9, సెప్టెంబర్ 2011, శుక్రవారం

గొల్లపూడి మారుతీరావు - నర్సరావ్ పేట సింహాసనం


gollapudi మారుతీరావు















                గొల్లపూడి మారుతీరావు విజయవాడలో ఉద్యోగపర్వం ఆరంభించారు. 
ఆ మహా నగరంలో “నవోదయ ప్రకాశరావు” చేదోడుగా  నిలిచారు. 
గొల్లపూడి మారుతీరావుకు అక్కడ చేదు అనుభవం ఎదురైనది. 
ఆ జనారణ్యంలో జేబులో డబ్బును ఎవరో కాజేశాడు. 
ఆపద్ధర్మ ప్రభువు నవోదయ ప్రకాశరావు గారి అండ దొరికింది.  
గవర్నరుపేటలో, ఓ టైర్ల కంపెనీ వెనుక ఒక  చిన్న గదిని కుదిర్చారు.  
ఆ గదిలో గొల్లపూడి మారుతీరావు చేరారు.
ప్రకాశరావు ఈ సాహితీ మిత్రునికి మడతకుర్చీని కొన్నారు. 
చాలా రచనలను గొల్లపూడి మారుతీరావు  
ఆ మడతకుర్చీలో బైఠాయించి చేసారు. 
"ఈ కుర్చీ ఎప్పుడు దూరమైందో తెలీదు. 
నాకు పెళ్ళయి, పిల్లలు పుట్టి, వాళ్ళు పెద్దవాళ్ళయే వరకు, 
అది నా దగ్గర వాడుకలో ఉండేది. 
నాతో ఊళ్ళన్నీ తిరిగింది, 
చాలా రచనలు అందులో కూర్చు రాశాను. 
సంవత్సరాల తరబడి, దాని సుఖాన్ని నేను మరిగాను - 
నా సాహితీ వ్యాసంగాన్ని కుర్చీ మరిగింది" అంటూ చెప్పారు.


గొల్లపూడి మారుతీరావు తన “అమ్మ కడుపు చల్లగా”లో ఇలాగ చెప్పారు
"వయసు మళ్ళాక –నరసారావుపేట కుర్చీ- కొనుక్కుని,
రెండు కాళ్ళూ – కుర్చీ చేతుల మీద జాపుకు కూర్చోవాలని సరదా. 
కానీ కుర్చీ రాలేదు. కొన్ని చిన్న కోరికలే – ఏవో కారణాలకి మూల పడతాయి."


ఇదీ గొల్లపూడి మారుతీరావు గారి - నర్సరావ్ పేట సింహాసనం గురించిన తీరని కల.


ది చదివాక, ఇదివరకు నేను - కార్డు సైజు కథ ఒకటి గుర్తుకు వచ్చింది.
ఈ "జంబునాథం నర్సాపూర్ కుర్చీ" కథ - 
ఈనాడు వారి ప్రముఖ పత్రిక- "చతుర" లో అచ్చు ఐనది
ఈ కథను ఆవకాయ.కామ్ లో పునఃప్రచురించడం జరిగింది
దృక్కోణాలలో కొంచెం భేదం ఉండడంచేత. 
కథ లింకును ఇక్కడ ఇస్తున్నాను...
                         నర్సాపూరు కుర్చీ 

మందాకినీ మారుతీ ravu gollpudi  గురువారం 25 ఆగస్టు 2011(Link 1)


 P.B.శ్రీనివాస్(singer), మారుతీ రావు (Link 2)

నర్సరావ్ పేట chair (Link 3) 

@@@@@@@@@@@@@@@@@@@@@@@


గొల్లపూడి మారుతీరావు - నర్సరావ్ పేట సింహాసనం
Member Categories - తెలుసా!
Written by kadambari piduri ; Wednesday, 17 August 2011 05:28 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...