26, మార్చి 2013, మంగళవారం

బర్సానా సిటీలో కర్ర పెత్తనం


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాధా రాణి కోవెల వద్ద వింత ఆచారం - 
హుషారు గొలిపిస్తూ, అందరినీ ఆకర్షిస్తూన్నది. "లాఠీ  మార్ పర్వం" అది.
హోలీ పండుగ కు అదనపు హంగు ఇది - అని వక్కాణించవచ్చు. 
Uttar pradesh (State)లో మధురకు దగ్గరలో ఉన్నది బర్సానా సిటీ
నంద గావ్ (= నంద గ్రామము) నుండి 5 kms  దవ్వులోన ఉన్న బర్సానా -
రాధ నివసించిన ప్రాంతము అని విశ్వాసం. 

శ్రీకృష్ణుడు ఈ పల్లెకు వచ్చాడు. తన స్నేహితులతో కలిసి, 
రాధా రమణిని - సరదాగా ఉడికిస్తూ ఆటపట్టించాడు. 
ఇది చూసిన గ్రామ వనితలు- స్వీయ రక్షణ గావించుకొనడానికై - వారిని వెంబడించారు. 
ఆ నాటి నుంచీ పురుషులే స్వయంగా దీనిని ఒక ఆటగా గైకొన్నారు. 
ఈ సరదా ఆటను హోలీ క్రీడల వలె, సంప్రదాయంగా గైకొని పాటిస్తున్నారు.
హిందూ దేశంలో "రాధా దేవి" కి ఉన్న ఏకైక దేవాలయం ఇదే! 
నందగావ్ గ్రామ ప్రజలు హోలీ festival కి ముందర ఈ Barsana village చేరుకుంటారు. 
ఆ ఊరి వాళ్ళూ, ఇతర సీమల మగవారూ, pre Holi festival లో ఉత్సాహంగా పాల్గొంటారు. 
“లాఠీ మార్ హోలీ” (लट्ठमार होली) అని ఈ పండగ ను పిలుస్తున్నారు.

(లాఠ్, లాఠీ = అంటే దృఢమైన చేపాటి కర్రలు. పోలీసుల చేతుల్లో ఉండేవాటిని "lathy " అంటారందుకనే!)
Lath Mar holi  వేడుక నాటికి గ్రామపు గుడి ఆవరణ వద్దకు వేలాదిమంది గుంపులుగా చేరుతారు.
స్త్రీలు పురుషులపై లాఠీ ప్రయోగాలు చేస్తారు. హోలీ పాటలు పాడుతూ సంచరిస్తారు. 
"శ్రీ క్రిష్ణ!", "శ్రీ రాధే!" అంటూ ఎలుగెత్తి పలికే భజనలతో నలు దిక్కులూ మార్మ్రోగుతాయి. 
"బ్రజ భాష" (Braj bhasha) ఈ రోజు వీనులవిందొనరుస్తుంది. 
బ్రజ్ మండల్ హోలీ పాటలు - స్వచ్ఛమైన బ్రజ్ భాషతో పునీతమౌతాయి. 
మొదటి రోజున నంద గ్రామము నుంచి గోపబాలురు వస్తారు. 
ఆలమందలను కాచే గొల్లవారు వీరు. 
బర్సానా క్రీడకు అంతమంది వస్తున్నారు అంటే - ఆ ఆటకు కల ఆకర్షణ అలాంటిది మరి! 
బర్సానా మహిళలతో ఆడే ఈ పర్వమునకు అంతటి క్రేజ్ లభించిందన్న మాట!

***********************,
;
Braj bhumi, Holi 

;








హోలీ - పూర్తి ఐన తర్వాత - గోపబాలురు, గోపకులు Radha Rani గుడి బైటికి వస్తారు.  
Rang Rangeeli Gali  ఆట వీధులలో సాగుతుంది. మర్నాడు బర్సానా ప్రజలు నంద గావ్ కు వచ్చేస్తారు.
గోపికలతో రంగుల ఆటలు ఇప్పుడు వీరి వంతు. 
చిన్న పెద్ద తారతమ్యాల్లేకుండా ఆబాలగోపాలమూ పాల్గొనే వేడుక ఇది. 
కనుకనే "ఆబాలగోపాలము" అనే మాట - మన జాతీయ పద భాండాగారములోనికి  - 
కులుకుతూ వచ్చి చేరింది.

