30, జూన్ 2011, గురువారం

కృష్ణపక్షమే లేకపోతే!


 గురజాడ దుర్గాప్రసాద రావు గృహసీమ 
సాహిత్య అభిలాషుల రాక పోకలతో కళ  కళలాడుతూండేది. 
ఒకసారి వారి గృహ సామ్రాజ్యానికి దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి  వచ్చారు. 
అప్పటికి ఆయన ఇంకా కవి లోకంలో పాల పళ్ళ పసి కూనయే! 
గురజాడ ఇంట్లో సమావేశమై, కవితా చర్చలతో కాలం గుబాళించినది. 
కొంత సేపు ఇష్టాగోష్ఠి జరిగింది. ఆ మీదట క్రిష్ణశాస్త్రి  తన ఇంటికి వెళ్ళిపోయారు.
తీరా తన ఇంటికి చేరాక, దేవులపల్లి క్రిష్ణశాస్త్రి గమనించుకున్నారు - 
భావకవితలను రాసి, చదివి , అక్కడే మర్చి పోయామని. 
చిత్తుప్రతుల్లో రాసిపెట్టుకున్న ఊహలు, భావాలు కవన సృజనకర్తకు ఎంతో అమూల్యమైనవి కదా! 
ఇంకేమున్నది? గబగబా దుర్గాప్రసాద రావ్ ఇంటికి తిరిగి వచ్చారు దేవులపల్లి క్రిష్ణశాస్త్రి.  
“ఇందాక ఇక్కడ నా కవితల కాయితాలను మరిచిపోయాను." అంటూ 
తాను మళ్ళీ వచ్చిన సంగతిని గాభరాగా చెప్పారు. 
తామందరూ కూర్చుని పిచ్చాపాటీ చేసిన చోట ఇంటిల్లిపాదీ అంతా వెదికారు, కానీ దొరక లేదు.
దేవులపల్లి క్రిష్ణశాస్త్రి  బాధ ఇనుమిక్కిలి ఔతూన్నది. పని పిల్లను పిలిచి అడిగారుదుర్గాప్రసాదు.
అంతలో అక్కడికి “జాజి ”వచ్చినది. దుర్గాప్రసాదుగారి పెద్ద కుమార్తె అన్నపూర్ణ.
ఆమెను ‘జాజి ’అని పునర్నామంతో వ్యవహరించే వారు. 
అక్కడికి వచ్చిన జాజి “దేని కోసం వెతుకుతున్నారు?” అని అడిగింది. 
విషయం తెలుసుకున్నాక, 
“ మీరంతా వెళ్ళాక, ఇందాక పనిమనిషి ఇల్లు తుడిచింది, 
   అది కానీ తీసిందేమో?” సందేహం వెలిబుచ్చింది. 
“సన్యాసీ! ఇందాక ఇక్కడ కాగితాల బొత్తి ఏమైనా చూసావా? కింద పడితే చూడకుండా ఊడ్చేసినావా?”
"మరేనండీ, గది ఊడుస్తూంటే పాత కాయితాలు దొరికాయి.
 కుంపటి అంటించేందుకు పనికి వస్తాయని తీసి చూరులో దాచాను” అంటూ ఆ పేపర్ల బొత్తిని ఇచ్చింది. “హమ్మయ్య!”అంటూ దేవులపల్లి వాటిని అందుకుని గృహోన్ముఖులైనారు. 
పాపం, అప్పటి హడావుడిలో పనిపిల్ల ఇంటి యజమానులు పెట్టిన కొంచెం చీవాట్లను తిన్నది కూడా!
చూరులో సన్యాసి దూర్చిన గుజిలీ ప్రతి ఇంకొటి, మరొకటీనా? అది "కృష్ణపక్షం” చిత్తు ప్రతి!
























ఆ ప్రతి దొరికింది కాబట్టి సరి పోయింది, 
లేకుంటే, ఆధునిక కావ్య శాఖ ఐన భావ కవిత్వము సొగసు గుబాళింపుల పారిజాత పుష్పాలను కోల్పోయేదే. 
ఆ తర్వాత అనతి కాలంలోనే తెలుగు కవిత్వ ప్రపంచంలో “భావ కవితా శాఖ” ఆవిర్భావానికి ఆ సంపుటే కారణమైంది! 


               వెబ్ పత్రిక [For essay]

29, జూన్ 2011, బుధవారం

అందరి మనసులు ఉలిక్కిపడేలా......


గార్బేజ్ ట్రక్ లో పోలీసులు ఎక్కించబడ్డారు,
కాదు.......... 

వారి దేహాలు అక్కడ.
మావోయిస్టులతో పోరాటంలో ప్రాణాలను కోల్పోయారు.
దేశంలోని శాంతి భద్రతలను పరిరక్షిస్తూన్న వారు, 
తమ విధి నిర్వహణలో- విధివశాత్తూ, 
విధి బలిగొన్నది.
సరే! 
ఆ తర్వాత??????? 
ఒక garbage truck లోనికి చేర్చడం- 
పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ.
కేవలం ప్రభుత్వం వారి తృణీకార దృష్టి మాత్రమే ఇందుకు కారణమా?
ఏమో మరి!!! 
ప్రసారమాధ్యమాలు ఈ సంఘటనను- 
అందరి హృదయాలూ ఉలిక్కిపడేలా- ఎత్తిచూపి- 
ప్రశంసార్హమైన కృషి చేసాయి.


ఇక్కడ ....................
గతంలో జరిగిన ఇంకొక సంఘటన 
నాకు గుర్తుకు వచ్చింది.
అది ఏమిటంటున్నారా?
కార్గిల్ జవానులు యుద్ధ సమాప్తి అనంతరం
స్వగృహాలకు మరలి వస్తున్నారు.
వారికి లభించిన స్వాగత సత్కారాల తీరు తెన్నులేమిటి?
క్రీడలలో రారాజు క్రికెట్!!!!!!!!!!
మన ఇండియా క్రికెట్ ప్లేయర్సు 
ఇక్కడికి- ఇలాగ అడుగు పెట్టారో లేరో- 
వారికి జేజేలు పలుకుతూన్న ప్రజల రియాక్షన్ చూడండి.
ఈ వ్యాసంలో పేర్కొన్న- రెండు సంఘటనలలో- 
ఇరు వర్గాల వారికీ- 
జాతీయ స్థాయిలో లభించిన ఘన సత్కారాలలో- వ్యత్యాసాన్ని గమనిస్తే........
pch!!!!!!!!!!

@@@@@@@@@@@@@

At 15000-ft you cannot breathe normally. 
There is less oxygen up there. The air is ratified. 
The lungs scream for oxygen. 
The blood vessels cry for oxygen. 
The wind can sear your windpipe, chill your brains, 
make your eyes weep with pain and cry out in sheer exhaustion.

