25, అక్టోబర్ 2011, మంగళవారం

జాబిల్లి తడబాటు"

























;
;
;

దివ్య దివ్య దీపావళి;
తిమిరాల ప్రశ్నలకు;
జవాబుగా దీపావళి ||
;
బాణసంచా, పటాసుల
మిరుమిట్ల తారకలు
కోట్లాదిగ పుడమి పైన
వెలిసినాయి, చూడండి! ||
;
"నింగి కాస్త దారి తప్పి;
దిగి వెళ్ళెను, కాబోల"ని-
ఎంచి, నిండు చందమామ
తత్తరపడి ; భువికి జార;
నింగిలోన నేడు అటుల -
"అమావాస్య" అవతరించె.

rachana: కాదంబరి


&&&&&&&&&&&&&&


ఘనమైన దీపావళి  (Link 1) :  Forkids   WEB 


వెన్నెలకు తొట్రుపాటు :  (Link 2) akhilavanitha- blog  


దీపావళి దేవికి ఇష్టమైన రాగాలు (Newaavakaaya WEB)
                                                                          (Link 3)
;

24, అక్టోబర్ 2011, సోమవారం

పర్షియన్ పికిల్


Persian pickles




పర్షియన్ పికిల్ ("Persian pickles”)- 
అంటే తెలుసా మీకు?
మామిడి పిందెలు- కు సంబంధించినది. 
అంటే మావి పచ్చడి- అనుకుంటున్నారా? 
ఐతే “అక్కడే, అప్పుడే మీరు – 
ఆవకాయలో కాలు వేసేసారన్న మాటే”!


1888 లలో అమెరికాలో సాంప్రదాయ నేతలు, 
ముఖ్యంగా క్విల్ట్ తయారీదారులు -  
("Persian pickles” 
by American traditionalists, 
especially quiltmakers) -


అనే పలుకును పలుకుబడి లోనికి  వాడుకలోకి తెచ్చారు.


చీరలు, వస్త్రాల మీద వేసే “మామిడి పిందెలు డిజైన్”కి  
 Paisley  అనే పేరు వెస్టెర్న్ కంట్రీలలో ఉన్నది.


Paisley pattern/ Paisley wallpaper/Paisley అనీ,  
వస్త్ర ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్న మాట ఇది.


ఈ వలువల చిత్రలేఖనపు మూలములు మాత్రం- 
మన హిందూ దేశం నుండే ఆరంభమైనాయని,  
మనం కాస్త గర్వంగా వక్కాణించవచ్చు.


ఇక మన దేశంలో తమిళ నాడులో 
“mankOlam” అని పేరు. 
మాంబలం- అనగా మామిడి పండు  
పంజాబీ  భాషలో అంబి/ అంబ్ 
('ambi/ amb’ ) అని  పిలుస్తారు .


ఇండియా, పాకిస్థాన్, పర్షియా దేశాలు -   
ఈ మామిడి పిందెల డిజైన్ లకు 
ప్రథమ బీజావాపన చేసిన దేశాలు.


బుల్లి బుల్లి పిందెల చిత్రీకరణ – 
ఇందులోని (Paisely Wallpaper)ప్రత్యేకత.


వాస్తవానికి -పైస్ లీ- అనేది స్కాట్లాండ్ లోని ఒక పట్టణం పేరు. 
అక్కడ దుస్తుల డిజైన్ లలో – 
ఇది ఎంతగా పాప్యులర్ ఐనదంటే-
ఈ డిజైన్ పేరుతో 
ఏకంగా ”పైస్లీ పార్క్” అక్కడ వెలిసింది. 
పైస్ లీ పార్క్ – గీతాల ఆల్బం సింబల్ – 
మామిడి పిందెల వర్ణ భరిత చిత్రలేఖనమే!


                          – కాదంబరి


This entry was posted in వ్యాసాలు. 
Bookmark the permalink.



