15, సెప్టెంబర్ 2011, గురువారం

అమితాబ్ పొడుగు హాస్యం


          Pyar ki kahani,Amitabh Bachchan

అతడేమో సన్నగా, రివటలా ఉన్నాడు, 
ఇతడేమో "మహా పొట్టి. "గడకర్రలాగా- ఇంత పొడుగు, 
ఇతనేమిటీ..... సినిమాలలో హీరోనా?" అని 
అప్పట్లో హిందీ సినీ విశ్లేషకులు లుప్చలు కొడుతూ అనుకున్నారు. 
అతనే అమితాబ్ బచన్ 
(Amitabh Harivansh Bachchan- Born on 11 October 1942).
RajBabu, Telugu comedian 






1967 లో "ప్యార్ కీ కహానీ" (తనూజ హీరోయిన్) సినిమాను 
shooting మొదలెట్టి సినిమాను తీస్తున్నారు. 
దీనికి మాతృక తమిళంలో సంవత్సరము పాటు థియేటర్ లలో ఆడి, 
ఎన్నో రికార్డులను నిలిపిన "పాశమలర్". 
తెలుగులో "మరపు రాని కథ"- సావిత్రి నటించిన పాత్రను వాణిశ్రీకి ఇచ్చారు. 
ఈ తెలుగు మూవీతో వాణిశ్రీ దశ తిరిగింది. 
అప్పటిదాకా కమెడియన్, చిన్నా చితకా పాత్రలతో 
కొట్టుమిట్టాడుతూన్నది వాణిశ్రీ.
వాణి లోని ఆమె అద్భుత నటనకు 
ప్రేక్షక లోకం నుండి అగణిత ప్రశంసలు 
ఆమెకు కొంగు బంగారం గా లభించినవి .    
వాణిశ్రీ అకస్మాత్తుగా 'తిరుగులేని కథానాయిక గా' 
తారాపథంలోకి దూసుకుపోయింది. 
"ప్యార్ కీ కహానీ" లొ తనూజ హీరోయిన్. 
ఈ హిందీ సినిమాలో ఇంకో తమాషా విశేషము కూడా ఉన్నది. 
అదేమిటంటే- రాజబాబు- ఒక బుల్లి వేషం వేసాడు.   

                          
మళ్ళీ అమితాబ్ బచన్- వద్దకు వద్దాం! 


తెలుగులో క్రిష్ణ నటించిన హీరో పాత్రకు ఇతను సెలెక్ట్ ఐనాడు. 
ఆ వామన రూపుని నామం "గణేశ్". 
అమితాబ్ బచన్ కి గణేశ్ మేకప్ అసిస్టెంట్. 
అమితాబ్ బచన్ మోకాళ్ళ దాకా కూడా కాదు, 
కిందకే ఉన్నాడు గణేశ్.


ఈ మరుగుజ్జు మేకప్ మ్యాన్, 
నేటి మన అగ్ర కథానాయకుడు -
అమితాబ్ బచన్ కి టచప్ ఇవ్వాల్సి వచ్చేది కదా మరి!


గణేశ్, ఈ  హీరో వదవారవిందానికి టచప్ ఇవ్వడానికని వచ్చేవాడు.
 ప్రతిసారీ అమితాబ్ బచన్ అతణ్ణి రెండు చేతులతో 
తన ముఖం వద్దకు వచ్చేలా ఎత్తుకునే వాడు. 
గణేశ్ టచప్ క్లాత్ తో సుతారంగా 
అమితాబ్ బచన్ మోముపై ఒత్తేవాడు. 
ఆ దృశ్యం అందరినీ పక పకల నవ్వులలో ఓలలాడించేది.


ఒక మారు, ఒక్కో సారి వామన గణేశ్ ని క్రేన్ పైన కూర్చుండబెట్టి, 
ఆ క్రేన్ తన face దగ్గరికి వచ్చేలాగా తోయించి, 
అమితాబ్ బచన్ టచప్ చేయించుకుని, 
అచ్చటి సిబ్బందిని నవ్వించే వాడు. 
"ఆతడి దగ్గరి గుడ్డను తీసుకుని, 
మీరే అద్దంలో చూసుకుంటూ మొహాన్ని అద్దుకోవచ్చును కదా!?" 
ఆ సలహాకు అమితాబ్ బచన్ ప్రత్యుత్తరం ఇది- 
"అది మామూలే! కానీ ఇందులోని తమాషా, ఆనందం, 
నవ్వుల్ నవ్వులూ పువ్వుల నవ్వులూ ఎక్కడ్నించి వస్తాయి?"


ఈ సమాధానం హాస్య స్ఫూర్తికి దోహదం చేసే 
అమితాబ్ బచన్ వ్యక్తిత్వానికి నిదర్శనం. 
అన్నట్టు ఆ జవాబును అమితాబ్ బచన్ 
తెలుగులో చెప్పేరు అనుకునేరు....
हिन्दी (హిందీ)లోనే చెప్పాడు లెండి!


అమితాబ్ పొడుగు హాస్యం : (Link 1)


Pyar ki Kahani, 1971 (1971)


Member Categories - మాయాబజార్
Written by kusuma ; Thursday, 08 September 2011 07:27 

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...