The Bofors fires away at the post held by the enemy intruders situated across the mountain and Line of Control. Jawans close their ears and keep their hands close to their hearts as sounds of Bofors gets uncomfortable for him. The thunder of the Bofors can make them deaf forever. These guns were effectively handled by our Jawans and it proved to be very accurate and devastating in Kargil Conflict.

Corporate India pays crores of rupees to Dhoni, Yuvraj Singh, and Sachin to beat Pakistan on a Cricket field, and then why not give away just a day’s salary for someone else who is doing the same but in a battle field shedding their blood.

The Bofors fires away at the post held by the enemy intruders situated across the mountain and Line of Control. Jawans close their ears and keep their hands close to their hearts as sounds of Bofors gets uncomfortable for him. The thunder of the Bofors can make them deaf forever. These guns were effectively handled by our Jawans and it proved to be very accurate and devastating in Kargil Conflict.




Corporate India pays crores of rupees to Dhoni, Yuvraj Singh, and Sachin to beat Pakistan on a Cricket field, and then why not give away just a day’s salary for someone else who is doing the same but in a battle field shedding their blood...........



Indian cricket team travel all round the world by flights, stay in seven star hotels. What about our Jawans? Each of the 15 players who won Twenty20 world cup was gifted with a home in the home-grown infrastructure project of the company- Sahara City Homes worth 25 lakhs, BCCI announced 12 Crores for the team (Each players 80 Lakhs), Special award of 1 Crore to Yuvraj Singh for hitting 6 sixes, Neo Sports presented a Mercedes Benz to RP Singh for his performance, 

'Just have a look at 
the difference in 
reception of home coming of our heroes’

;;;;;[
Link - 2 :- for details,essay
]
   April 17, 2008   -                                         pheonixunleashed

27, జూన్ 2011, సోమవారం

ఎనిమిది రకముల పూవులు























అహింసా- ఫ్రథమం పుష్పమ్;
పుష్పమ్ ఇంద్రియ నిగ్రహ:
సర్వ భూత దయా ఫుష్పమ్
క్షమా ఫుష్పమ్ విశేషతః
జ్ఞాన ఫుష్పమ్; తపః- ఫుష్పమ్;
శాంతి- ఫుష్పమ్ తథైవ చ
సత్యం అష్ట విధం ఫుష్పమ్;
విష్ణోః ఫ్రీతికరం భవేత్||

@@@@@@@@@@@@@@@ 

Prathamam pushpam Pushpam indriya nigraha: sarva bhuuta dayaa Pushpam  kshamaa Pushpam viSEshata@h j~naana Pushpam; tapa@h- Pushpam  SAMti- Pushpam tathaiva cha satyam ashTa vidham Pushpaa@h vishNO@h Preetikaram BhavEt ||

@@@@@@@@@@@@@@@@ 
See the link 
  @@@@@@@@@@@@ 

21, జూన్ 2011, మంగళవారం

తదిరినాలు, తాన తందనాలు












                                 చర్ల గణపతి శాస్త్రి ఆంధ్ర సాహిత్య పారంగతునిగా అందరికీ తెలుసు.          కానీ ఆయన సంగీతశాస్త్ర పారంగతుడు కూడా! ఆంధ్ర పత్రిక, మున్నగు పత్రికలకు సంగీతకళ గురించి,  ఎన్నో విశేషాలను పరిశోధించి, ప్రజలకు అందించారు.ఒకసారి” చర్ల గణపతిశాస్త్ర్త్రి  ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు. ఆతడు విశాఖపట్టణ నివాసి.ఆ కంపార్టుమెంటులో  వేరొక సుప్రసిద్ధ గాయకుడు  కూడా ఉన్నాడు. ఇరువురూ లోకాభిరామయణంలోకి దిగారు. చర్ల గణపతి శాస్త్రి ఆ గాయకుని అడిగారు. ఆరోజు రైలులోని ఆ బోగీ కొత్త ఆవిష్కరణల సారాంశాన్ని అవగతం చేసుకున్నది. 
"ఏమండీ! సంగీత కచేరీలు చేసే వారందరూ –   తదిరినాం,  తదిరినాం.....అంటూ ఉంటారు కదండీ! అంటే ఏమిటీ? దానికి అర్ధం ఏమిటండీ?” అకస్మాతుగా వేసిన ఆ ప్రశ్న, చర్ల గణపతిశాస్త్రి పెదవులనుండి వచ్చినది!!
అందాకా - చర్ల గణపతిశాస్త్రి సందేహాలన్నిటినీ అతడు
టక టకా సమాధానాలిస్తూ తీర్చారు.
_     ఈ ప్రశ్నకు మాత్రం జవాబు తోచక తికమక పడసాగాడు అతడు.           “ దానికి ఎలాటి అర్ధ తాత్పర్యాలూ లేవు. రాగాలాపన చేస్తున్నప్పుడు ‘తదిరినాం’ అనే ఉచ్ఛారణను ఊతపదంగా వాడుతున్నాము. అంతేనండీ!”                                                                       అని ఆ తోటి ప్రయాణీకుని ఉవాచ.!!!!!!!!!         ఈ సారి అతనికి డౌట్సును తీర్చే పనిని-చర్ల గణపతిశాస్త్రి ఇట్టే చిటికెలో అంది పుచ్చుకున్నారు.  చర్ల గణపతిశాస్త్రి ఆషామాషీగా చెప్పినట్లుండే వాక్కులలో సైతం విజ్ఞానం వెల్లివిరిసేది. అత్యున్నత ఆధ్యాత్మికతత్వాన్ని మన ప్రాచీనులు,సర్వకళలకూ మేలిమి బంగరుపూతగా అలది, సౌందర్య భాసితమొనర్చిన సత్సంప్రదాయాన్నిమనకు అందించారు.  _    ఈ సంగతులనే చర్ల గణపతి శాస్త్రి అచ్చట ప్రస్తావనలోకి తెచ్చారు.  "మన ప్రాచీన కర్ణాటక  సంగీతం ఆధ్యాత్మికతత్వాన్నిప్రబోధించింది....”  _ అంటూహిందూ సంగీత, లలిత కళల అంతరంగాన్ని  కరతలామలకం చేస్తూ, చర్ల అనేక సంగతులను చెప్పారు.  "ఇంతకీ తదిరినాం – అనే పదార్ధం ఏమిటండీ?"ఆ విశాఖ పట్టణ వాసి ప్రశ్నార్ధక సందేహం వెలిబుచ్చాడు.  “తదితరానాం – అనే మాటకు వికృతి – తదినారిం. = దానికంటే ఇతరమైనది – అని
ఆ పలుకుకు సారాంశము. సంస్కృతములో – న – అనగా లేదు – అనే వ్యతిరిక్తార్ధము.
అన నేమిటన్నమాట?ఆ నాదము కన్న ఇతరమైనది  కానీ, వేరైనది కానీ లేనేలేదు – అని తాత్పర్యము.”అలాగ సందేహ నివృత్తి చేసారు చర్ల గణపతిశాస్త్రి.
ఆయన అనేక గ్రంధాలను రచించారు. సంగీతశాస్త్ర పూర్వాపరాలను తన సునిశిత పరిశోధనలతో పరిగ్రహించి, సాహితీ జిజ్ఞాసువులకు అందించారు. "సామ వేద దిదం గీతం సంధ్యా గ్రహ......."  సామ వేదం నుండి సంగీత శాస్త్రము గ్రహించబడినది. శారఙ్గదేవుడు రచించిన “సంగీత రత్నాకరము” ప్రాచీనమైన గ్రంధాలలో ఒకటి.అందులో శ్రీమత్ ఆంజనేయస్వామి ప్రతిపాదించిన కొన్ని సంగీత మతాలు వివరించబడినవి. ఆంజనేయ విరచిత సంగీత, నవ వ్యాకరణాది గ్రంధాలు ఇప్పటికీ మనకు లభ్యం కాలేదు. అదృష్టవశాత్తూ, కంఠోపాఠం చేసే వేదమంత్ర సాంప్రదాయమే – మనకు అనేక పురాతన సూక్తులూ, ప్రవచనాలూ, సిద్ధాంతాలు – నిత్య వ్యవహారంలో, వాడుకలో,అనేక భాషలలో లభించేటట్లు చేసాయి. సంగీతజ్ఞుల నాలుకలపైన ఆడే సుభాషితం – “శిశుర్వేత్తి, పశుర్వేత్తి; వేత్తి గాన రసం ఫణిః” ఇత్యాది సుభాషితోక్తులు ఈనాటికీ  జన వాక్కులుగా ప్రజలకు అందుబాటులో ఈ కారణము వలననే ఉన్నాయి కదా! ”ఇలాగ మన సంగీతము యొక్క పునాదులను, విశేషాలనూ గణపతిశాస్త్రి తెలుపుతూంటే, రైలు బండి చుక్ చుక్ ధ్వని లయబద్ధంగా సాగింది. మొత్తానికి, ఆ రోజు తదిరినాన శబ్ద ధాతు వివరణలను ఆ బోగీలోని శ్రోత "అరటిపండు వలిచి, అరచేతిలో పెట్టినట్లు"అందుకోగలిగాడు.
Essay  (Read here )