  పర్షియన్ పికిల్
Posted on October,2011 by విహంగ

21, అక్టోబర్ 2011, శుక్రవారం

జ్ఞాన ప్రతీక సొయొంబో Letter


the Soyombo in national flag,new Republic of Mongolia

ఈ బొమ్మను గమనించారా?
ఇది బౌద్ధ - ధర్మ ప్రతీకాత్మక అక్షరము. 
దేవనాగరి, 
(देव नागरी)
టిబెట్, 
/సంస్కృత లిపుల(संस्कृतं) నుండి 
తీర్చిదిద్దిన ఈ మహా అక్షరము, 
మంగోలుల సంస్కృతిలో 
పవిత్రమైన పూజ్యనీయ సొయంబోఅక్షరము .


హిందువులకు ఓమ్ కారము, 
శ్రీకారము వంటిదే ఈ  సొయొంబో అక్షరము. 
ఈ బొమ్మను మళ్ళీ పరిశీలించండి. 
ఇందులో మన దూరదర్శన్ వారు అనుసరిస్తూన్న ప్రతీకాత్మక చిత్రం ఉన్నది కదూ!


దీనిలో "ఓమ్", 
కళ్యాణ తిలకము, 
సూర్యుడు, 
చంద్రవంక, 
విశ్వ ఆవిర్భావము, 
త్రికోణము, 
పీఠము,  
ఛత్రము ఆదిగా గల అనేక అంశములు 
ఊహాత్మక స్వరూపములలో చిత్రితమై ఉన్నవి. 
;
Mongolian number plates include the Soyombo national symbol


















ఈ సింబల్ కర్త మంగోలియా  - పేరు జాన బజర్ (జ్ఞాన వజ్ర). 
Zanabazar బౌద్ధ ధర్మ- వజ్రయాన అనుయాయి.
1686 సంవత్సరము కాలములో
సొయొంబో ఈ సింబల్ ను రూపకల్పన చేసిన తత్వవేత్త.
అందుచేతనే ఆతడు 
మంగోలియా ప్రజలకు చిరస్మరణీయుడు అయినాడు.


(The Soyombo alphabet 
was created in 1686 
by the famous Mongolian monk and scholar Zanabazar; 
Lantsa-Dewanagari script,
Tibetan and Sanskrit; 
prayer mills and temples).


సొయొంబో జ్ఞాన ప్రతీక, 
మంగోలియా భాషా లిపి నిర్మత Zanabazar. 
హిందూ లిపి నుండి, లాంజిష్ లిపి నుండీ 
జాంజబజార్ - ఇలాగ ఒక సరి కొత్త లిపిని ఆవిష్కరించాడు. 
సొయొంబో అక్షరము, 
వ్రాతలో చాలా క్లిష్టతరముగా ఉన్నది. 
అందుచేత ఆ ఆక్షరము 
ప్రజల నిత్య వ్యావహారిక వ్రాత లిపి(Hand writing) లో  
వ్యాప్తి చెందలేదు 
(అంటే మన తెలుగులోని 
క్రమేణా చేతి రాతలో నుండి కనుమరుగు ఐనట్టి 


బండి 'ర' = ఱ, 
అలుకారము= 'ఌ' 
అర సున్న = జఁ 
  
ఈ మాదిరిగా అన్నమాట.


ఌ [ ~l ]
ౡ [ ~L ]
ఱ [ ~r ]
ra@m [ రఁ]
జఁ [~@M ]


The Soyombo
నేడు ప్రార్ధనా మందిరములలోనూ, 
పగోడా దేవళములలోనూ 
ఈ ప్రతీక చైతన్య భాసురమై ఉన్నది.


Mongolian monk and scholar Zanabazar;  (Link)


జ్ఞాన ప్రతీక సొయొంబో
;

12, అక్టోబర్ 2011, బుధవారం

ఓహో! హెర్క్యులెస్!


