The Moolavar Uppiliyappan (Srinivaasan) |
ఈ క్షేత్రానికి మరో పేరు తిరువిన్ నగర్ (Thiruvinnagar).
తమిళనాట, తంజావూరు మండలములో ఉన్న
తిరునాగేశ్వరం గ్రామ సీమ దరి లో ఉన్నది
ఒప్పిలి అప్పన్ సన్నిధి -
విష్ణు మూర్తి అవతార మూర్తి.
108 దివ్య దేశముల పట్టికలో ఈ పుణ్యక్షేత్రము కూడా ప్రసిద్ధి కెక్కినది.
ఉప్పులేని చప్పిడి తిండి తినే దైవము ఉన్న ఊరు - తిరువన్ నగరము.
ఈ దివ్య దేశ క్షేత్ర మూర్తి కే "ఉప్పిలి అప్పన్"
అని పేరు ఉన్నది.
కుంభకోణం నుండి 7 కిలోమీటర్లు దూరంలో ఉన్నది.
"తిరునాగేశ్వరము" అనే శైవ పుణ్యక్షేత్రము చేరువలోనే
ఈ గుడి నెలకొని ఉన్నది.
ఒప్పిలి అప్పన్ ఈ కోవెలలో
శ్రీ వేంకటాచలపతి వలె, నిలబడి ఉండి,
సౌందర్య రాశిగా భక్తులకు దర్శనము నొసగుతున్నాడు.
తిరువిన్ నగర్ స్థల మహాత్మ్యము-
ఇందులో రెండు కథలకు అనుబంధం ఉన్నది.
1. తులసీ గాథ; 2. శ్రీ లక్ష్మీదేవి కుమార్తె;
తులసీ కథ:-
తులసీ దేవి "స్వామీ! లక్ష్మీ దేవిని నీ ఉరమున అలంకరించుకున్నావు.
నన్ను కూడా అదే రీతిని కరుణించుము" అని అడిగినది.
"లక్ష్మీ దేవి నాకోసము వేల ఏళ్ళ నుండి తపస్సు చేస్తూన్నది.
ఆమె భూలోకములో అవతరించినపుడు,
నేను ఆమెను పరిణయం చేసుకోవాల్సి ఉన్నది.
ఆమె మరుసటి జన్మలో నీ ఒడిలో(నీడలో) ఉద్భవిస్తుంది.
అందువలన నీవు ప్రజలచే సదా సర్వదా పూజింపబడుతావు.
కనుక ఓ తులసీ! నీవు ముందుగా భూలోకములో మొక్కగా ప్రభవిల్లుము"
స్వామి ఆదేశముతో, ఆమె ఉర్విపై తరువు ఐనది.
పవిత్రమైన మొక్కగా ప్రజలచే పూజలను అందుకో సాగినది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఋషి పుత్రికగా శ్రీ లక్ష్మీ దేవి:-
మృకండుడుఅనే ముని తనయుడు మార్కండేయుడు,
మార్కండేయుడు శ్రీమన్నారాయణ మూర్తి కొరకు
నిశ్చల తపస్సు చేసాడు
శ్రీమహావిష్ణువును ప్రత్యక్షమైనాడు.
ముని "స్వామీ! లక్ష్మీ దేవి నాకు కుమార్తెగా పుట్టాలి.
నీవు నాకు అల్లుడివి అవాలి" అని కోరాడు.
భక్తుని కోరికను ఆమోదించాడు భగవంతుడు.
మార్కండేయ మహర్షి యొక్క కుమార్తెగా లక్ష్మీ/ భూదేవి జన్మించినది.
తులసి మొక్క నీడలో పసిబిడ్డ ఐన లక్ష్మీదేవి దొరికినది.
మార్కండేయుడు ఆమెను ప్రేమతో పెంచసాగాడు.
ఆమెకు యుక్తవయసు వచ్చినది.
నారాయణుడు ఒక వృద్ధుని వేషంలో వచ్చి
"నీ కూతురును నాకు ఇచ్చి,
పెళ్ళి చేయుము, మహా మునీ!"అని అడిగాడు.
కానీ ఋషి అందుకు అభ్యంతరం చెబ్తూ
"నా కుమార్తె ఇంకా చిన్నది.
ఆమెకు సరిగా ఉప్పు వేసి,
వంటలను రుచిగా చేయడం సైతం చేతకాదు.
కాబట్టి మీరు ఏమీ అనుకోవద్దు."
అందుకు స్వామి అన్నాడు
"అలాగైతే- ఆమె అలా లవణం లేకుండ వండితే,
నేను అదే తింటాను" అన్నాడు.
శంఖ చక్రములను ధరించి,
తన నిజ రూపంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు.
స్వామికి సంతోషముతో కన్యాదానం చేసాడు.
మార్కండేయుడు శ్రీమన్నారాయణుని తనకు అల్లునిగా పొందాడు.
మహర్షికి అలాగ వరము సిద్ధించినది.
శేషశయనుడు "ఉప్పు లేని వంటకములనే సంతోషంగా నేను భుజిస్తాను" అని మునుపు నుడివాడు కదా!
కనుకనే ఆ స్వామీ లవణము లేని ప్రసాదమునే స్వీకరిస్తున్నాడు.
ఈ కోవెలలో ప్రతి ఆహారపదార్ధమునూ ఉప్పు లేకుండా తయారుచేస్తారు.
అలాగ వండిన " లవణ రహిత భోజన, ఆహారములను"
క్షీరసాగరవాసునికి - నైవేద్య సమర్పణ చేస్తున్నారు.
అదే పద్ధతిని భక్తులు సైతము అనుసరిస్తారు.
ఐ దేవళము ఆవరణలో భక్తులు కూడా
ఉప్పు లేకుండా తయారు చేసుకున్న
ఆహారమును భుజిస్తారు.
@@@@@@@@@@@@@@@@@@@@@
salt లేని ప్రసాదము (Link)
;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి