడు. “నీది అనవసరపు సందేహం. ఒకవేళ ఆమె మనమీద తిరగబడినప్పటికీ ఓడిపోవడం ఖాయం. ఆమె భర్త భంగు, నల్లమందుల వ్యసనపరుడు. అట్లాంటి మొగుడి అండతో ఆమె మనతో పోరాడి, విజేత అవడం అసంభవం” అంటూ కొట్టిపారేసాడు కేసర్ ఖాన్. తన హితమునకై ప్రధాన ఆంతరంగిక సలహాదారుడి అభిప్రాయాన్ని పెడచెవిని బెట్టాడు.
కొద్ది రోజుల్లో రాబోయే హోలీ కోసరం ఖాన్ పక్షీయులు ఎదురు చూడ సాగారు.
*****************,
వస్తుంది, వస్తుంది అనుకున్న హోలీ రానే వచ్చింది.
అక్కడ ఖైతూన్ లో నివసిస్తున్న రాణి రూపమతి ప్రధాన సైన్యాధిపతిని పిలిచింది. ఆమె మేధస్సులో అల్లుకున్న ఆలోచనలను వివరించింది. రాణి రతన్ సింగ్ తో – తమ ప్లానులోని సాధక బాధకములను సాకల్య సాంగోపాంగంగా - చర్చించింది.
రతన్ సింగ్ “మహారాణీ! మీ యోచనలు సమర్ధనీయం, సమర్ధవంతంగా ఉన్నవి. కార్యరంగంలోనికి దూకడమే మన తక్షణ కర్తవ్యం.” అన్నాడు.
వెనువెంటనే ఆమె వాక్కులను ఆచరణలో పెట్టడానికి సన్నాహాలు చేయ నారంభించాడు.
*****************,
తాము అనుకున్న ఉపాయం ప్రకారం రాణి ఒక ఉత్తరాన్ని రాయించింది.
“రాణి రూపమతితోనూ, ఆమె చెలికత్తెలతోనూ హోలీ ఆడటానికై రావలసినది.” అంటూ రాసి ఉన్న ఆ లేఖను ఇచ్చి రాయబారం పంపించారు.
“వచ్చేది వాసంతము. మీ పరిజనం తో వచ్చి, రాజ్ పుతానీ రూపమతితోనూ, రాణీవారి నెచ్చెలులతోనూ రంగురంగుల హోలీని ఆడతారు అని అభిలషిస్తున్నాము. ఈ క్రీడ ద్వారా యుద్ధ కాంక్ష ఉపశమిస్తుందని , శాంతి విరబూస్తుందనీ భావిస్తాము.”
("Hope your thirst for battle has been quenched.
Springtime has come.
Come with your courtiers to play Holi with the Rajputani")
ఈ వర్తమానం తీసుకువచ్చిన రాయబారికి మరుక్షణమే
“నేను ఒప్పుకుంటున్నాను” అని కేసర్ ఖాన్ జవాబు పంపాడు.
*****************,
ఖైటూన్ కు సేవక సమేతంగా హంగు ఆర్భాటాలతో బయలుదేరాడు.
ఆషామాషీగా వెళ్తే ఎలా? దర్బారులోని ఉద్యోగులకు కూడా తనతోపాటు,
ఖరీదైన చెమ్కీ దుస్తులను ధరింప జేసాడు.
ఇంక రాణి రూపమతితోనూ, ఆమె సఖులతోనూ
రంగుల హోలీని ఎప్పుడెప్పుడు ఆడుదామా!- అని అతగాడు చాలా ఆరాటంతో ఉన్నాడు .
ఇటు రాణి రూపమతీ వర్గం వారు సైతం
ఎత్తుకు పైఎత్తులతో సర్వ సన్నాహాలతో సిద్ధంగా ఉన్నారు.
వారికి మరి వేరే దారి, గతి లేదు.
ఆత్మ రక్షణయే కాక మాన ధన సంరక్షణ కూడా
దీపశిఖల వలె వెలుగుతూ వారి ఎట్టెదుట ఉన్నవి కదా!
*****************,
కేసర్ ఖాన్, బంధు, మిత్ర వర్గీయులు సిల్కు లాల్చీ, పైజమాలు, తలపాగాలూ ధరించారు,
సెంటు, అత్తరుల ఘుమాయింపులతో తరలివెళ్ళారు.
ఆ సరికి ఖైటూన్ లో హోలీ సంభారములతో రెడీ ఐ ఉన్నారు.
మహలునూ, తోటనూ తీర్చిదిద్దారు. హోలీ గులాల్, బుక్కాయిలను నిండా పోసిన పళ్ళాలను, తాంబాళములనూ పట్టుకుని ఎదురేగారు రాణి రూపమతీ సహచరులు.