;
ఓహో! హెర్క్యులెస్! 
అంత కొండను ఎత్తి పట్టుకున్నావే!!!!!!!!!! 
ఔరా! నీ సాహసము!!!
ఇంతకీ ఆ పర్వతరాజమును
నీ భుజముపైన ఎత్తి పెట్టినవారు ఎవరోయీ? 
కాస్త చెప్పుమోయీ!!
ఈ సరదా ఫోజును ఇచ్చిన చోటు- మేఘాలయా గుహలు వద్ద.
షిల్లాంగ్ నుండి 50 kms లో ఉనంది 
కొత్తగా డెవలప్ చేస్తూన్న  లైట్ మావ్ సియాంగ్ పార్కు.
capital of Meghalaya,
అత్యధిక వర్షపాతము గల ప్రాంతంగా పేరు ఉన్న 'చిరపుంజీ'కి  
కొంత దూరములోనే "లైట్రింగ్యూ" కి దారి తీసే మలుపు ఉన్నది.
ప్రకృతిసిద్ధందా హృదయం ఆకారంలో - 
చెక్కినట్లు ఉన్న శిలా, గుహలు, ప్రకృతి సోయగాలు,
 వెదురు బద్దలతో నిర్మించిన వంతెనలు, జలపాతాలు...... 


;;;;; 
;
ట్రెక్కింగ్ చేసే అభిరుచి గల యువతకు, 
ఆసక్తి కలవారికి ఆహ్లాదభరితం 
ఈ కొండ కోనలు, లోయలూ, 
వాటర్ ఫాల్సు .............. అన్నీ.......
ఇట్లా ఫొటోగ్రఫీ కళకి మెరిసే కొత్త రజను పొడులను అద్దే 
చమత్కార ఆలోచనలు కలుగుతాయి- 
అనడానికి ఈ ఫొటోలే నిదర్శనములు.
Tags:- 
Laitmawsiang Park ; 50kms Shillong; 
Laitryngiew - Cherrapunjee;
orchid flowers, bamboo bridges, 
heart shaped hole naturally in rock 
;


ఓహో! Herkules! (Link)


;

11, అక్టోబర్ 2011, మంగళవారం

“మైత్రేయ”-గమ్మత్తు గణితము


జంతర్ మంతర్, జైపూర్

;
గణిత శాస్రమును- మన భారత దేశములో
అతి ప్రాచీన కాలము లోనే హిమగిరి మహా శృంగములను మించినది.
లీలావతీ గణిత శాస్త్రము- వంటి గణిత సిద్ధాంత గ్రంథములలోని
అనేక గణిత, ఖగోళ అంశములు, అత్యున్నత విజ్ఞానములు
మహా ఆవిష్కరణలకు నిదర్శనములు.
“సున్న” అనగా “శూన్యము”.
భావగణితములో అమోఘ విప్లవమునకు హేతువు ఐనట్టి
“శూన్యము” హిందూదేశములో కనుగొనబడినది.
ఈ “0″ – విదేశముల ప్రజలు అందిపుచ్చుకున్నారు.
మిలియన్. బిలియన్, ట్రిలియన్ వఱకు మాత్రమే
పాశ్చాత్య దేశములు- ఏర్పరచుకున గలిగిన అంకెలు.
ఆ పైన సంఖ్యలకు సంకేతములు లేవు,
వారు ఆ పైన ఎక్కువ విలువ గల నెంబర్లను చెప్పాలని ఉంటే
ఇవే అంకెలను - మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తున్నారు.
;






కానీ మన భారత దేశములో వేదకాలమున,
క్రీస్తుపూర్వము వేలాది సంవత్సరములకు పూర్వమే -
36 స్థానములు కలిగినట్టి   Noumber  దాకా -
సంకేతపూర్వకముగా నిర్మించగలిగారు.
ముప్ఫై ఆఱు స్థానముల సంఖ్యా నిశ్శ్రేణి
“మైత్రేయ సంహిత”లో ఈ దిగువ నుడివిన నామావళి- తో ఉన్నవి.