15, జూన్ 2011, బుధవారం

సాహితీ సేవలో మణిదీపాలు














                      మాతృభాషలలోని సాహిత్యము యొక్క ఆసుపాసులను శోధించి ఎన్నో అమూల్య విషయాలను ప్రజలకు అందించారు ఎందరో మహానుభావులు. ఈ కృషిలో ఎన్నో శ్రమదమాదులకు ఓర్చి చేసిన వారి నిష్కామ సేవలను గమనిస్తే, ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోను కాక తప్పదు.


డాక్టర్ వుమ్మెత్తల సత్యనారాయణ ప్రఖ్యాత రచయిత "గోపీచంద్" గురించి పరిశోధించారు. ఉపపత్తుల కొరకై అనేక గ్రంధాలయాలలోని పుస్తకములను క్షుణ్ణంగా పరిశీలించారు. వేటపాలెంలోని "సారస్వత నికేతనము", గుంటూరు "ఆంధ్ర క్రైస్తవ కళాశాల గ్రంధాలయము"లు ప్రత్యేక స్మరణ యోగ్యములు. గోపీచంద్ తొలి కథానిక "ఒలింపియస్" నాకు లభించినది వేటపాలెంలోని సారస్వత నికేతనము"లో..అతని కథా సంపుటములలో వేటిలోనూ చేరలేదిది. "అపూర్వోపన్యాసములు" తొలి తెలుగు కథానికగా నేను భావించేందుకు వీలు కల్పించినట్టి 1903 సంవత్సరపు "కల్పలత" అనే పత్రికలు లభించింది కూడా ఇక్కడే!...అంటూ వివరించారు.











తెలుగులోఅచ్చు అయిన తొలి కథానిక ఏది?" అనే అంశం అనేక పరిశోధనలకు ఆస్కారం కలిగించింది. మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తిలోని బ్రాహ్మణ వీధిలో వీరు నెలకొల్పిన "సాహిత్య వేదిక" ద్వారా తెలుగు భాషకు, సాహిత్యానికి ఎంతో సేవ చేసారు. తెలుగు తల్లి సాహితీ భవనములో ఇటువంటి నిష్కామ సాహితీ కృషీవలుర సేవలు సదా వెలుగులను అందించే "మణి దీపములే" !


&&&&&&&&&&&&&&&&&&&&&&&&




మహాత్మా గాంధీజీ స్వాతంత్ర్యోద్యమ సమావేశాలు జరిగినప్పుడు, 
ఆయన చేతి కర్రను ఇక్కడి వారు స్వీకరించారు.
వారు ఇక్కడ దానిని భద్రపరిచారు.
ఆ అమూల్య వస్తువు "జాతిపిత చేతి కర్ర"
వేటపాలెములోని సారస్వత నికేతనము లో ఉన్నదని, 
కొందరి ప్రముఖుల జీవిత కథలలో ఉన్నదిమరి!
మరి......ఇప్పటికీ -........ ఇంకా అక్కడ ఉన్నదా???????

&&&&&&&&&&&&&&&&&&&&&&&&

         
           {Telusaa!   [Link for ESSAY ]
              By kadambari piduri,
                         Aug 3 2008 1:35AM}