అతి లోక సౌందర్యం ఆ రాణి రూపం ఖాన్ కళ్ళను మిరుమిట్లు గొలుపుతూ, బైర్లు కమ్మేసాయి.
ఆనాటి దాకా సోదర ద్వయం అనేక రణరంగాలలో యుద్ధాలు చేసీ చేసీ అలసిపోయి ఉన్నారు.
రణపిపాసను మరిపించేందుకు నాట్యగత్తెల సాన్నిహిత్యం కావాలని ఉవ్విళ్ళూరుతున్నాడు.
రూపమతి స్వాగత సంరంభాలు వారిని పోరాటాల కష్టాలను మరిచి,
కామ దుగ్ధతో మేను మైమరచిపోయేలా చేసింది.
*****************,
;
;
ఫౌంటెన్ లు ఉవ్వెత్తున అందాల జల్లుల పూవులై విరిసాయి.
వికసిత పుష్పాలు వాతావరణాన్ని పరిమళభరితం చేస్తున్నవి.
పట్టలేని తమకంతో రాణి రూపమతి సమీపించాడు కేసర్ ఖాన్.
ఆమె కూడా మందస్మిత వదనంతో అతడిపైన బుక్కాయి పొడిని చల్లింది.
అభీరము – అనే రంగు పొడి హోలీ ఉత్సవాలలో ప్రధానంగా ఉపయోగిస్తారు.
పిడికిళ్ళతో గులాబు పొడిని చల్లడమే – అత్యంత ముఖ్య సంకేతం.
ఆ సంజ్ఞను చూపులతోనే అందుకున్నారు సైనికులు.
అక్కడ ఉన్నది స్త్రీలు కాదు, వాళ్ళు అందరూ వనితల వేషాలలోని మగవాళ్ళు.
వాళ్ళంతా అప్పటికే ఒడలు నిండా ఆభీర చూర్ణములను పూసుకున్నారు.
రాజపుత్రుల ఆచారము ఇది. “ఓటమి తప్పదు” అని తెలిసినా –
సర్వ శక్తులనూ పణంగా పెట్టి, యుద్ధరంగంలోకి దూకే అవసరం వచ్చినప్పుడు,
అరుణవర్ణాలను మేనుల నిండా అలముకుంటారు, ఎర్రని వస్త్రాలను ధరించి,
మడమతిప్పని యోధులై ప్రతిజ్ఞలను నిలుపుకుంటారు.
*****************,
“హడా వంశీయులు” ఐన రాజపుత్రులు 300 మంది ఉన్నారు.
మెరుపువేగంతో నారీ వలువలను విప్పేసారు.
మారువేషాలను విప్పేసి, లోదుస్తులలో దాచుకున్న
ఖడ్గములనూ, డాలులనూ పట్టుకుని నిలబడ్డారు.
లిప్తపాటులో పఠానులపైకి ఉరుముతూ ఉరికారు.
కేసర్ ఖాన్ ఆశ్చర్యంతో నిశ్చేష్ఠుడైనాడు.
ఆ పోరుగడ్డపై కేసర్ ఖాన్ మాత్రమే కాదు,
అతడి సైనికులందరూ మట్టిగరిచారు.
*****************,
;
;
రాణి రూపమతీ దంపతులకు కోట – స్వాధీనమైంది.
క్రూర నియంతలైన పఠాన్ ల పంజాల నుండి విముక్తి లభించిన ప్రజలు,
రాణి రూపమతీ దంపతులకు స్వాగతం పలికారు.
ఈ సారి హోలీ పండుగను యావత్ ప్రజానీకమూ సంబరాలతో చేసుకున్నారు.
రాణి పద్మిని గాధకు తీసిపోనిది రూపమతి చరిత్ర.
ఐతే రాణి రూపమతి తన మాతృభూమిని మరల పొందగలిగింది.
రాణి రూపమతి story సుఖాంతమై,
రాజస్థాన్ పల్లెపాటలలో కాంతులీనుతూ తొణికిసలాడుతూన్నది.
*****************,
colour powder (Abir) , signal: (Link)
*****************,
Tag words:-
Queen Roopmati, king Bhongasi
sixty villagers retired to Kaithun
Ratan Singh, nodded and went to put into action the queen's plan;
Palace of Kota, known asGarh
Back in Kota, the people gave a colourful welcome
their king and queen, for freeing them from the tyranny
Rajputs, Hada Dynasty
*****************,
కోణమానిని viwes:- 00051471
కోణమానిని తెలుగు ప్రపంచం
39058 పేజీవీక్షణలు - 970 పోస్ట్‌లు, చివరగా Mar 26, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
అఖిలవనిత
20934 పేజీవీక్షణలు - 705 పోస్ట్‌లు, చివరగా Mar 15, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
2370 పేజీవీక్షణలు - 112 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి