13, ఏప్రిల్ 2013, శనివారం

కిరీట ధారిణి


అవలీలగా గుర్తు కొస్తూండేవి ప్రతి ఒక్కరికీ 
తమ తమ తీపి బాల్య అనుభవాలు:
తర తమ భేదాలు లేకుండా చిన్ననాటి జ్ఞాపకముల చిరు లేఖనాలను 
మనసు పుటలలో ఏదో ఒక మారుమూలలలో అచ్చుఅయి ఉంటాయి.
ఇందుకు విపర్యాసమేమీ లేదు,
వసారాలో పడక కుర్చీలో కూర్చుని
సుహాసిని కూడా అప్పుడప్పుడూతన చిన్ననాటి తలపులలో ఓలలాడుతూంటుంది.

************

మహా రాజు, మహా రాణి ఆటలను ఎక్కువగా క్రియేట్ చేస్తుంది తన కోసమనే! 
వాటిలో తనేమో పట్టమహిషి, చక్రవర్తిగా సైతమూ తానే! 
తతిమ్మావాళ్ళంతా మంత్రి, సైన్యాధిపతి పరిచార సమూహ, వంది మాగధీ గణమన్న మాట! 
ఫిబ్రవరి, చలి ఛాయలు వీడ లేదు.
మంచు తెరలలో జగతి – మేలిముసుగు ధరించిన పడతి లాగా ఉన్నది 
చిత్రంగా ఉన్నది ఈ యేల............” 
“కన్నె మనసులు” సినిమా పాటను 
హమ్ చేస్తూ రిలాక్స్ ఔతూన్నది ఆమె.
మనసు విహంగంలాగా ఆనంద సీమలలో విహారములు చేస్తూన్నది.
సుహాసిని సృజనాత్మక శక్తి మిక్కుటం!
సుహాసిని “సినిమా రీలులాగా 
ఇలాగ గత స్మృతులు అలలు అలలుగా 
మేధస్సులో వర్తమానపు తీరాన్ని ఒరుసుకుంటూ రావడమనేది భలే అనుభవం కదూ!” 
తనలో లోలోన నవ్వుకున్నది. 
ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి ఇంటి పనిలో దూరింది సుహాసిని.

****

ఆరావముదుని కన్నతల్లి ప్రవీణమ్మ.ఆరావముదుని వెంటబెట్టుకుని, ఆమె కట్టుబట్టలతో ఈ సీమకు వచ్చింది.
తల్లి సౌజన్యతను అతను పుణికి పుచ్చుకున్నాడు ఆరావముదు సుహాసిని – ఆరావముదు.
ఈ ఇరువురి గమనములూ -బ్రతుకు బాటలో అనేక ఒడిదుడుకులను చూసినవే!
శ్రీరామ చంద్రునికి సుగ్రీవుని మైత్రీ బంధము చందంగా ఆరావముదువీ, సుహాసినివీ అనుస్పందనలు ఒకటే అవడంతో సఖ్యమ్ సాప్తపదీనమ్ అనే ఆర్యోక్తిని అనతి కాలంలోనే ఋజువు చేసారు,
గృహ సామ్రాజ్యపు సింహద్వారాన “సుహాసినీ ఆరావముదు” నేమ్ ప్లేట్ వెలిసింది. సుహాసినీ దంపతులకు ఆణిముత్యాల లాంటి ముగ్గురు పిల్లలు ప్రదీప్, అనురాగ్, తనూజ పిల్లలతో, హాయిగా రోజులు గడుస్తున్నాయి.

****
సుహాసిని మామగారికి జరాభార సమస్యలు! పెంచిన కొడుకులు ఆస్థిని రాయించుకున్నారు.
ఆనక నాన్నను చిన్నాయనలు ఆయనను పట్టించుకోకుండా గాలికి వదిలేసారు.
సుహాసిని తల్లి అడిగింది “సుహాసినీ! మీ తాతయ్యని ఇక్కడికి తీసుకు వద్దాము. ”
” అమ్మా! మనం కష్టాలపాలైనప్పుడు నిర్లక్ష్యంగా వదిలేసిన వాళ్ళు మూడు తరాలు క్రోధాన్ని మనసులలో నిండా పేరుకున్న వాళ్ళు వాళ్ళు: ప్చ్! వద్దు! కుదరదు లేమ్మా! ” కూతురి జవాబు విని ఇక ఆ విషయాన్ని రెట్టించలేదు ఆమె.