బర్సానా హోలీకి అదనపు విశేషం ఏమిటంటే - స్త్రీలందరూ ఈ అంశంలో ఏకతాటిపై నడుస్తారు. 
వనితారత్నాలు బహు హుషారుగా పురుషపుంగవులను లాఠీ కర్రలతో వెంటాడుతారు (సరదాకే లెండి!). మగవాళ్ళు కూడా వాళ్ళను అనునయిస్తూ, శాంతింపజేసే యత్నాలు చేస్తారు. 
వాళ్ళుకూడా ఉవిదల కినుకలను అపనయించేటందుకు- వరస పాటలను పాడ్తారు. 
మగమహారాజులు తిరిగి కర్రలు ఎత్తరు, 
అలాగ కనుక చేస్తే మొత్తం పండగ కాస్తా రసాభాస ఔతుంది కదా! 
అందుకనే వాళ్ళు - డాలు ను పట్టుకుని - 
ఆడవారి దారుఘాతాలనుండి తప్పించుకుంటూ ఆట ఉత్తేజభరితంగా సాగేటందుకు సహకరిస్తూంటారు
ఈ సహకార, అన్యోన్యతల వలననే - ఈ ఊరు "వార్తా శీర్షిక"లలోకి ఎక్కింది. 
మధ్య మధ్య కాస్సేపె రెస్ట్ తీసుకుంటూంటారు. 


విశ్రాంతి కాలములల్లో "తాండై" అనే పానీయాన్ని సేవిస్తూంటారు. 
తాండై డ్రింకు - కొంచెం "భంగు" మిళితము. అలుపు తెలీకుండా ఉంచేటందుకు "తండై " శీతల షర్బత్తును జనులు తాగుతారు. హోలీ, తాండై లు ఒకదానికొకటి ముడిపడిన రీతిలో - వేడుక జరుగుతుంది. 
  
హోలీ నిర్వహణానంతరం, భంగు ప్రభావం వాతావరణం అంతటా నిండి పోతుంది. 
భ్రమ, చిత్తచాంచల్యాలు , నవ్వులు, మధుర భక్ష్యాలకోసం అడగటము, 
ఇలాగ రకరకాల ఘటనలు కానవస్తాయి. అంతకుముందుదాకా ఉన్న యుద్ధవాతావరణము, 
వ్యతిరేక భావజాలముల నుండి అందరూ విముక్తి పొందినట్లు ఔతుంది. 
పరిసరాలు రిలీఫ్ భావనలతో తేలికబడతాయి.అప్పుడు పుష్ప రాసులతో   ప్రదేశాలు గుబాళిస్తూంటాయి.    
 ;

;




