8, జూన్ 2011, బుధవారం

నటరాజ్ ఆతని ఇంటి పేరు




















      1992 లో పద్మశ్రీ ఆదిగా గల అసంఖ్యాక బిరుదులు వరించినవి.
రామమోహనరావు, దమయంతి ఆతని తల్లి దండ్రులు.శిల్ప కళను అధ్యయనం చేస్తూన్న సోదరుడు శ్యామసుందర్ కుడిభుజంగానిలువగా, లక్ష్య సాధనకై  ఏ మాత్రమూ వెనుకంజ వేయకుండా ముందుకు సాగిన మహనీయుడు నటరాజ రామక్రిష్ణ.రామక్రిష్ణ నాగపూర్ లో ఉన్నప్పుడు స్వీయ కళాభిరుచులను ప్రదీప్తపరచుకున్నాడు.నటరాజ రామ క్రిష్ణ పాము డాన్సును- స్వీయ ప్రతిభా వ్యుత్పత్తులతో అభివృద్ధి చేసాడు.రామస్వామి,భీమారావు సోదరుల సాంగత్యము విలువైనది.భండారా సంస్థానము కళల కూడలిగా భాసిస్తూండేది. "కేరవ" అనే చిన్న తాళమునూ, భీమారావు వాయిస్తూంటే, నటరాజ రామ క్రిష్ణ గంగా నదిలా  గల గల ప్రవహించే ఆ వాద్యానికి అనుగుణంగా - సర్ప గతులను రూపొందించుకున్నాడు.అలాగ 50 రకాల ఫణి విన్యాస గతులను సృజించి, "నాగ నర్తనము" రూపొందించాడు.భండారా సంస్థానములో కథక్ నృత్య పద్ధతిలో నాగ నాట్యము ఉన్నది.దానికి విలక్షణంగా ఉన్నది నటరాజ రామక్రిష్ణ సృజన ఐన నాగ నర్తనము.భండారా సంస్థానమునకు గణపతి పాండ్యా పిలుపున నటరాజ రామక్రిష్ణ వెళ్ళాడు."ఈ ప్రదర్శన అందరి కోసం కాదు, మీ ఒక్కరి కోసమే!" అంటూ యువరాజా చెవిలో చెప్పాడు నటరాజ రామక్రిష్ణ."సరే!"అని అంగీకరించి, దర్బారులో కాక, అంతఃపురములో ఏర్పాటు చేసారు.భీమారావు అక్కడ "అల్గోజా వాద్యము"ను వాయిస్తూండగా, నటరాజ రామక్రిష్ణ తన మేనును ప్రతి అణువూ స్పందిస్తూండగా, "నాగ నర్తనము"- ను చేసాడు.రాజు "కేరవలో ఇంత మాధుర్యం ఉన్నదా?" అన్నాడు."ఆ శక్తి భీమారావు చేతి వేళ్ళలో  ఉంది మహారాజా!" అంటూ, తోటి కళాకారుని మెచ్చుకున్నాడు నటరాజ రామక్రిష్ణ. ఇది ఆతని గంభీర, నిష్పక్ష్పాత వైఖరికి ఈ సంఘటన నిదర్శనము."రేపు మా దర్బారులో ఈ నాగ నర్తనమును చేయండి" అన్నాడు.అందుకు నటరాజ రామక్రిష్ణ "అది మీ ఒక్కరికే ప్రత్యేకం మహారాజా! అది మీకు సమర్పించుకున్న పూజా ప్రసూనం. ఇతరుల కోసం కాదు" అని జవాబు ఇచ్చాడు.(కథక్ రీతిలోని నాగ నృత్యాన్ని చినబుచ్చకూడదని, అలాగ అని ఉండవచ్చును) భండారు రాజా - వందరూపాయల నోట్లు ఉన్న కవరును వారికి ఇచ్చాడు. భీమారావు, నటరాజ రామక్రిష్ణ లు అందుకున్న ఆ కవరులో 10 నూరు రూపాయిల నోట్లు ఉన్నవి.అప్పటి రోజులలోని అణాకు, పైసా ఈ నాడు 60 రెట్లు విలువ ఉన్నది.