&&&&&&&&&&&&&&&&&&&&&&&


9, జూన్ 2011, గురువారం

మనీ, మనీకై మస్కా


 master Vithal, Zubeida, LV Prasad 
"నేను విఠల్ మాస్టర్ ని! నేను ఒక సినిమా కంపెనీని స్థాపిస్తున్నాను. కొత్త బ్యానర్ పైన తీసే సినిమాలు లాభాలను తెస్తాయి. కాబట్టి నేను స్థాపిస్తూన్నాను.నేను పెట్టబోతూన్న సినిమా కంపెనీలో మీరు షేర్లు పెట్టి, భాగస్వాములు అవండి." అంటూ వచ్చిన అభ్యర్ధనకు అనేకమంది స్పందించారు.చాలామంది, షేర్లను కట్టారు. అలా సేకరించగా ఎంతో ధనం పోగైనది. అలాగ ఎంతో ధనాన్ని సేకరించిన వ్యక్తి, చెప్పాలా? శుభ్రంగా ఉడాయించాడు. ఐతే అతడు, రాజమండ్రిలో పోలీసులకు పట్టుబడ్డాడు.మూకీ/ మూగ బొమ్మల సినిమాల రోజులు అవి. చలనచిత్ర నిర్మాణాలు ప్రథమ దశలో ఉన్నది.మన దేశంలోనికి విదేశాలనుండి, కెమేరాలూ, ప్రొజెక్టర్ లూ అన్నీ దిగుమతి చేసుకుంటూ, తీసిన బొమ్మలు, ఎంతెంతో కృషితో వెండి తెరపైకి ఎక్కేవి. ఎందరి శ్రమదమాదుల ఫలితంగానో- సినిమాలు, భారత దేశంలో గొప్ప పరిశ్రమగా తేజరిల్లుతూన్నది.అదిగో! ఆ రోజులలో జరిగింది ఈ విచిత్ర సంఘటన. అప్పట్లో హిందీ మూవీలలో కథానాయకులలో రారాజు- Vithal Master) ప్రేక్షకుల, ప్రముఖుల ఆహ్వానంపై - హీరోయిన్ జుహార్, మాస్టర్ విఠల్ లు - విశాఖపట్టణమునకు వచ్చినప్పుడు, పై సంఘటన జరిగి, వార్తలలోనికి ఎక్కినది.మూకీలు, అంటే సైలెంట్ మూవీలు ఆడుతూన్న రోజులు అవి. అందువలన నటీనటులకు భాషా భేదాల అక్కర రాలేదు.హిందీ, తెలుగు భాషా భేదాల అవసరం లేకుండానే అందరికీ అభిమాన పాత్రులైనారుఇలాంటి మోసాలకు అలనాటి నుండీ ప్రజలు బోల్తా పడటం ఆశ్చర్యమే కదా!విఠల్ మాస్టారు నటించిన హిందీ సినిమాలు (Movies acted by Vithal Master)  

విఠల్ మాస్టారు నటించిన హిందీ సినిమాలు 
              (Movies acted by Vithal Master); 

Alam Ara was first shown at the Majestic Cinema in Bombay March 14,1931The film starred master Vithal, Zubeida, 
LV Prasad and Prithviraj Kapoor in the lead gave a new direction to Indian cinema.   
Kalyan Khajina (1924)
Bajirao Mastani (1925)
Vasant Bala (1926)
Suvarna Kamal (1926)
Gunial Gulab (1926)
Ratan Manjari (1926)
Madan Kala (1926)
Mahasati Ansuya (1927)
Balidan (1927)
Veer Garjana (1927)
Jaan-e-alam Anjuman Ara (1927)
Kala Pahad (1927)
Bansari Bala (1927)
Bhedi Trishul (1927)
Asuri Lalsa (1927)
Shiraz-Ud-Dowla (1927)
Swadesh Seva (1927)
Vande Mataram Ashram (1927)
Raj Tarang (1928)
Kanak Kanta (1928)
Saundarya Sura (1928)
Sohni Mahiwal (1928/II)
Gul Badan (1928)
Sassi Punnu (1928)
Karuna Kumari (1928)
Heer Sundari (1928)
Mirza Sahiban (1929)
Rank Nu Ratan (1929)
Bhedi Sawar (1929)
Ranghelo Rajput (1929)
Chirage Kohistan (1929)
Nishan Danka (1929)
Dav Pech (1930)
Veer Na Ver (1930)
Josh-E-Jawani (1930)
Arunodaya (1930)
Daulat Ka Nasha (1931)
Gulam (1931)Alam Ara (1931)
Anangsena (1931)
Meri Jaan (1931) ; Hoor-E-Misar (1931); Dilawar (1931); 
Burkhewala (1932) Zalim Jawani (1932) Kalo Bhoot (1932)
Chhatrapati Sambhaji (1934) Bhedi Rajkumar (1934)
Raj Tarang (1935) Rangila Nawab (1935)
Hind Mahila (1936) Asiai Sitara (1937) Netaji Palkar (1939)
Mohini (1940) Jagat Mohini (1940) Amrit (1941/II)Amrit (1941/I)
Soonbai (1942)Bahirji Naik (1943) Ramshastri (1944/II)
Nagma-E-Sahra (1945) Pannadai (1945)
Sasurvaas (1946)Kashmir Ki Kali (1946) Jadugar (1946) Rukmini Swayamvar (1946/II)
Jai Bhawani (1947)Garibanche Rajya (1948)Vikram Shashikala (1949)
Shilanganache Sone (1950)Swarajyacha Shiledar (1951)
Narveer Tanaji (1952) Mayecha Pazhar (1952); Chhatrapati Shivaji (1952/II) Mard Maratha (1952) Chhatrapati Shivaji (1952/I)
Vaadal (1953)Tai Teleen (1953)
Pavankhind (1956)
Naikinicha Sazza (1957)
Matevin Bal (1958)
Akashganga (1959)
Vanakesari (1960)
Mohityanchi Manjula (1963)
Sadhi Manse (1965) Vavtal (1965)
Shodha Mhanje Sapdel (1966) Sheras Savva Sher (1966)
 

       LINK for Essay                   Written by kusuma kumari    Saturday, 07 May 2011 04:50 
 

శివ దీక్షా పరురాలనురా!



