;
పుష్పాలు ఆహ్లాదాన్ని నింపుతాయి. 
దైవ మూర్తులను పుష్పదళాలలో  కూర్చుండజేస్తారు. గులాబీ పూ రేకులు, పరిమళ భరిత ప్రసూనాలతో - కోవెల చుట్టుపక్కలా, ఊరూ వాడా సువాసనలతో హాయి హాయిగా మారుస్తాయి. 
వెంటాడినట్లుగా నారీమణులూ, పారిపోతూన్నాట్లుగా పురుష పుంగవులూ 
అప్పటిదాకా ఆడిన ఆటలు "జగన్నాటక సూత్రధారి శ్రీక్రిష్ణ లీలలకు తీపి సంతకాలు ఔతాయి. 
రాధా క్రిష్ణుల రాసక్రీడలకై మరుసటి సంవత్సరందాకా ఫాల్గుణ మాస పౌర్ణిమకై 
ప్రకృతితో పాటు కాలపురుషుడు ఎదురుచూస్తూంటాడు.
ఈ ప్రత్యేక హోలీ కి - నెల రోజుల ముందు నుంచీ పండుగ సన్నాహాలు మొదలౌతాయి. 
హోలీ హేల జరిగిన తర్వాత, మరుసటి రోజుకి అతివలతో వారి భర్తలు
మగవాళ్ళు, ఆడవాళ్ళు - ఒక్క మాటలో చెప్పలంటే యావన్మంది స్థానిక జనులు - 
బర్సానా నుండి నంద గావ్ కి వెళ్తారు. 
తదుపరి అనంతరపు హేల అన్న మాట! ఈ ముచ్చట!!!!!!!!                   
హోలీ హేల జరిగిన తర్వాత, మరుసటి రోజుకి అతివలతో వారి భర్తలు, మగవాళ్ళు, 
ఆడవాళ్ళు - ఒక్క మాటలో చెప్పలంటే యావన్మంది స్థానిక జనులు - 
బర్సానా నుండి నంద గావ్ కి వెళ్తారు. 
తదుపరి అనంతరపు హేల అన్న మాట! 
ఆలుమగలకు అంతకు ముందు ఏవైనా మనస్పర్ధలు ఉంటే  తొలగిపోయి, 
ఈ క్రీడా పర్వం పుణ్యమా - అని సుహృద్ భావం ఏర్పడి, 
నిత్య జీవన యానంలోని ప్రతిష్ఠంభన కాస్తా   పోగొడ్తుంది ఈ ముచ్చట పండుగ! !!!!!!!

***********************,

బర్సానా ప్రౌఢ ప్రమదామణులు తమ కోడళ్ళకు ప్రత్యేక ఆహారాన్ని ఇవ్వడము వంటి స్పెషల్ ఉల్లాస సంఘటనలు లాఠీ మార్ హోలీ వేడుకకు నెల రోజులు ముందు నుండి జరుగుతూంటాయి. 
(అత్తల గోరుముద్దలు - కోడళ్ళకు ఔరా!!
మరి హోలీ (ప్రణయ) రణరంగ ఉత్సాహం పుంజుకోవాలికదా! 
ప్రేమ, హాస్య మానస సంభారాలు, సమానతలో సౌమనస్య వర్ణ చిత్ర సమ్మేళనములూ - సంభవించేలా జేసే పండుగ - మన భారత  దేశములోనే కాదు, ప్రపంచములోనే బహుశా హోలీ ఒక్కటేనేమో!
ఇదే "వసంతోత్సవము పర్వ దినము" కూడా!
హోలీకి పూర్వ క్రీడ ఐన ఈ 'లాఠీ మార్' ఒక అపూర్వ ఉత్సాహ వేదిక.


***********************,


హోలీ పండగ రాబోయే సంవత్సరములలో వంతోత్సవముఈ తేదీలలో వస్తుంది.
In  2013, Holi is on Wednesday, March 27.
In 2014, Holi is on Monday, March 17.
In 2015, Holi is on Friday, March 6.




***********************,




ఆధార టాగ్స్:- 
Bangi • Malayalam: Kanchavu • 
Telugu: Ganjari-Chettu • 
Bengali: Jia Botanical name: Cannabis sativa 
Family: Cannabaceae (Marijuana)   

Nice photos : (Link:-            
http://www.theatlantic.com/infocus/2011/03/holi-the-festival-of-colors-2011/100032/  )
లాఠ్ మార్ హోలీ”/ (హింది: लट्ठमार होली)

***********************,

అఁ ఌ కఁ గఁ చఁ టఁ అతఁడు అఁ ఌ కఁ గఁ చఁ టఁ అతఁడు 

Tags:-
1) The second day gops from 
Barsana go to Nandgaon to play holi with gopis

2) (participants sip 'thandai', a cold drink  ;
intoxicating because it is laced with a paste called bhang, 
made of cannabis. Bhang and Holi go together. )


***********************,



అఁ ఌ కఁ గఁ చఁ టఁ అతఁడు మ్ మ్ అఁ ఌ కఁ గఁ చఁ టఁ అతఁడు మ్ మ్



కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...