6, సెప్టెంబర్ 2011, మంగళవారం

పచ్చదనాల కలనేత వంతెనలు


tree Roots తో వంతెనలు
చెన్నై నివాసి రేయన్  10 సంవత్సరాల క్రితం 
ఇంచు మించు గగన మేఘ రాశులను తాకుతూన్నట్లు అనిపిస్తూన్న 
మేఘాలయ సీమలలో కొన్ని వింత బ్రిడ్జి లను కనుగొన్నాడు. 
దక్షిణ భారతం నుండి బయలుదేరిన  
రేయాన్ - చిరపుంజీ వద్ద 
ఒక రిసార్టును కట్టాలని అనుకున్నాడు. 
ఆ ప్రయత్నంలో, స్థలాన్వేషణ  చేస్తూ, 
ఈ Fantastic bridges ను చూసాడు.
అనుకోకుండా  root bridges ఇంట్రెస్టుగా పరిశీలించిన రేయాన్ ద్వారా - 
ఆ హరిత వారధుల  వివరాలు  ప్రపంచానికి  వెల్లడి ఐనాయి.
రేయాన్ టు పిమ్మట ఒక ఖాసీ జాతి గిరిజన  వనితను పెళ్ళాడాడు కూడా! 
(Rayen, a former banker from Chennai 
who married a woman of Khasi descent)
ఇలాగ అతను అనుకోకుండా 
మన దేశంలోని ప్రాకృతిక వస్తు సముచ్చయాలతో 
సిద్ధమైన నిర్మాణ నైపుణ్యాలను లోకాలకు తెలిపి, 
ప్రపంచ వార్తలలో తన పేరు వెలుగులోకి వచ్చేలా జరగడం కూడా 
అతడి జీవితంలో అనుకోకుండా తటస్థపడిన సంచలనాద్భుతమే!
  
దూరంగా విసిరేసినట్లున్న లోయలు..... 
ఏకాంతంగా ఉన్న ఖాసీ వంటి కుగ్రామాలు, 
ఏరు, నదుల తీరాలలో ఉన్న - 
రబ్బరు ఇత్యాది చెట్ల వేళ్ళతో తయారు చేసుకున్న వంతెనలు అవి. 
తమ పూర్వీకులనుండి అనూచానంగా నేర్చిన విద్య! 
తరు మూలాలను ఒకదానికొకటి పెనవేస్తూ, 
ఆ గ్రామీణులు అల్లుతారు. 
వేళ్ళ(Tree ROOTS)తో 
అలాగ కొన్ని ఏళ్ళపాటు అల్లుతారు.
కొండ జాతి ప్రజలు, పచ్చదనాల కలనేత బ్రిడ్జీలని
ఇలాగ మెలికలు తిప్పిన వ్రేళ్ళతో సిద్ధం చేయడం 
ఒక్క రోజులో జరిగినది కాదు.
ఒక్కొక్క వంతెనకు రమారమి 25 ఏళ్ళు పడ్తుంది. 
ఆ తర్వాత అది నెమ్మదిగా ఉపయోగంలోకి వస్తుంది. 
ఇలాటి “పాదప మూల వారధులు”  
[coaxing the roots of the Ficus elastica tree]  
(otherwise known as the Indian rubber tree) 
దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత 
వినియోగానికి అనువుగా రెడీ ఔతాయి. 
50 మంది ఒకే పర్యాయం ఆ బ్రిడ్గీల పైన నిలబడ గలరూ అంటే, 
అవి ఎంత బలంగా ఉంటాయో ఊహించవచ్చు.
  
నాంగ్ క్రైట్ పల్లె ( Nongkriet village ) వద్ద 
జౌళి అల్లికల పచ్చని వంతెన ఉన్నది. 
ఒకే చెట్టు వేళ్ళను కొన్ని కొన్నిటిని ఈతాకు చాపలాగా అల్లుతూ చేసారు. 
జిగిబిగి జమిలి అల్లికలతో 
అనేక వ్రేళ్ళ సముదాయాలను అల్లిన ఆ ఆది వాసీల ప్రజ్ఞ 
చూపరులకు అచ్చెరువు కలిగిస్తుంది.
రెండు వరుసలుగానే కాక, 3 వరసలను కూర్చిన 
జమిళి వంతెనలు (a triple-decker bridge) కూడా 
ఆ ప్రాంతాలలో ఉన్నవి.
&&&&& 
 Why would the villagers build a bridge on two levels? wonderful!! 
డెనిస్ మున్నగువారు “ ఇలాటి కలనేత బ్రిడ్జీలు మరింత సోయగాలు -
ఆ నిర్మాణాలకు  వన్నెలను సమకూర్చినవి.”  
Denis  said "Because they fancied it! 
There's even a triple-decker bridge in the works."   
గౌహతి నుండి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నవి.
 Getting around
Travel the Unknown (0845 053 0352; 
traveltheunknown.com) operates a range of North East   

4 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

very interesting and wonderful

మాలా కుమార్ చెప్పారు...

కుసుమ కుమారి గారు ,
చాలా బాగుందండి . తెలీని కొత్త విషయం చెప్పారు . థాంక్ యు .

kadambari చెప్పారు...

కమనీయం గారూ!
కృతజ్ఞతలు!

((Travel the Unknown (0845 053 0352;
Green bridges))

Anil Piduri చెప్పారు...

మాలాకుమార్ గారూ!
ధన్యవాదములు!
((Travel the Unknown (0845 053 0352;
Green bridges))

kadambari
;

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...