9, జూన్ 2011, గురువారం

శివ దీక్షా పరురాలనురా!



















నటరాజ రామక్రిష్ణ ప్రథమ గురువులు 
నాయుడు పేట రాజమ్మ, పెండ్యాల సత్యభామ.తన జీవితాన్ని శ్రీ కాళహస్తీశ్వరునికి అంకితం చేసిన పుణ్యవతి ఆ దేవ నర్తకి.@ “శివ దీక్షా పరురాలనురా......” అనే పాటను, రాజమ్మ అభినయించింది. ఒక కోనసీమ పండితుడు ఆమె విద్వత్తును ఆమూలాగ్రమూ శోధించ నిర్ణయించుకున్నాడు. ‘ప్రతి హస్తము-’నకూ ఆమెను ఆపే వాడు; 
“ఈ హస్తమునకు, ముద్రకూ శాస్త్ర ప్రమాణాలను వివరించు!” 
అని ప్రశ్నలతో నిలదీసేవాడు.రాజమ్మ ఆతని సందేహాలకు దీటైన జవాబుగా నిలబడగలిగినది. శాస్త్రాల నుంచి శ్లోకములను చదివి, అభినయం చేస్తూ వెంత వెంటనే చూపించినది.“రాజామణీ! నీ విద్య నా హృదయాన్ని కదిలించి, కరిగించినది, ఇవాళ నృత్య కళలో లీనమై, మైమర్చిపోయాను ” తన్మయుడైన ఆ పండితుడు రాజమ్మకు – తన శాలువాను కప్పి, వినయపూర్వకంగా మనసారా గౌరవించాడు.@ శ్రీ కాళహస్తి రాజమ్మ సకల కళా విశారద. ఆమె నిండు పౌర్ణిమ నాటి సంగీత సాగరము, నీటి చెలమ నుండి ఊరే నీటి ఊట వంటిది ఆమె విద్య.స్త్రీ రూప తాండవ నృత్య మహేశుడు ఆమె.ఆమె విద్యలను దీటుగా నేర్చుకోగల విద్యార్ధి అసంభవమే!ఆంధ్ర కళామ తల్లి పూర్వ పుణ్య భాగ్య వశాత్తూ, నటరాజ రామక్రిష్ణ రూపంలో అద్భుత శిష్యుడు ఆమెకు లభించాడు.రామక్రిష్ణ – తన గురువు రాజమ్మ ప్రజ్ఞా, పాండిత్యధురీణతలను చెప్పేవాడు.రాజమ్మ గారికి వచ్చినన్ని పదములు, వర్ణాలు, జావళీలు, సలాం జతులు, మరెవరికైనా తెలుసునంటే సందేహాస్పదమే!రాజమ్మ ఒక చిన్న పద్యాన్ని ఏడు రోజులు అభినయించ గలిగారు. ఏడు కచేరీలలో ఏడు విధాలుగా ఆస్థానములో ప్రదర్శించి చూపగలిగారు.“ఆలయ విద్య” ను అభ్యసించే వారికి, భరత విద్యతో పాటుగా, ఆగమ పద్ధతిని, వివిధ దేవతల ఆరాధించే క్రమాన్నీ,  
జతులను సైతం నేర్పించిన అసమాన విదుషీమణి.
ఆ విద్యలన్నిటినీ నేర్చి, 
పుక్కిట పట్టిన ఏకైక వ్యక్తి నటరాజ రామక్రిష్ణ మాత్రమే!“అష్ట దిగ్బంధన విద్య” లో ఆమెకు ఆమెయే సాటి.ऽ) “కేళిక” వంటి సమస్యా పూరణలనూ చిటికెలో నృత్యం ద్వారా పరిష్కరించగల నేర్పరి. అటు ఆలయ సంప్రదాయమూ, ఇటు కచ్చేరీ ఆటలనూ రెంటినీ చూపి, అందరిచేత “శభాష్!”అని తలలూచేలా చేయగలిగిన మేధావి.సంస్కృతాంధ్ర, సంగీత, భరత శాస్త్రాలను, పురాణేతిహాసాలను అధ్యయనం చేసిన కళా తపస్విని ఆమె.