6, జూన్ 2011, సోమవారం

ఆ బిరుదు తాపీ వారిదే!
























                               చిత్ర లిపి నుండి-నేటి సుందర లిపి దాకా తెనుగు వ్రాత శిల్పంలో చేరిన పరిణామాల గూర్చి తాపీ ధర్మారావు  పరిశోధనలు చేసారు. తత్సమాచార, విషయ, విశేషాలన్నిటినీ సేకరించి ఉంచారు. కానీ సమయ సందర్భాలు రాక, వానిని కూర్చి, ప్రచురణ రూపంలో కూర్చి, తేలేదు.సరస్వతీ స్తోత్రమును రచించారు తాపీ ధర్మా రావు .1926 లో ఊర్కాడు జమీందారు వద్ద తాపీ ధర్మారావు  పని చేసే వారు.దేవీ నవ రాత్రుల సందర్భంలో- అక్కడ తెలుగు వారు, అరవ వారు అనే భేదం ఎంచకుండా, కవి, పండితులకు అందరికీ సన్మాన గౌరవ పురస్కారాలను అందజేసే వాళ్ళు.ఆ ఉత్సవాల సందర్భంగా అనుకోకుండా తటస్థ పడిన ప్రశంసాపూరిత నామము తాపీ ధర్మారావు కు లభించినది.  జగద్గురు చంద్ర శేఖర భారతీ శంకరాచార్యుల వారు పట్టలేని ఆనందంతో తాపీని కౌగిలించుకుని "ఆంధ్ర విశారదా!" - అని  పిలిచారు.పట్టుశాలువాను కప్పారు.అంతేకాదు...."ఇతోధిక ఖ్యాతి నార్జించుము"అంటూ ఆశీర్వదించారు.  తర్వాత కొన్ని బిరుదులు తాపీ కి వచ్చాయి. కానీ ఆయన ఈ బిరుదును మాత్రమే అట్టిపెట్టుకున్నారు ఇష్ట పూర్వకంగా."ఒక వర్గానికి చెందిన మఠాధిపతుల కోటలో పాగా వేశాను కదా, అన్న దానికి గుర్తుగా -ఆంధ్ర విశారద-బిరుదునే ఉంచేసుకున్నాను."అని మిత్రులతో చెప్పుకునేవారు తాపీ.ఆ బిరుదు ;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...