ఏకం ; 1
దశ :
శతం :
సహస్ర :
దశ సహస్ర :
లక్ష
దశ లక్ష :
కోటి :
దశ కోటి :
 శత కోటి :
అర్బుదం :
న్యర్బుదం :
ఖర్వం :
మహా ఖర్వం :
పద్మం :
మహా పద్మం :
శ్రోణి :
మహా శ్రోణి :
శంఖం :
మహా శంఖం :
క్షితి :
క్షోభం :
మహా క్షోభం :
నిధి :
మహా నిధి :
పరార్ధం :
అనంతం :
భూరి :
మహా భూరి :
మేరు :
మహా మేరు :
బహుసం :
బాహుసం :
సముద్రం :
సాగరం=  100,00,00,00,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-౦౦౦    


(sagaram _. 35 zeros – are  ఒకటి ( "1" )- అంకెతో కలిపి – 
                                                36 స్థానములు ఐనవి.)


;
Kapila: Samkhya Darshan ;
మైత్రేయుడు- చెప్పిన సంజ్ఞ లు ఈ పై రీతిగా వక్కాణము కలిగినవి.


ఆయా సంఖ్యలకు మన పురాతన గణితగ్రంథములలో వివిధ పేర్లు కనిపిస్తున్నవి.
బారసాల సందర్భంగా – అంకెలు అనేక namesను పొందినవి.
మరి ఇంత ఘన సంఖ్యలను గూర్చి రాయాలన్నచో- మాటలా?
కాస్త తికమక, కొంచెం అయోమయాలు జంప్ చేసేస్తూ,
దొర్లుకుంటూ మన ఆలోచనలలో దూరుతాయి కదా!


అందుకని, ఈ సంఖ్యా బలములను తులలో తూసేటందుకు-


ఇప్పుడు ఒక చిన్న చిట్కాను పాటిద్దాము. సరేనా???!!!!!……….........                                                                 
వీనిలోని అతి పెద్ద లెక్క _ “సాగరం”.
ఇక్కడినుండీ మీరు మొదలుపెట్టండి.
చివరన ఉన్న –ఒక్కొక్క “సున్న”-ను/ 
ఒక్కొక్కటీ తీస్తూ (అనగా "మైనస్" చేస్తూ) రండి.
అలాగ, కొసకు “ఏకం” అనే సంఖ్య- వద్దకు
మీ పెన్ను/ పెన్సిల్ / బ్రష్షు లేదా – కుంచె / తూలిక వచ్చేస్తాయి.