****

కానీ "నర్సు ఉద్యోగిని"గా అలవాటైన పరోపకార భావనా ​​సంస్కారం 
సుహాసినిని నిర్లిప్తంగా ఊరకే చేతులు ముడుచుకు కూర్చోనివ్వలేదు. 
నాలుగైదు రోజులు అంతర్మధనం. ఫలితం …..
సుహాసిని తాతగారిని తమ ఊరికి తెచ్చి, ఆసుపత్రి సదుపాయాలను సమకూర్చింది. 
భర్త, అత్తగారూ మొదట “ఎందుకు, లేని పోని బాధ్యతలు లంపటాలు వద్దు” అని వ్యతిరేకించారు. 
కానీ తర్వాత “సరే! ఎంతోమంది బాధలను మన చేతులతో నయం చేసాము. 
ఫర్వా లేదు, మీ తాతక్కూడా స్వస్థత చేకూర్చుదాము, తీసుకు రామ్మా! ” అంటూ అంగీకరించారు.

****

నర్స్ జాబ్ ను యాంత్రికంగా కాక మనస్ఫూర్తిగా చేస్తుంది సుహాసిని.
కనుకనే అందరికీ తలలో నాలుక అయి మెలగినది సుహాసినికి 
రాష్ట్ర స్థాయిలో పురస్కార, బహుమానాలూ, పదవీ ఉన్నతులూ లభించినవి. 
సుహాసిని యొక్కతాతకూ నాయనమ్మకూ -. 
అంతే కాదుఆయన కుటుంబీకులకు సైతం “నర్సు ఉద్యోగము” అంటే ఏహ్యభావం"
సుహాసిని, ఆరావముదులు ఆఫీసుకు వెళ్ళాక
ఆయనకు టైమ్ పాస్ అయ్యేది కాదు.
సుహాసిని తల్లి, అత్తగార్లు గుడికి వెళ్ళినప్పుడో లోపల పనిలో ఉన్నప్పుడో
సుహాసిని తాత అవకాశాన్ని దొరకబుచ్చుకునేవాడు.
సుహాసిని యొక్క పిల్లలను చేరబిలిచేవాడు.
"మీ అమ్మ మిమ్మల్ని సరిగా పెంచడం లేదు.
పనికిమాలిన ఉద్యోగం చేస్తూన్నది.ఉద్యోగం పేరు చెప్పి, 
బైట జల్సాగా షికార్లు చేస్తున్నది.పాపం! మీరెంత చిక్కి పోయారు"
ఇలాగ తాత -. మనుమల మనసులలో చేదును వంచుతూ వచ్చాడు

****
కొద్ది కొద్దిగా చిన్నారుల అలోచనలను అల్లకల్లోలం ఔతూన్నవి
సుహాసిని కూతురు తనూజ తన అన్నయ్య, తమ్ముని కంటె ఎక్కువ కలవరపడసాగింది.
“అమ్మ ఇలా ఎందుకు చేస్తూన్నది?”
ఇలాగ భావాందోళితమౌతూన్నది తనూజ.

****

ముంబై మామయ్య నుండి ఫోన్ వచ్చింది .
“సుహాసినీ! మా కుటుంబానికి నువ్వు చేసిన మేలు మరువలేనిది.
ఈ నాడు మేము, మా పిల్లలమూ జీవితాలలో నిలద్రొక్కుకోగలిగామంటే అంతా నీ చేతి చలువయే!
మా అనిరుద్ధ్ పెళ్ళికి సకుటుంబ సపరివార సమేతంగా వస్తావు కదూ!"
లెటర్ రాసి, శుభలేఖను పంపించారు.
ఫోన్ చేసి సుహాసిని భర్తనూ ఇంటిల్లిపాదినీ పేరు పేరునా పిలిచారు.