నటరాజ రామక్రిష్ణ ప్రథమ గురువులు 
నాయుడు పేట రాజమ్మ, పెండ్యాల సత్యభామ.తన జీవితాన్ని శ్రీ కాళహస్తీశ్వరునికి అంకితం చేసిన పుణ్యవతి ఆ దేవ నర్తకి.@ “శివ దీక్షా పరురాలనురా......” అనే పాటను, రాజమ్మ అభినయించింది. ఒక కోనసీమ పండితుడు ఆమె విద్వత్తును ఆమూలాగ్రమూ శోధించ నిర్ణయించుకున్నాడు. ‘ప్రతి హస్తము-’నకూ ఆమెను ఆపే వాడు; 
“ఈ హస్తమునకు, ముద్రకూ శాస్త్ర ప్రమాణాలను వివరించు!” 
అని ప్రశ్నలతో నిలదీసేవాడు.రాజమ్మ ఆతని సందేహాలకు దీటైన జవాబుగా నిలబడగలిగినది. శాస్త్రాల నుంచి శ్లోకములను చదివి, అభినయం చేస్తూ వెంత వెంటనే చూపించినది.“రాజామణీ! నీ విద్య నా హృదయాన్ని కదిలించి, కరిగించినది, ఇవాళ నృత్య కళలో లీనమై, మైమర్చిపోయాను ” తన్మయుడైన ఆ పండితుడు రాజమ్మకు – తన శాలువాను కప్పి, వినయపూర్వకంగా మనసారా గౌరవించాడు.@ శ్రీ కాళహస్తి రాజమ్మ సకల కళా విశారద. ఆమె నిండు పౌర్ణిమ నాటి సంగీత సాగరము, నీటి చెలమ నుండి ఊరే నీటి ఊట వంటిది ఆమె విద్య.స్త్రీ రూప తాండవ నృత్య మహేశుడు ఆమె.ఆమె విద్యలను దీటుగా నేర్చుకోగల విద్యార్ధి అసంభవమే!ఆంధ్ర కళామ తల్లి పూర్వ పుణ్య భాగ్య వశాత్తూ, నటరాజ రామక్రిష్ణ రూపంలో అద్భుత శిష్యుడు ఆమెకు లభించాడు.రామక్రిష్ణ – తన గురువు రాజమ్మ ప్రజ్ఞా, పాండిత్యధురీణతలను చెప్పేవాడు.రాజమ్మ గారికి వచ్చినన్ని పదములు, వర్ణాలు, జావళీలు, సలాం జతులు, మరెవరికైనా తెలుసునంటే సందేహాస్పదమే!రాజమ్మ ఒక చిన్న పద్యాన్ని ఏడు రోజులు అభినయించ గలిగారు. ఏడు కచేరీలలో ఏడు విధాలుగా ఆస్థానములో ప్రదర్శించి చూపగలిగారు.“ఆలయ విద్య” ను అభ్యసించే వారికి, భరత విద్యతో పాటుగా, ఆగమ పద్ధతిని, వివిధ దేవతల ఆరాధించే క్రమాన్నీ,  
జతులను సైతం నేర్పించిన అసమాన విదుషీమణి.
ఆ విద్యలన్నిటినీ నేర్చి, 
పుక్కిట పట్టిన ఏకైక వ్యక్తి నటరాజ రామక్రిష్ణ మాత్రమే!“అష్ట దిగ్బంధన విద్య” లో ఆమెకు ఆమెయే సాటి.ऽ) “కేళిక” వంటి సమస్యా పూరణలనూ చిటికెలో నృత్యం ద్వారా పరిష్కరించగల నేర్పరి. అటు ఆలయ సంప్రదాయమూ, ఇటు కచ్చేరీ ఆటలనూ రెంటినీ చూపి, అందరిచేత “శభాష్!”అని తలలూచేలా చేయగలిగిన మేధావి.సంస్కృతాంధ్ర, సంగీత, భరత శాస్త్రాలను, పురాణేతిహాసాలను అధ్యయనం చేసిన కళా తపస్విని ఆమె.సభికుల హృదయాలనెరిగి, “కేళిక” చేసి, నేర్పుతో ఒప్పించగలైగేటంత  ప్రతిభాశాలి ఐన ఆమె గురుత్వం, నటరాజ రామక్రిష్ణ శిష్యరికము- ఈ రెండున్నూ బంగారానికి పరిమళము అబ్బినట్లు సమకూరినవి.ఆమె నటరాజ రామక్రిష్ణ వంటి శిష్యుడు నృత్యకళకు ప్రాణం పోసి, పవిత్ర కళగా సమాజంలో నిలబెట్ట గల మానిషి- అని గ్రహించింది.“నాయనా! నీ వయసుకు మించిన రసాభినయాన్ని ప్రదర్శించ గలిగావు. నీ విద్యలో ప్రౌఢత్వము వచ్చే వరకూ, నేను బతికి ఉంటే-నాయికాభినయాదులలో ఉన్న అనేక విశేషాలు చెబ్తాను.” అన్నది. అలాగే నటరాజ రామక్రిష్ణకు-ఆతని వయస్సుకి మించిన విద్యలను  రాజమ్మ  నేర్పించినది. కానీ..... ప్రౌఢత్వాన్ని అందుకోక ముందే నాయుడుపేట రాజమ్మ అనంతలోకాలకు, ఇందీవరనాభుని సన్నిధికి వెళ్ళిపోయింది.@ రాజమ్మ మున్నగు అప్పటి నర్తకీమణులు సంస్కృత, ఆంధ్ర కావ్యాలను పూర్తిగా అభినయించే వారు. శ్రీ కృష్ణామృతము, పుష్ప బాణ విలాసము, అమరుక కావ్యము, శృంగార మంజరి, గీత గోవిందము లోని అష్టపదులు, క్షేత్రయ్య పేరుతో సుప్రసిద్ధుడైనట్టి వరదయ్య యొక్క మువ్వ గోపాల పదములు, జావళీలు ఇత్యాదులన్ని వారి అభినయంలో శోభిల్లినవి. నటరాజ రామక్రిష్ణ  మసి పాతలో కట్టి పడేసిన మూల  పడేసి ఉన్న మూటలోని మణి రత్నాల వంటి వారినీ, వారి కళాప్రతిభలనూ గుర్తించ గలిగాడు.నటరాజ రామక్రిష్ణ నీలం సంజీవయ్య పదవీ సమయాన, "నృత్య నికేతన్" ను స్థాపించి, వందాలది నాట్యాభిమాన, కళాకారులకు పూల బాటను ఏర్పరిచాడు.ఆన్ని ప్రదేశాలలో తిరుగుతూ, ఎందరో నాట్య దేవతలను దర్శించి, వీలైనంత వరకూ ఆర్ధిక, హార్ధిక సాయాలను అందించాడు.“ఆలయ కళ”, “పేరిణీ నాట్యము” వంటి అనేక నర్తన సాంప్రదాయ వైశిష్టతలను కళాలోకమునకు  పరిచయం చేయ గలిగిన 
నాట్య తపస్వి నటరాజ రామక్రిష్ణ.

