Pyar ki kahani,Amitabh Bachchan
అతడేమో సన్నగా, రివటలా ఉన్నాడు,
ఇతడేమో "మహా పొట్టి. "గడకర్రలాగా- ఇంత పొడుగు,
ఇతనేమిటీ..... సినిమాలలో హీరోనా?" అని
అప్పట్లో హిందీ సినీ విశ్లేషకులు లుప్చలు కొడుతూ అనుకున్నారు.
అతనే అమితాబ్ బచన్
(Amitabh Harivansh Bachchan- Born on 11 October 1942).
RajBabu, Telugu comedian |
1967 లో "ప్యార్ కీ కహానీ" (తనూజ హీరోయిన్) సినిమాను
shooting మొదలెట్టి సినిమాను తీస్తున్నారు.
దీనికి మాతృక తమిళంలో సంవత్సరము పాటు థియేటర్ లలో ఆడి, ఎన్నో రికార్డులను నిలిపిన "పాశమలర్".
తెలుగులో "మరపు రాని కథ"- సావిత్రి నటించిన పాత్రను వాణిశ్రీకి ఇచ్చారు.
ఈ తెలుగు మూవీతో వాణిశ్రీ దశ తిరిగింది.
అప్పటిదాకా కమెడియన్, చిన్నా చితకా పాత్రలతో
కొట్టుమిట్టాడుతూన్నది వాణిశ్రీ.
వాణి లోని ఆమె అద్భుత నటనకు
ప్రేక్షక లోకం నుండి అగణిత ప్రశంసలు
ఆమెకు కొంగు బంగారం గా లభించినవి .
వాణిశ్రీ అకస్మాత్తుగా 'తిరుగులేని కథానాయిక గా' తారాపథంలోకి దూసుకుపోయింది.
"ప్యార్ కీ కహానీ" లొ తనూజ హీరోయిన్.
ఈ హిందీ సినిమాలో ఇంకో తమాషా విశేషము కూడా ఉన్నది.
అదేమిటంటే- రాజబాబు- ఒక బుల్లి వేషం వేసాడు.
మళ్ళీ అమితాబ్ బచన్- వద్దకు వద్దాం!
తెలుగులో క్రిష్ణ నటించిన హీరో పాత్రకు ఇతను సెలెక్ట్ ఐనాడు.
ఆ వామన రూపుని నామం "గణేశ్".
అమితాబ్ బచన్ కి గణేశ్ మేకప్ అసిస్టెంట్.
అమితాబ్ బచన్ మోకాళ్ళ దాకా కూడా కాదు,
కిందకే ఉన్నాడు గణేశ్.
ఈ మరుగుజ్జు మేకప్ మ్యాన్,
నేటి మన అగ్ర కథానాయకుడు -
అమితాబ్ బచన్ కి టచప్ ఇవ్వాల్సి వచ్చేది కదా మరి!
గణేశ్, ఈ హీరో వదవారవిందానికి టచప్ ఇవ్వడానికని వచ్చేవాడు.
ప్రతిసారీ అమితాబ్ బచన్ అతణ్ణి రెండు చేతులతో
తన ముఖం వద్దకు వచ్చేలా ఎత్తుకునే వాడు.
గణేశ్ టచప్ క్లాత్ తో సుతారంగా
అమితాబ్ బచన్ మోముపై ఒత్తేవాడు.
ఆ దృశ్యం అందరినీ పక పకల నవ్వులలో ఓలలాడించేది.
ఒక మారు, ఒక్కో సారి వామన గణేశ్ ని క్రేన్ పైన కూర్చుండబెట్టి,
ఆ క్రేన్ తన face దగ్గరికి వచ్చేలాగా తోయించి,
అమితాబ్ బచన్ టచప్ చేయించుకుని,
అచ్చటి సిబ్బందిని నవ్వించే వాడు. "ఆతడి దగ్గరి గుడ్డను తీసుకుని,
మీరే అద్దంలో చూసుకుంటూ మొహాన్ని అద్దుకోవచ్చును కదా!?"
ఆ సలహాకు అమితాబ్ బచన్ ప్రత్యుత్తరం ఇది-
"అది మామూలే! కానీ ఇందులోని తమాషా, ఆనందం,
నవ్వుల్ నవ్వులూ పువ్వుల నవ్వులూ ఎక్కడ్నించి వస్తాయి?"
ఈ సమాధానం హాస్య స్ఫూర్తికి దోహదం చేసే
అమితాబ్ బచన్ వ్యక్తిత్వానికి నిదర్శనం.
అన్నట్టు ఆ జవాబును అమితాబ్ బచన్
తెలుగులో చెప్పేరు అనుకునేరు....
हिन्दी (హిందీ)లోనే చెప్పాడు లెండి!
అమితాబ్ పొడుగు హాస్యం : (Link 1)
Pyar ki Kahani, 1971 (1971)
Member Categories - మాయాబజార్
Written by kusuma ; Thursday, 08 September 2011 07:27
1 కామెంట్:
Thank you, madam!
కామెంట్‌ను పోస్ట్ చేయండి