%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%


1) ఏకం:- 1
2) దశ :- 10
3) శతం :- 100
4) సహస్ర :- 1000  [three - 0 ]
5) దశ సహస్ర:- 10,000  [ Four - 0 ]
6) లక్ష:- 1-00-000 [ Five _- 0 ]
7) దశ లక్ష:-  10,00,000 [ six - o]
8) కోటి:-  1,00,-00,-000 [ seven - 0]
9) దశ కోటి:-   10,-00,-00,-000 [ Eight - o ]
10) శత కోటి :- 100,00,-00,-000 : [Nine Zeros]
11)అర్బుదం :- 10,00,00,00,00,0 [ Ten Zeros]
12) న్యర్బుదం:- 100,00,00,- 00,000 [ Eleven - 0 ]
13) ఖర్వం :- 10,00,00,00,00,000 [ Twelve - 0 ]
14) మహా ఖర్వం :- 10,00,00,00,00,00,00 [ Thirteen - 0 ]
15) పద్మం :- 1000,00,00,00,00,000 [ Fourteen - 0]
16) మహా పద్మం :- 1,00,00,00,00,00,00,000 [ Fifteen 0 ]
17) శ్రోణి :- 100,00,00,00,-00 ,00,- 00,00 [ sixteen 0 ]
18) మహా శ్రోణి :- 10,00,00,00,-00,-00,-00,-00,-00 [ Seventeen 0 ]
19) శంఖం :- 100,00,00,00,-00,00,-00,-00,-00 [ Eighteen 0 ]
20) మహా శంఖం :- 100,00, 00,00,00,00,00,00,000 [ Nineteen Zeros]
21) క్షితి :- 100,00,00,00,00,00,-00,-00,-00,-00 [ Twenty ZEROs ]   
22) క్షోభం :- 100,00,00,00,00,00,00,00,00,000 [ Twenty one - 0 ]
23) మహా క్షోభం :- 10,00,00,00,00,00,00,00,00,- 00,000 [ Twenty Two  - 0]
24) నిధి :- 100,00,00,00,00,00,00,00,00,00,000; [ Twenty three - 0  ]
25) మహా నిధి :- 10,00,00,00,00,00,00,00,00,00,- 00,00 0 ; [ Twenty four ]
26) పరార్ధం :- 100,00,00,00,00,00,00,00,00,00,- 0 00,00 ; [ Twenty Five - 0]
27) అనంతం :- 100,00,00,00,00,00,00,00,- 00,00,00,-00,00: [ Twenty Six - 0]
28) భూరి :- 10,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-00 ; [ Twenty Seven Zeros ]
29) మహా భూరి :- 100,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-00 ; [ Twenty Eight - 0  ]
30) మేరు :- 10,00,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-00 : [Twety Nine Zeros ]
31) మహా మేరు :- 100,00,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-00  ;  [ Thity - Zeros]
32) బహుసం :- 10,00,00,00,00,00,00,00,00,00,00,-00,00,00,-00,-00 ;                        
  [ Thirty one - 0 ]
33) బాహుసం :- 100,00,00,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-00 : 
                                                                                              [ Thirty Two - o ]
34) సముద్రం :- 10,00,00,00,00,00,00,00,00,00,00,00,-00,-00,-00 ,౦ ౦,౦౦ ::
                         [ Thirty three - 0]


35) సాగరం :- 100,00,00,00,00 - 00,00,00,00,00,00,00,-00,-00,-00,౦౦,౦౦                  


: [ Thirty Four - 0 ] 


Easy method to write :
సాగరం = 100,00,00,00,00,
              00,00,00,00,00
              00,00,-00,-00,-00
                             ౦౦,౦౦ :  
[ Thirty Four Zeros &  Thirty Five "STHANAMs" ]

పైన రాసిన నెంబరులలో - ఆఖరునున్న  "సున్న" ను 
ఒక్కొక్క దాన్ని తీసి వేస్తూ రాస్తే,
పైని- మొదటి :- 

"1) ఏకం :- 1
  2) దశ :- 10
  3) శతం :- 100 "


మైత్రేయుడు వివరణలో మనకు అందిన 
ఈ అంకెల గమ్మత్తులోని మహత్తు చాలా గొప్పది కదూ!


+++++++++++++++++++++++++++++++++++


పావులూరి మల్లన్న రచన “గణిత శాస్త్రము”
 (11 వ శతాబ్దము)::::
 బ్రహ్మగుప్తుడు:::
నృపతుంగ చక్రవర్తి కాలంలోని 
జైన మతాచార్యుడు మహావీరాచార్యుడు: పింగళుడు,
భాస్కరాచార్యుడు మున్నగు మహనీయుల కృషి ఫలితంగా -
గణితము ఒక శాస్త్రముగా గణుతి కెక్కినది.
అందరికీ  కృతజ్ఞతా పుష్పార్చనలు!


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$




“మైత్రేయ సంహిత” (Link - my essay in Web pathrika )


“మైత్రేయ సంహిత”- గణిత శాస్త్రము
On Friday, September 30, 2011 By ADMIN. 
Under: new, విజ్ఞానం, వ్యాసాలు.   