                                   నాట్య తపస్వి (Link for ESSAY)
             ,,,,,,,,,,,,

8, జూన్ 2011, బుధవారం

నటరాజ్ ఆతని ఇంటి పేరు




















      1992 లో పద్మశ్రీ ఆదిగా గల అసంఖ్యాక బిరుదులు వరించినవి.
రామమోహనరావు, దమయంతి ఆతని తల్లి దండ్రులు.శిల్ప కళను అధ్యయనం చేస్తూన్న సోదరుడు శ్యామసుందర్ కుడిభుజంగానిలువగా, లక్ష్య సాధనకై  ఏ మాత్రమూ వెనుకంజ వేయకుండా ముందుకు సాగిన మహనీయుడు నటరాజ రామక్రిష్ణ.రామక్రిష్ణ నాగపూర్ లో ఉన్నప్పుడు స్వీయ కళాభిరుచులను ప్రదీప్తపరచుకున్నాడు.నటరాజ రామ క్రిష్ణ పాము డాన్సును- స్వీయ ప్రతిభా వ్యుత్పత్తులతో అభివృద్ధి చేసాడు.రామస్వామి,భీమారావు సోదరుల సాంగత్యము విలువైనది.భండారా సంస్థానము కళల కూడలిగా భాసిస్తూండేది. "కేరవ" అనే చిన్న తాళమునూ, భీమారావు వాయిస్తూంటే, నటరాజ రామ క్రిష్ణ గంగా నదిలా  గల గల ప్రవహించే ఆ వాద్యానికి అనుగుణంగా - సర్ప గతులను రూపొందించుకున్నాడు.అలాగ 50 రకాల ఫణి విన్యాస గతులను సృజించి, "నాగ నర్తనము" రూపొందించాడు.భండారా సంస్థానములో కథక్ నృత్య పద్ధతిలో నాగ నాట్యము ఉన్నది.దానికి విలక్షణంగా ఉన్నది నటరాజ రామక్రిష్ణ సృజన ఐన నాగ నర్తనము.భండారా సంస్థానమునకు గణపతి పాండ్యా పిలుపున నటరాజ రామక్రిష్ణ వెళ్ళాడు."ఈ ప్రదర్శన అందరి కోసం కాదు, మీ ఒక్కరి కోసమే!" అంటూ యువరాజా చెవిలో చెప్పాడు నటరాజ రామక్రిష్ణ."సరే!"అని అంగీకరించి, దర్బారులో కాక, అంతఃపురములో ఏర్పాటు చేసారు.భీమారావు అక్కడ "అల్గోజా వాద్యము"ను వాయిస్తూండగా, నటరాజ రామక్రిష్ణ తన మేనును ప్రతి అణువూ స్పందిస్తూండగా, "నాగ నర్తనము"- ను చేసాడు.రాజు "కేరవలో ఇంత మాధుర్యం ఉన్నదా?" అన్నాడు."ఆ శక్తి భీమారావు చేతి వేళ్ళలో  ఉంది మహారాజా!" అంటూ, తోటి కళాకారుని మెచ్చుకున్నాడు నటరాజ రామక్రిష్ణ. ఇది ఆతని గంభీర, నిష్పక్ష్పాత వైఖరికి ఈ సంఘటన నిదర్శనము."రేపు మా దర్బారులో ఈ నాగ నర్తనమును చేయండి" అన్నాడు.అందుకు నటరాజ రామక్రిష్ణ "అది మీ ఒక్కరికే ప్రత్యేకం మహారాజా! అది మీకు సమర్పించుకున్న పూజా ప్రసూనం. ఇతరుల కోసం కాదు" అని జవాబు ఇచ్చాడు.(కథక్ రీతిలోని నాగ నృత్యాన్ని చినబుచ్చకూడదని, అలాగ అని ఉండవచ్చును) భండారు రాజా - వందరూపాయల నోట్లు ఉన్న కవరును వారికి ఇచ్చాడు. భీమారావు, నటరాజ రామక్రిష్ణ లు అందుకున్న ఆ కవరులో 10 నూరు రూపాయిల నోట్లు ఉన్నవి.అప్పటి రోజులలోని అణాకు, పైసా ఈ నాడు 60 రెట్లు విలువ ఉన్నది.
 **********************************@@@@@@
రామక్రిష్ణ నాగపూర్ లో ఉన్నప్పుడు విద్యవ్యాసంగాలు విచిత్రమైన మలుపులతో, పురోభివృద్ధి గాంచినవి.భండారా సంస్థానము యువరాజు "రాజా గణపతి రావు పాండ్యా" ఆహ్వానముపై వెళ్ళాడు రామక్రిష్ణ. పాండ్యా కళాభిమాని. ఆయన కొలువులో- రాయగఢ్ కు చెందిన కళ్యాణ్ జీ , కార్తీక్ జీ మున్నగు హేమాహేమీలు ఉన్నారు.రామక్రిష్ణ స్నేహితుడు రా భావ్ సర్ దేశ్ పాండే ప్రోత్సాహము రామక్రిష్ణ జీవితములో ఒక మైలు రాయి.రామక్రిష్ణ కోరికపై కళ్యాణ్ జీ తబలా వాయించాడు.  రామ్ భావ్-"పార్సో మోరె నయన్ మే నందలాల్...... " గీతాలాపన చేసాడు. రామక్రిష్ణ ఆ పాటకు- తనను తాను  మైమరిచిపోతూ, ప్రేక్షకులు మైమరిచేలా అత్యద్భుత నాట్యాన్ని చేసాడు.అక్కడ ప్రేక్షకులందరూ, ఉప్పొంగిపోతూ, ఉవ్వెత్తున లేచి, కరతాళ ధ్వనులు మిన్నుముడ్తూండగా "నటరాజ్"అంటూ ఎలుగెత్తి పలికారు.అంతే! భండారా ఆస్థానములో ఆతను అడుగు పెట్టిన వేళా విశేషమది.ఆనాటి నుండీ అతని ఇంటి పేరు "నట రాజ" గా సుస్థిరమైనది. (పేజీ 33) 
నటరాజ రామక్రిష్ణ తన “నర్తన మురళి”  poem లో సాంద్ర మనో కేదారాలను పరిచాడు.
 “విశ్వవ్యాప్తమైనట్టి నీ విశ్వ రూపము                  ఆ చిన్ని నీటి బిందువులో    చూడ గలిగిన నా జీవితమే ధన్యము, ఓ క్రిష్ణ కిశోరా!”         అని భక్రితో  అనుకున్నారు.
ఆంద్ర నాట్యము, పేరిణీ నాట్యము, నవ జనార్దన పారిజాతము"మన ఆంధ్రుల ప్రాచీన లలిత కళా సంపద." అని గర్వంగా చెప్పగలుగుతున్నామంటే ఆ మహానుభావుని చేతి చలువే కదా! పునర్జన్మనంది, మరల తెలుగు నాట జన్మించి, తెలుగు కళా జగత్తుకు మరిన్ని వెలుగులను ప్రసాదించాలి ఆయన.అందుకే - నటరాజ రామక్రిష్ణ అభిలాష ఖచ్చితంగా నెరవేరాలి!“త్రిభువనాలను నర్తనమాడించు నీవు;            నాట్యమాడుచుండగా;                తాళధారినై;        నేను;           నిన్ను ఆడించే హక్కు;                     నాకివ్వు, స్వామీ”             అంటూ నంద కిశోరుని _ విలువైన చిన్న కోరిక కోరారు నటరాజ రామక్రిష్ణ.           “కృష్ణా! నీవు మరల నన్ను-              ఈ ప్రపంచానికి పంపాలనుకుంటే-                  జ్ఞాపకము ఉంచుకో స్వామీ!,                      నర్తకునిగా మాత్రమే పుడతాను”                   అని రాసుకున్నారు.ఆంద్ర నాట్యము, పేరిణీ నాట్యము, నవ జనార్దన పారిజాతము"మన ఆంధ్రుల ప్రాచీన లలిత కళా సంపద." అని గర్వంగా చెప్పగలుగుతున్నామంటే ఆ మహానుభావుని చేతి చలువే కదా!పునర్జన్మనంది, మరల తెలుగు నాట జన్మించి, తెలుగు కళా జగత్తుకు మరిన్ని వెలుగులను ప్రసాదించాలి ఆయన.అందుకే - నటరాజ రామక్రిష్ణ అభిలాష ఖచ్చితంగా నెరవేరాలి!  (1923 మార్చ్, 21 న బాలి ద్వీపములో జన్మించిన Nataraja ramakrishna - 7 జూన్ 2011 నాడు కీర్తి శేషులైనారు.)  నాట్య సరస్వతీ దేవి కొంగు ఊయెలలో పవ్వళించిన శ్రీనటరాజ రామక్రిష్ణకు నివాళి.
From:("నటరాజ రామ క్రిష్ణ " రచన; వకుళాభరణం లలిత;  vakulabharanam ramakrishna; kasi suvarchala deviవెల; 100/_ (ముద్రణ 2008) 