సభికుల హృదయాలనెరిగి, “కేళిక” చేసి, నేర్పుతో ఒప్పించగలైగేటంత  ప్రతిభాశాలి ఐన ఆమె గురుత్వం, నటరాజ రామక్రిష్ణ శిష్యరికము- ఈ రెండున్నూ బంగారానికి పరిమళము అబ్బినట్లు సమకూరినవి.ఆమె నటరాజ రామక్రిష్ణ వంటి శిష్యుడు నృత్యకళకు ప్రాణం పోసి, పవిత్ర కళగా సమాజంలో నిలబెట్ట గల మానిషి- అని గ్రహించింది.“నాయనా! నీ వయసుకు మించిన రసాభినయాన్ని ప్రదర్శించ గలిగావు. నీ విద్యలో ప్రౌఢత్వము వచ్చే వరకూ, నేను బతికి ఉంటే-నాయికాభినయాదులలో ఉన్న అనేక విశేషాలు చెబ్తాను.” అన్నది. అలాగే నటరాజ రామక్రిష్ణకు-ఆతని వయస్సుకి మించిన విద్యలను  రాజమ్మ  నేర్పించినది. కానీ..... ప్రౌఢత్వాన్ని అందుకోక ముందే నాయుడుపేట రాజమ్మ అనంతలోకాలకు, ఇందీవరనాభుని సన్నిధికి వెళ్ళిపోయింది.@ రాజమ్మ మున్నగు అప్పటి నర్తకీమణులు సంస్కృత, ఆంధ్ర కావ్యాలను పూర్తిగా అభినయించే వారు. శ్రీ కృష్ణామృతము, పుష్ప బాణ విలాసము, అమరుక కావ్యము, శృంగార మంజరి, గీత గోవిందము లోని అష్టపదులు, క్షేత్రయ్య పేరుతో సుప్రసిద్ధుడైనట్టి వరదయ్య యొక్క మువ్వ గోపాల పదములు, జావళీలు ఇత్యాదులన్ని వారి అభినయంలో శోభిల్లినవి. నటరాజ రామక్రిష్ణ  మసి పాతలో కట్టి పడేసిన మూల  పడేసి ఉన్న మూటలోని మణి రత్నాల వంటి వారినీ, వారి కళాప్రతిభలనూ గుర్తించ గలిగాడు.నటరాజ రామక్రిష్ణ నీలం సంజీవయ్య పదవీ సమయాన, "నృత్య నికేతన్" ను స్థాపించి, వందాలది నాట్యాభిమాన, కళాకారులకు పూల బాటను ఏర్పరిచాడు.ఆన్ని ప్రదేశాలలో తిరుగుతూ, ఎందరో నాట్య దేవతలను దర్శించి, వీలైనంత వరకూ ఆర్ధిక, హార్ధిక సాయాలను అందించాడు.“ఆలయ కళ”, “పేరిణీ నాట్యము” వంటి అనేక నర్తన సాంప్రదాయ వైశిష్టతలను కళాలోకమునకు  పరిచయం చేయ గలిగిన 
నాట్య తపస్వి నటరాజ రామక్రిష్ణ.

                                   నాట్య తపస్వి (Link for ESSAY)
             ,,,,,,,,,,,,

4 కామెంట్‌లు:

durgeswara చెప్పారు...

మహానుభావులు వారు
ఆ నతరాజమూర్తికి నమోవాకములు

durgeswara చెప్పారు...

మహానుభావులు వారు
ఆ నతరాజమూర్తికి నమోవాకములు

durgeswara చెప్పారు...

మహానుభావులు వారు
ఆ నతరాజమూర్తికి నమోవాకములు

durgeswara చెప్పారు...

మహానుభావులు వారు
ఆ నతరాజమూర్తికి నమోవాకములు

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...