6, జూన్ 2011, సోమవారం

మీరేమంటారు?
















      జానపద గీతాలూ, నాట్యాలూ బాగుంటాయి,టెలి విజన్ లో అలాటి ప్రోగ్రాములు వస్తే, తప్పకుండా ఆసక్తిగా చూస్తూంటాను.జీ టి.వి. వారి "అద్భుతం: - లో ఇవాళ తప్పెట గుళ్ళు చూసాను. ఇదివరకు దూరదర్శన్ లో కూడా చూసే వాళ్ళం.ఆట్టే అర్ధం కాకున్నా చూసాను.2 వేల ఏళ్ళ క్రితం నాటి ఆ నృత్య సంప్రదాయాన్ని కాపాడి, ఇవాళ కూడా మనకు యథా తథ రూపంలో అందించిన ఆ నర్తకులకు కృతజ్ఞతాపూర్వక జోహార్లు.తీర్పరి - వర్గీయుడు - "కొంచెం మోడర్న్ చేస్తే బావుంటుందని సలహా ఇచ్చారు.అతని advice ప్రకారం కాస్త మసాలాను జత చేయనూ వచ్చు.కానీ, ప్రాచీన సంపదను- మనదీ ఇది.- అని గర్వంగా అందీయగలిగిన ప్రాచీన వారసత్వ సంపద,మన దేశంలో మాత్రమే పరిఢవిల్లిన ప్రక్రియ - కంఠో పఠం చేసే విద్య.ఇప్పటి విద్యా విధానం ఈ విధానానికి స్వస్తి పలకడానికి వెనుక- అనేకం ఉన్నై, ఆ విషయాల్ని పక్కన బెట్టేసి, జానపదము - వగైరా ప్రాచీన కళలను ఆధునీకరించ వచ్చునా? - దగ్గరికి వద్దాము.1) ఆధునీకరణ- వర్తమాన ప్రపంచంలో దూసుకు పోవడానికి అవసరమే!2) కానీ యథాతథ రూపాలను కూడా పరిరక్షించాలి.ఇది తప్పనిసరి అవసరము.ఇందుకోసం రెండు వర్గాలు, అవసరమైతే సంఘంలో రూపు దిద్దుకుని, తమకు తాముగా రూపొందాలి.నాకు - తప్పెటగుళ్ళు- వంటి ప్రదర్శనలు - ఆసాంతమూ అర్ధము కావు. ఐనా సరే, చూస్తాను."మన ప్రాచీన ఘన సంపద"కాబట్టి.చాలా మంది హిందీ సినిమాలను చూస్తూంటారు, ముక్కస్య ముక్క అర్ధమౌతూన్నదనేనా?మన పొరుగు ఒరియా, కన్నడ, అరవము, ఇతర భాషలు అర్ధమౌతూన్నాయా?కానీ, వేటి విలువ వాటిదే!తెలుగు జిల్లాలలోని స్తానిక యాసలు అన్నీ అందరికీ, పూర్తిగా అర్ధం అవాలని, అందరి మీదా ఒత్తిడి తేవాల్సిన అక్కర లేదు.ఆయా ప్రోగ్రాములలోనీ/ రచనలలోనీ ఆర్ద్రత, సౌమ్య భావ జాలాలూ ప్రేక్షకుల/ చదువరుల మనసులకు చేరితే చాలు కదా!కొందరు కళా కృషీవలురు కొందరి పుణము కట్టుకుని కాలానికి ఎదురీది, ఇప్పటికీ మన ఎదుట ఉంచగలుగుతూన్నారు కదా!అలాటి నిష్కామ కళారాధకులకు ధన్యవాదాలు . మీరేమంటారు?

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...