6, జూన్ 2011, సోమవారం

మీరేమంటారు?
















      జానపద గీతాలూ, నాట్యాలూ బాగుంటాయి,టెలి విజన్ లో అలాటి ప్రోగ్రాములు వస్తే, తప్పకుండా ఆసక్తిగా చూస్తూంటాను.జీ టి.వి. వారి "అద్భుతం: - లో ఇవాళ తప్పెట గుళ్ళు చూసాను. ఇదివరకు దూరదర్శన్ లో కూడా చూసే వాళ్ళం.ఆట్టే అర్ధం కాకున్నా చూసాను.2 వేల ఏళ్ళ క్రితం నాటి ఆ నృత్య సంప్రదాయాన్ని కాపాడి, ఇవాళ కూడా మనకు యథా తథ రూపంలో అందించిన ఆ నర్తకులకు కృతజ్ఞతాపూర్వక జోహార్లు.తీర్పరి - వర్గీయుడు - "కొంచెం మోడర్న్ చేస్తే బావుంటుందని సలహా ఇచ్చారు.అతని advice ప్రకారం కాస్త మసాలాను జత చేయనూ వచ్చు.కానీ, ప్రాచీన సంపదను- మనదీ ఇది.- అని గర్వంగా అందీయగలిగిన ప్రాచీన వారసత్వ సంపద,మన దేశంలో మాత్రమే పరిఢవిల్లిన ప్రక్రియ - కంఠో పఠం చేసే విద్య.ఇప్పటి విద్యా విధానం ఈ విధానానికి స్వస్తి పలకడానికి వెనుక- అనేకం ఉన్నై, ఆ విషయాల్ని పక్కన బెట్టేసి, జానపదము - వగైరా ప్రాచీన కళలను ఆధునీకరించ వచ్చునా? - దగ్గరికి వద్దాము.1) ఆధునీకరణ- వర్తమాన ప్రపంచంలో దూసుకు పోవడానికి అవసరమే!2) కానీ యథాతథ రూపాలను కూడా పరిరక్షించాలి.ఇది తప్పనిసరి అవసరము.ఇందుకోసం రెండు వర్గాలు, అవసరమైతే సంఘంలో రూపు దిద్దుకుని, తమకు తాముగా రూపొందాలి.నాకు - తప్పెటగుళ్ళు- వంటి ప్రదర్శనలు - ఆసాంతమూ అర్ధము కావు. ఐనా సరే, చూస్తాను."మన ప్రాచీన ఘన సంపద"కాబట్టి.చాలా మంది హిందీ సినిమాలను చూస్తూంటారు, ముక్కస్య ముక్క అర్ధమౌతూన్నదనేనా?మన పొరుగు ఒరియా, కన్నడ, అరవము, ఇతర భాషలు అర్ధమౌతూన్నాయా?కానీ, వేటి విలువ వాటిదే!తెలుగు జిల్లాలలోని స్తానిక యాసలు అన్నీ అందరికీ, పూర్తిగా అర్ధం అవాలని, అందరి మీదా ఒత్తిడి తేవాల్సిన అక్కర లేదు.ఆయా ప్రోగ్రాములలోనీ/ రచనలలోనీ ఆర్ద్రత, సౌమ్య భావ జాలాలూ ప్రేక్షకుల/ చదువరుల మనసులకు చేరితే చాలు కదా!కొందరు కళా కృషీవలురు కొందరి పుణము కట్టుకుని కాలానికి ఎదురీది, ఇప్పటికీ మన ఎదుట ఉంచగలుగుతూన్నారు కదా!అలాటి నిష్కామ కళారాధకులకు ధన్యవాదాలు . మీరేమంటారు?

ఆ బిరుదు తాపీ వారిదే!
























                               చిత్ర లిపి నుండి-నేటి సుందర లిపి దాకా తెనుగు వ్రాత శిల్పంలో చేరిన పరిణామాల గూర్చి తాపీ ధర్మారావు  పరిశోధనలు చేసారు. తత్సమాచార, విషయ, విశేషాలన్నిటినీ సేకరించి ఉంచారు. కానీ సమయ సందర్భాలు రాక, వానిని కూర్చి, ప్రచురణ రూపంలో కూర్చి, తేలేదు.సరస్వతీ స్తోత్రమును రచించారు తాపీ ధర్మా రావు .1926 లో ఊర్కాడు జమీందారు వద్ద తాపీ ధర్మారావు  పని చేసే వారు.దేవీ నవ రాత్రుల సందర్భంలో- అక్కడ తెలుగు వారు, అరవ వారు అనే భేదం ఎంచకుండా, కవి, పండితులకు అందరికీ సన్మాన గౌరవ పురస్కారాలను అందజేసే వాళ్ళు.ఆ ఉత్సవాల సందర్భంగా అనుకోకుండా తటస్థ పడిన ప్రశంసాపూరిత నామము తాపీ ధర్మారావు కు లభించినది.  జగద్గురు చంద్ర శేఖర భారతీ శంకరాచార్యుల వారు పట్టలేని ఆనందంతో తాపీని కౌగిలించుకుని "ఆంధ్ర విశారదా!" - అని  పిలిచారు.పట్టుశాలువాను కప్పారు.అంతేకాదు...."ఇతోధిక ఖ్యాతి నార్జించుము"అంటూ ఆశీర్వదించారు.  తర్వాత కొన్ని బిరుదులు తాపీ కి వచ్చాయి. కానీ ఆయన ఈ బిరుదును మాత్రమే అట్టిపెట్టుకున్నారు ఇష్ట పూర్వకంగా."ఒక వర్గానికి చెందిన మఠాధిపతుల కోటలో పాగా వేశాను కదా, అన్న దానికి గుర్తుగా -ఆంధ్ర విశారద-బిరుదునే ఉంచేసుకున్నాను."అని మిత్రులతో చెప్పుకునేవారు తాపీ.ఆ బిరుదు ;