*****

మారేజ్ ఫంక్షన్ సందర్భంగా దుస్తులు సామానులను కొనడానికి ఆంధ్రాకు వచ్చి, 
సుహాసిని ఇంటికి వచ్చారు ముంబై పెళ్ళివాళ్ళు.
మనుమని పెళ్ళి పిలుపులను ఇంకా ఎవరెవరు పిలవాల్సిన ముఖ్యమైన వాళ్ళెవరైనా,
మనము మరిచిపోయిన వాళ్ళు ఉన్నారా -? 
అంటూ సుహాసినిని సలహా అడిగారు ఫ్రతి పనికీ ఆమెను సంప్రదించేవారు. 
అడుగడుగునా ఆమెను సంప్రదించేవారు. 
సుహాసిని లోకానుభవమూ, కార్య నైపుణ్యాలూ – 
ప్రతి ఒక్కరికీ ఉపయోగమయ్యేవి. 
అవే సమయాలలో ముంబై మామయ్య మనుమలూ, మనుమరాళ్ళూ
ఉన్నత్, ఉత్పల్ అనిరుధ్ లు కలుపుగోలు, చలాకీ పిల్లలు 
సుహాసిని కుమారులకూ , ముఖ్యంగా తనూజకూ సన్నిహితులైనారు..
వారందరి అనుభవాలూ తనివి తీరా అచ్చ తెలుగు భాషలో – వీరితో పంచుకున్నారు.
అందులో ఎక్కువగా దొర్లినవి ‘సుహాసిని ఔన్నత్యాన్ని గురించే!’ తనూజకు నిమ్మళంగా తెలిసివచ్చింది -
‘తాను తాత మాటలలను నమ్మితన కన్న తల్లినే కించపరుస్తున్నాను'  అని అర్ధం చేసుకుంది.

“ఇంకా నయం! అమ్మను తూస్కరించే ప్రలోభానికి గురి అయి దూషించలేదు. 
తొందరపాటుతో అమ్మను నిందించి ఉంటే, 
ఆమెకే కాదు తండ్రికీ, నానమ్మకూ, అందరికీ 
మానసికంగా దూరమయ్యేది.
ఇంకా నయం!
భగవంతుడు తాను త్వరపడే అక్కర రానీకుండా 
ఈ ముంబై తాత గారి ఫ్యామిలీ రూపంలో సురక్షిత తీరాన ఆసీన అయ్యేటట్లు చేసాడు” 
కుమార్తె మనసులో కొద్దిరోజులుగా జరిగిన సంఘర్షణను సుహాసిని గమనించ లేదు.

ఆమె మొలకెతిన ధాన్యం గింజలను బౌల్ లో వేసి ఇచ్చింది 
“తనూజా! తాతగారు వరండాలో కూర్చుని ఉన్నారు, ఇవ్వు! ” 
సుహాసిని గుర్తించని తనూజలోని పెను సంచలన మార్పుల్ని స్పష్టంగా గమనించిన మనిషి ఒక్కడున్నాడు,
అతడే సుహాసిని మామగారు, అండ్ తాతగారు!
మరి తనూజ రోజూ మాదిరిగా ఆప్యాయతతో చేతికి ప్లేటును ఇవ్వకుండా ,
మంచం పట్టె మీద కొసన పెట్టేసి, గిరుక్కున వెనుదిరిగింది కదా మరి!!!!!!!!!!
;సడన్ గా ఫోన్, హాస్పిటల్ నుంచి భర్త, లైనులో ఉన్నాడు. 
ఆరావముదు “సుహాసినికి ఫోన్ ఇవ్వండి” ఫోన్ ఎత్తిన తల్లికి చెప్పాడు.
భర్త హాస్పిటల్ నుండి చేసాడు,
“గుండె ఆపరేషన్ జరుగుతూన్నది, అర్జంట్ గా నువ్వు రావాలి!"
తన బిబ్, ఏప్రాన్, కాలర్ కఫ్స్ డ్రస్సునూ ధరించింది
ఆదరా బాదరాగా, హడావుడిగా డ్రెస్సు వేసుకుంటూన్న తల్లి దగ్గరకు వెళ్ళింది తనూజ
” అమ్మా! ఈ తెల్ల కిరీటాన్ని (cap) మరిచిపోతున్నావు! “
అంటూ చేతికి ఇవ్వబోయి తానే ఆమె కొప్పులో పువ్వులాగా 
సున్నితంగా సుకుమారంగా అమర్చి,
తల్లి బుగ్గపైన గట్టిగా ముద్దు పెట్టుకున్నది తనూజ. 
కుమార్తె కళ్ళలోని ఒక వింత మెరుపుని చూసి సుహాసిని 
కించిత్ సంభ్రమాశ్చర్యాలకు లోనౌతూ,బయల్దేరుతూ అనురాగంతో చేయి ఊపింది.
“అమ్మా! ఈ కిరీటం చాలా బాగుంది.” కుమార్తె పసిడి పలుకులు అవి.
నాన్నమ్మ, అమ్మమ్మ తనూజ మాటలు వింటూ ఆమె చుబుకాన్ని ప్రేమతో పుణికారు.

- కాదంబరి 

Konamanini Views; 00051725; Posts: 972  

************

కీరిట ధారిణి March 2013 vihanga (Link)
Posted on March , 2013 by విహంగ మహిళా పత్రిక

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...