రచన:   కాదంబరి  (కుసుమ)

9, అక్టోబర్ 2011, ఆదివారం

స్టీవ్ జాబ్స్ కి చిత్రాంజలి


టెక్నికల్ ప్రపంచంలో 
అనేక మైలు రాళ్ళను 
నెలకొల్పిన దిగ్గజం  - స్టీవ్ జాబ్స్.  
Steve Jobs (ఫిబ్రవరి 24- 1955 -  అక్టోబర్ 5, 2011 )


19 సంవత్సరాల ప్రాయం గల ఆర్టిస్టు- 
హాంగ్ కాంగ్ నివాసి- జొనాథన్ లాంగ్ మాక్ 
(Jonathan Mak Long, HongKong)
కరోద్భవ సిల్ హౌట్ ఇది.
ఆ హస్త వాసిలో 
 వెలిసిన వెలుగు నీడల చిత్రము/ 
సిల్ హౌట్ 
(silhouette) ఇది.

"Thanks Steve!" అని 
అందించిన చిత్ర లేఖన నివాళి.
;
;

8, అక్టోబర్ 2011, శనివారం

Pegasus గుఱ్ఱము కాదు


పెగాసస్- అనేది రెక్కల గుర్రం పేరు.
Pegasus గ్రీకు ఇతిహాస కథలలోనిది.
ఈ ఫొటోను చూసారా?
ఈ బొమ్మలోని రెక్కల గుఱ్ఱము
సాక్షాత్తూ మన దేశంలోనిదే!!!!! 
రాజస్థాన్ లోని నేషనల్ పార్కులో 
తీసిన ఛాయా చిత్రం.
(Keoladeo National Park, in Rajasthan, India,
జగదీప్ రాజ్ పుట్ చేతిలోని కెమేరాకు 
చిటికెలో చిక్కిన దృశ్యము ఇది.
ఈ లిప్త పాటు స్నాప్ - ఏమిటో, 
కాస్త పరీక్షగా గమనిస్తే సుబోధకము ఔతుంది.
 జంతువు వెనకాతలగా ఒక పక్షి ఉన్నది.
ఒక కొంగ తరుముతూంటే- 
ఆ చతుష్పాద జంతువు పరిగెడుతూన్నది.
ఏది ఏమైనా, ఏది చాలా సాధు జంతువే కదండీ?  
ఈ amusing picture బాగున్నది కదూ!!!!!!
ఇక, ఆ సీమ గురించి కొన్ని సంగతులూ, సమాచారములూ :-
రాజస్థాన్ లోని నేషనల్ ఘన పార్క్ 
(భరత పూర్ ఉద్యానవనము - మునుపటి నామము)

అనేక సైబీరియన్ కొంగలతోనూ, గణితంగా- 
ఉత్తర ప్రాంతముల నుండి వలస వస్తూన్న 
పక్షులతోటి కళళలాడుతూంటుంది 
భరత్ పూర్ విహంగ అభయారణ్యము.

   Jagdeep Rajput (Link)




Tags:-
the bull was chased by a crane,
photographer Jagdeep Rajput; Pegasus  
केवलादेव राष्ट्रीय उद्यान


4, అక్టోబర్ 2011, మంగళవారం

చిన్న మాజిక్


ఒక చిన్న మాజిక్.
హస్త బంధన విముక్తి- అని పిలుద్దామా?
సరే! 
VEDIo (Link - see)
ఈ వీడియోలో ఆ గారడీని వీక్షించండి.
మీ చేతులు రెండిటినీ గట్టి తాడుతో కట్టేస్తే, 
మీరు ఎలాగ విడిపించుకోగలుగుతారు? 
ఈ Vedio చూసి, నేర్చుకుని, 
మీ మిత్ర బృందము ఎదుట ప్రదర్శిస్తారా?


;:::::::: 
hands magic :-

How to escape from ropes?



ఇలాటి essay లను
 చదవనీ/ చూడని వాళ్ళ ఎదుట మాత్రమే 
మీ ఇంద్రజాలాన్ని చూపించండి. 
సరేనా???
Handy magic (Link)

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...