2, జూన్ 2011, గురువారం

సెసిల్ బి. డి మిల్ జాగ్రత్త చర్యలు












              “The Ten Commandments.” వంటి 
అద్భుత దృశ్య కావ్యాలనువెండి తెర కెక్కించడంలో          సిద్ధ హస్తుడు
దర్శకుడు సెసిల్ బి. డి మిల్.నేత్ర పర్వంగా సినిమాకరణం చేయడం కొట్టిన పిండి ఆయనకు.“టెన్ కమాండ్ మెంట్స్” తర్వాత అంతటి అద్భుత చలన చిత్ర రాజాన్ని తీయాలని  
          దృఢ సంకల్పంతో 
       cecil B. Demille కొత్త  movieని ఆరంభించాడు .












నేత్ర పర్వంగా సినిమాకరణం చేయడం కొట్టిన పిండి ఆయనకు.                            సెసిల్ బి. డి మిల్ సినీ ప్రణాళిక, 
ఈ సమస్త విశ్వము యొక్క ఆవిర్భావమూ,
          పుట్టు పూర్వోత్తరాలూ – 
(the biggest spectacle of 
all–the creation of the world )                         ఇదీ ఆయన ఎన్నుకున్న కథాంశము.
“ పిండి కొద్దీరొట్టె ” కదా! 
మరి దీనికి భారీ సన్నాహాలే అవసరమౌతాయి కదా!        విశ్వ ఆవిర్భావం తెరకెక్కించాలంటే,డాలర్ ల ఖర్చు అవసరం. (The creation of the world cost millions of dollars,)కొన్ని కోట్ల డాలర్లును మంచి నీళ్ళ ప్రాయంగా వ్యయం చేస్తూ,మహత్తర కళా ఖండాన్ని 
వెండితెర పైన  సాకారం చేస్తూన్నదర్శకుని అసమాన ధైర్య సాహసాల క్షణాలు అవి.డెమిలీ అరిచాడు 
“యాక్షన్!” డెమిలీ శ్రమ దమాదులను లెక్క సేయక,ప్రతి సీనూ పరిపూర్ణ దృశ్యమై 
ప్రేక్షకులకు సాక్షాత్కరింప చేయాలనే 
తపన అతనిది.కొత్త సినిమా రూపకల్పన కోసమనిఅందుకోసం లొకేషన్ ను select చేసుకున్నారు. 

స్పెయిన్ లో (Spain with four mountain peaks)నాలుగు పర్వత శిఖరాలు అవి.ప్రతి శిఖరం మీద కెమెరా మెన్ ల సమూహాలు నెలకొల్పినారు.ప్రత్యేకముగా టెలీ ఫోన్ లైన్ లను నిర్మించారు.సెసిల్ బి. డిమిల్.  అడిగాడు 

“హౌ డిడ్ ఇట్ గో?” (“How did it go?”)“Gee, Mr. DeMille! మీకు ఎలా చెప్పాలో మాకు బోధ పడటం లేదు.creation of the world began ఆరంభం ఐంది.కానీ ఆ సమయాన Camera లో రీలు చేయడం మరిచాము.” 

అంటూ వెనక నుండి నివ్వెరపరిచే జవాబు వినిపించినది.డిమిల్లి కోపం వచ్చినా సైరించాడు.అలాంటి ఇబ్బందులు మామూలే!  అసలు అందుకోసమే నాల్గు కెమెరాలనుఅందుబాటులో ఉంచుకుంటూంటాడు అతను.      ఈ పర్యాయం 
ద్వితీయ ఛాయా గ్రాహకుని పిలిచాడు
“How did it go?”మళ్ళీ నిర్ఘాంతపరిచే సమాధానాన్నిఆతని చెవులు రిసీవ్ చేసుకోక తప్పలేదు.“మీకేమని చెప్పాలో అర్థం కావడం లేదు.     ఫిల్ము ను తేవడం  మర్చిపోయాము"  
(“Gee, Mr. DeMille, I don’t know  
     how to tell you this,  but we forgot to bring the film.”)“మీరు ఏమీ తే దల్చుకో లేదు. ఊరికే చతికిలబడటమే చేయగలము.ఐతే అలాగే చేసేయండి.” రోషావేశాలతో విర విరలాడుతూన్న డిమిలీమూడవ కెమెరా వారిని అరుస్తూ ప్రశ్నించాడు.
              “How did it go?”   
“మళ్ళీ మామూలే! వెనుకనుండి స్వరం వినిపించినది, ఐతే ఈ సారి కాస్త భిన్నంగా వినిపించినది.“Gee, Mr. DeMille, 
I don’t know how to tell you this,
but we rolled the camera,నాలుగవ కెమేరా ఆధారం ఇప్పుడు.“ఫిల్ము రీళ్ళన్నీ సవ్యంగానే ఉన్నాయి.కానీ కెమేరా లెన్సుల మూతలను పెట్టడం మరిచిపోయాము”

(we’d forgotten to take the cap off the lens.”)అంతే! రౌద్రావేశాలతో వణికి పోతూ తర్జని చూపుతూ ఎలుగెత్తి అరిచాడు డిమిలీ.అంతే! అటు నిర్మాతలకూ, ఇటు దర్శకునికీ ఒకటే గాభరా!భారీ ఎత్తున చేసుకున్న ఏర్పాట్లూ, 
సమయాభావమూ, వెరసి అందరూ గంతులూ గంతులు. ఐతే DeMille 
అంతే range భారీ ఎత్తున తీసుకున్న ముందు జాగ్రత్తలు ఉండనే ఉన్నాయి కదా!          ముందు జాగ్రత్త చర్యగా – 
నాలుగు కెమేరాలను తెప్పించి ఉంచాడు కదా!ఆ నాలుగో కెమేరా , అప్పటి పరిస్థితి నుండి 
అందరినీ గట్టెక్కించింది.షూటింగు సక్రమంగా జరిగింది.దర్శకునికి ఉండాల్సిన ముందు చూపుకుఈ సంఘటన ఒక  మచ్చు తునుక, మెచ్చు తునక కూడా!

@@@@@@@@@@@@@@@@@@@  by teluguratnaసెసిల్ బి. డి మిల్ ; cecil B. Demille ; May 29, 2011 in X సినిమా రివ్యూ by                             Telugu ratna  (Link for the Essay) 

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...