22, సెప్టెంబర్ 2011, గురువారం

గులాబీల పండుగ- Roses Day




“ఓ ఫూలన్ దేవీ! ఈ అటవీ ప్రాంతాన్ని చిమ్మి బాగుచేయి” 
అని వనదేవత ఆదేశించింది.
ఫూలన్ దేవత అడవిని శుభ్రం చేస్తూన్నది. 
అక్కడ ఉన్న గురుకులములలోని బాలురు, విద్యార్ధులు 
అక్కడికి సమిధలను ఏరుకోవడానికి వచ్చారు. 
గురుకుల బాల, జనులు ఫూలన్ దేవత 
జటిలంగా ఉన్న కారడవిని పరిశుభ్రపరుస్తూ 
శ్రమ పడుతూండగా చూసారు. వారు కూడా సాయం చేసారు. 
చేయి చేయి కలిపితే ఎంతటి పనులైనా ఇట్టే సాధించవచ్చును కదా!
అరణ్యమును శుభ్రం చేసి, 
విద్యార్ధులు తమ తమ ఆశ్రమములకు వెళ్ళారు.
ఫూలన్ దేవత చెట్లనూ, లతలనూ- పూల గుత్తులతో అలంకరించసాగింది. 
ఇంతలో అక్కడి గుబురు పొదలలో నుండి మూలుగులు వినిపించాయి. 
“ఏమిటా? అవరివీ?”అనుకుంటూ పూ దేవత తొంగి చూసింది. 
అక్కడ ఒక అమ్మాయి ఉన్నది. ఆమె పేరు జటాత్రి. 
“రాణీవ" అనే ముని తపస్సుకు భంగం కలిగించాను. 
అందువలన ఆ ఋషికి ఆగ్రహం కలిగినది. 
ఆ తాపసి శాపం వలన, నా ఱెక్కలు విరిగిపోయినవి” 
అంటూ జటాత్రి రోదించింది.


పూల దేవత ఐన ఫూలన్ దేవతకు- జటాత్రి పట్ల సానుభూతి  కలిగి, 
తన మిత్రులు మనోతి, దక్షిణి,  ప్రభాస్ లను పిలిచి 
"జటాత్రికి ఈ గాయాలు మానే విధం చూసి, వైద్యం చేయండి" అని అప్పజెప్పినది. 


ప్రేమ దేవత ఐన మనోతి కొన్ని మంత్రములు పఠించింది. 
మంత్ర మహిమలతో కూడిన వన మూలికల లేపనమును 
జటాతి దేహమునకు పూసింది.
జటాతికి తన శక్తితో- సౌందర్య రూపాన్ని, ఆరోగ్యాన్నీ ప్రసాదించినది.


తర్వాత ఆమెను దక్షిణి వద్దకు తీసుకుని వెళ్ళినది మనోతి. 
ద్రాక్షా వనములపై సాధికారకత ఉన్న దక్షిణి 
తన మహిమలతో ఘుమ ఘుమల పరిమళములను ఒసగినది.


అటు పిమ్మట జటాతితో, ప్రభాస్ వద్దకు వెళ్ళినది. 
సూర్యదేవుని అంశ గల ప్రభాస్ తన కాంతిని జటాతిపై ప్రసరింపజేసాడు. 
కిరణములు సోకగానే జటాత్రి, సౌందర్య రాసిగా మారిపోయింది.


ప్రజలు ఆమె అందమును ప్రశంసలు కురిపిస్తూ గులాబీ- అని పిలువసాగారు. 
ఆ పిలుపులే- ఆమె నామధేయంగా అమరి, పూవులకు మహారాణి ఐనది గులాబీ.


*******
అదండీ "గులాబీ" జన్మ రహస్యం.


సెప్టెంబరు 22 ని పాశ్చాత్యులు - ROSES DAY పండుగ జరుపుకుంటారు. 
గిరిప్రాంతాలలో- అక్టోబరు, జూన్ ల నడుమ మొదలిడతారు. 
అలాగే మైదాన ప్రాంతాలలో సెప్టెంబర్ - ఫిబ్రవరిల మధ్య, 
గులాబీ మొక్కలు నాటడము, 
కొమ్మలను అంటు కట్టడానికి పూనుకుంటారు.


కొన్ని సంకేతములు కూడా ఈ పూలతో ఏర్పడినవి.


1) 12 పూవుల గులాబీ గుచ్ఛము :- కృతజ్ఞత తెలుపుట; 


2) 25 రొసెస్ కలిపి ఇచ్చే గులాబీ పూల గుత్తితో - శుభాకాంక్షలు అందిస్తారు.


3) అలాగే 50 పుష్పాల బొకే -  నిండు ప్రేమ, మమతలకు సంకేతము.




గులాబీల పర్వ దినమును వివరములు ఇన్నిన్ని ఉన్నవి. మరి ఇదండీ సంగతి!


*************************************\\\\\



గులాబీల పర్వ దినమును వివరములు ఇన్నిన్ని ఉన్నవి. మరి ఇదండీ సంగతి.!


నేడే ఈ నాడే, గులాబీల పర్వ దినం!
అందుకే ఈ కథ.
ఈ గ్రీకు దేశం పురాణాలలో - గులాబీ గురించిన కథ ఉన్నది.
మన వాళ్ళకు త్రరగా అర్థం ~~~ అవడానికని చెప్పి, నేను పేర్లను మార్చాను.
భారతీయ నామావళితో - ఈ కథను రాసాను.
బాల బాలికలకు బోధపడ్తుందని ఇలాగ రాసానన్నమాట.
పేర్లను రామాయణం, ఇతర ప్రతీకాత్మక పేర్లు పెట్టాను.


అసలు పేర్లు:-


@1.గ్రీకు పూల దేవత "క్లోరిస్" ;
ऽ. దేవదూత->
@3. ఆఫ్రొడైట్->
@4.వైన్ దేవత "డయానిసిస్" ->
@5.సూర్యదేవుడు "అపోలో"->
@6. పశ్చిమ మారుత దేవుడు వాయు దేవుడు;


ఇందులో , జటాతి- పేరును గుర్తు పట్టారా?
అదే - రామాయణంలో "జటాయువు", 
సీతమ్మ వారిని రావణుడు ఎత్తుకు వెళ్ళేటప్పుడు, పోరాడిన పక్షి.
దేవదూత- మూడు అంచెలలో:- 
దేహ బలము, సౌందర్యమునూ, 
సౌరభాలనూ, 
గులాబీ గా మారడమున్నూ ---
జరిగినవి.
ఇవాళ Date - September 22, 
పాశ్చాత్య దేశాలలో "గులాబీల పండగ" అనుకున్నారన్న మాట!
కాబట్టి ఇదిగో - ఈ కథ.


@@@@@@@@@@@@@@@@@


"గులాబీ" జన్మ రహస్యం
  
Member Categories - తెలుసా!
Written by kusuma ;  Monday, 19 September 2011 07:43 



{Chloris; Rose -Queen of Flowers -nymph;Aphrodite; Dionysus ; 
 Zephyr,the West Wind;Apollo ; }


Roses Day (Link 1)


రోజా పర్వము  (లింక్ 2)


కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...