24, అక్టోబర్ 2011, సోమవారం

పర్షియన్ పికిల్


Persian pickles




పర్షియన్ పికిల్ ("Persian pickles”)- 
అంటే తెలుసా మీకు?
మామిడి పిందెలు- కు సంబంధించినది. 
అంటే మావి పచ్చడి- అనుకుంటున్నారా? 
ఐతే “అక్కడే, అప్పుడే మీరు – 
ఆవకాయలో కాలు వేసేసారన్న మాటే”!


1888 లలో అమెరికాలో సాంప్రదాయ నేతలు, 
ముఖ్యంగా క్విల్ట్ తయారీదారులు -  
("Persian pickles” 
by American traditionalists, 
especially quiltmakers) -


అనే పలుకును పలుకుబడి లోనికి  వాడుకలోకి తెచ్చారు.


చీరలు, వస్త్రాల మీద వేసే “మామిడి పిందెలు డిజైన్”కి  
 Paisley  అనే పేరు వెస్టెర్న్ కంట్రీలలో ఉన్నది.


Paisley pattern/ Paisley wallpaper/Paisley అనీ,  
వస్త్ర ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్న మాట ఇది.


ఈ వలువల చిత్రలేఖనపు మూలములు మాత్రం- 
మన హిందూ దేశం నుండే ఆరంభమైనాయని,  
మనం కాస్త గర్వంగా వక్కాణించవచ్చు.


ఇక మన దేశంలో తమిళ నాడులో 
“mankOlam” అని పేరు. 
మాంబలం- అనగా మామిడి పండు  
పంజాబీ  భాషలో అంబి/ అంబ్ 
('ambi/ amb’ ) అని  పిలుస్తారు .


ఇండియా, పాకిస్థాన్, పర్షియా దేశాలు -   
ఈ మామిడి పిందెల డిజైన్ లకు 
ప్రథమ బీజావాపన చేసిన దేశాలు.


బుల్లి బుల్లి పిందెల చిత్రీకరణ – 
ఇందులోని (Paisely Wallpaper)ప్రత్యేకత.


వాస్తవానికి -పైస్ లీ- అనేది స్కాట్లాండ్ లోని ఒక పట్టణం పేరు. 
అక్కడ దుస్తుల డిజైన్ లలో – 
ఇది ఎంతగా పాప్యులర్ ఐనదంటే-
ఈ డిజైన్ పేరుతో 
ఏకంగా ”పైస్లీ పార్క్” అక్కడ వెలిసింది. 
పైస్ లీ పార్క్ – గీతాల ఆల్బం సింబల్ – 
మామిడి పిందెల వర్ణ భరిత చిత్రలేఖనమే!


                          – కాదంబరి


This entry was posted in వ్యాసాలు. 
Bookmark the permalink.



  పర్షియన్ పికిల్
Posted on October,2011 by విహంగ

2 కామెంట్‌లు:

కృష్ణప్రియ చెప్పారు...

Interesting

kadanbari చెప్పారు...

Thank you, కృష్ణప్రియ గారూ!

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...