 **********************************@@@@@@
రామక్రిష్ణ నాగపూర్ లో ఉన్నప్పుడు విద్యవ్యాసంగాలు విచిత్రమైన మలుపులతో, పురోభివృద్ధి గాంచినవి.భండారా సంస్థానము యువరాజు "రాజా గణపతి రావు పాండ్యా" ఆహ్వానముపై వెళ్ళాడు రామక్రిష్ణ. పాండ్యా కళాభిమాని. ఆయన కొలువులో- రాయగఢ్ కు చెందిన కళ్యాణ్ జీ , కార్తీక్ జీ మున్నగు హేమాహేమీలు ఉన్నారు.రామక్రిష్ణ స్నేహితుడు రా భావ్ సర్ దేశ్ పాండే ప్రోత్సాహము రామక్రిష్ణ జీవితములో ఒక మైలు రాయి.రామక్రిష్ణ కోరికపై కళ్యాణ్ జీ తబలా వాయించాడు.  రామ్ భావ్-"పార్సో మోరె నయన్ మే నందలాల్...... " గీతాలాపన చేసాడు. రామక్రిష్ణ ఆ పాటకు- తనను తాను  మైమరిచిపోతూ, ప్రేక్షకులు మైమరిచేలా అత్యద్భుత నాట్యాన్ని చేసాడు.అక్కడ ప్రేక్షకులందరూ, ఉప్పొంగిపోతూ, ఉవ్వెత్తున లేచి, కరతాళ ధ్వనులు మిన్నుముడ్తూండగా "నటరాజ్"అంటూ ఎలుగెత్తి పలికారు.అంతే! భండారా ఆస్థానములో ఆతను అడుగు పెట్టిన వేళా విశేషమది.ఆనాటి నుండీ అతని ఇంటి పేరు "నట రాజ" గా సుస్థిరమైనది. (పేజీ 33) 
నటరాజ రామక్రిష్ణ తన “నర్తన మురళి”  poem లో సాంద్ర మనో కేదారాలను పరిచాడు.
 “విశ్వవ్యాప్తమైనట్టి నీ విశ్వ రూపము                  ఆ చిన్ని నీటి బిందువులో    చూడ గలిగిన నా జీవితమే ధన్యము, ఓ క్రిష్ణ కిశోరా!”         అని భక్రితో  అనుకున్నారు.
ఆంద్ర నాట్యము, పేరిణీ నాట్యము, నవ జనార్దన పారిజాతము"మన ఆంధ్రుల ప్రాచీన లలిత కళా సంపద." అని గర్వంగా చెప్పగలుగుతున్నామంటే ఆ మహానుభావుని చేతి చలువే కదా! పునర్జన్మనంది, మరల తెలుగు నాట జన్మించి, తెలుగు కళా జగత్తుకు మరిన్ని వెలుగులను ప్రసాదించాలి ఆయన.అందుకే - నటరాజ రామక్రిష్ణ అభిలాష ఖచ్చితంగా నెరవేరాలి!“త్రిభువనాలను నర్తనమాడించు నీవు;            నాట్యమాడుచుండగా;                తాళధారినై;        నేను;           నిన్ను ఆడించే హక్కు;                     నాకివ్వు, స్వామీ”             అంటూ నంద కిశోరుని _ విలువైన చిన్న కోరిక కోరారు నటరాజ రామక్రిష్ణ.           “కృష్ణా! నీవు మరల నన్ను-              ఈ ప్రపంచానికి పంపాలనుకుంటే-                  జ్ఞాపకము ఉంచుకో స్వామీ!,                      నర్తకునిగా మాత్రమే పుడతాను”                   అని రాసుకున్నారు.ఆంద్ర నాట్యము, పేరిణీ నాట్యము, నవ జనార్దన పారిజాతము"మన ఆంధ్రుల ప్రాచీన లలిత కళా సంపద." అని గర్వంగా చెప్పగలుగుతున్నామంటే ఆ మహానుభావుని చేతి చలువే కదా!పునర్జన్మనంది, మరల తెలుగు నాట జన్మించి, తెలుగు కళా జగత్తుకు మరిన్ని వెలుగులను ప్రసాదించాలి ఆయన.అందుకే - నటరాజ రామక్రిష్ణ అభిలాష ఖచ్చితంగా నెరవేరాలి!  (1923 మార్చ్, 21 న బాలి ద్వీపములో జన్మించిన Nataraja ramakrishna - 7 జూన్ 2011 నాడు కీర్తి శేషులైనారు.)  నాట్య సరస్వతీ దేవి కొంగు ఊయెలలో పవ్వళించిన శ్రీనటరాజ రామక్రిష్ణకు నివాళి.
From:("నటరాజ రామ క్రిష్ణ " రచన; వకుళాభరణం లలిత;  vakulabharanam ramakrishna; kasi suvarchala deviవెల; 100/_ (ముద్రణ 2008) 








కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...