9, ఏప్రిల్ 2011, శనివారం

గిడుగు రచనలను వెలుగులోనికి తెచ్చిన English శిష్యుడు ;















“నాకు దురదృష్టం కొద్దీ చెవుడు వచ్చింది. లేకుంటే ఇంతకన్నా ఎక్కువ సవర గీతాలను సంపాదించి ఉండే వాడిని కదా!” అంటూ, గిడుగు రామ్మూర్తి పంతులు ఎంతో విచారించారు.నిష్కామ సేవ,త్యాగ నిరతియే జీవన విధానముగామలుచుకున్న మహనీయుల ఆలోచనా విధానాల తీరు తెన్నులు ఇలాగే ఉంటాయి కదా!గిరిజనులైన సవరల జీవితాలను అధ్యయనము చేసిన వ్యక్తి ఆయన. కొత్త సంగతులను తెలుసుకోవడం అంటే ఎంతో శ్రమతో కూడుకున్న వ్యవహారము. అలాంటిది, కారడవులలో నివసించే Tribal life, conventions ను గురించి పరిశీలన చేసిన ఆ మహనీయుడే గిడుగు వేంకట రామ్మూర్తి పంతులు గారు .కళాప్రపూర్ణ గా శ్లాఘించబడిన వ్యక్తి  గిడుగు రామ్మూర్తి పంతులు వ్యావహారిక భాషా ఉద్యమము ప్రచారం చేసి, గిడుగు రామ్మూర్తి పంతులు గారు.నేడు వ్యావహారిక భాష - మన రచనా, విద్యా రంగాలలో ఆచరణలో ఉండటానికి కారణము గిడుగు రామ్మూర్తి పంతులు.జె.ఎ. ఏట్స్(J.A.Yates) అనే ఇంగ్లీష్ ఉద్యోగి తెలుగును, స్థానిక ప్రజల మౌఖిక భాషలను నేర్చుకోవలసిన అవసరం ఏర్పడ్శినది. అప్పుడు గిడుగు “సవరల భాష” ను నేర్చుకోవడానికి నాంది పలికారు.1892 నుండీ గిరిజనుల  భాషల పట్ల ఆసక్తితో అధ్యయనం చేయ మొదలిడినారు.దక్షిణ ముండా భాషా వర్గమునకు చెందినది సవరల భాష. "ఐతరేయ బ్రాహ్మణములో "శబరులు"    అనే మూల పురుషులు కల జాతి వారు వీరు" అని ఋజువులతో నిరూపించారు గిడుగు. వారి అకుంఠిత దీక్షకు ఇవి నిదర్శనాలు.1892 నుండీ గిరిజనుల  భాషల పట్ల ఆసక్తితో అధ్యయనం చేయ మొదలిడినారు.1894 లో Englishలో The Hindu పత్రికలో గిడుగు రామ్మూర్తి గారి "సవర జాతి విశేషములు"  ఉపన్యాస పరంపరలను వ్యాసాలుగా ప్రచురించారు.ప్రభుత్వము తోడ్పాటు లేకపోయినా,రామ్మూర్తి గారు స్వంత డబ్బుతోనే సవరల విద్యాభివృద్ధికై, బడి పెట్టించారు.గిడుగు రామ్మూర్తి పంతులు నిష్కామ పరిశ్రమను ప్రజలు గుర్తించారు.వారి తోడ్పాటుతో , జనులు ఇచ్చిన విరాళాలతో, సవరల బడులకు 1905 - 06 ల నాటికి, అప్పటికి గ్రాంటులతో, ఆ స్కూళ్ళు స్థిరత్వం ఆర్జించాయి.గిడుగు రామమూర్తి పంతులు గారు ఒక కొండ జాతి మనుషుల మాటలను, వాడుక భాషను నేర్చుకోవడంతో  సరిపుచ్చుకొనలేదు, ఎన్నో పాటలను colletion చేసారు.   అంతే కాదు, ఆ 30 పాటల సేకరణలే కాక, గిడుగు తానే స్వయంగా రెండు పాటలను సవర భాషలో రాసి, ట్యూను కూర్చారు కూడా! గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు, తానే స్వయంగా సవర భాషలో - సొంతంగా రాసిన ఆ పాటల భావం మానవీయ విలువలు కలిగినవి." అరణ్యములలో మనుష్యులు, గొడ్డళ్ళతో -   తమని నిష్కారణంగా నేలమట్టం చేస్తున్నారు, అంటూ చెట్లు దుఃఖిస్తున్నాయి.  ఓ మనిషీ!  చెట్టు చేమలు  పశువులకూ, పక్షులకూ, ప్రాణి కోటికీ ఎంతో మేలు చేస్తున్నాయి, తరువులు జీవజాలమనకు చేస్తూన్న ఉపకారములను గుర్తించు."  అంటూ ఆ గేయములో ఉద్బోధించారు.గిడుగు రామ్మూర్తి పంతులు గారి కృషి వెలుగులోనికి రావడానికి కారణమైన వాడు ఒక పాశ్చాత్య దేశస్థుడు, అతని పేరు వాల్ష్ మన్.1908 లో Welshman అటవీశాఖాధికారిగా వచ్చాడు." మీకు తగిన డబ్బును ప్రతిఫలంగా ఇస్తాను;నా బంగళాకు వచ్చి, సవర భాషను నేర్పు"మన్నాడు అతడు.కానీ అప్పటికే, అనేక కార్యక్రమాలతో తలమునకలై ఉన్నగిడుగు రామ మూర్తి  "నేను మీ ఇంటికి వచ్చి, చెప్పే తీరిక లేదు. నాకు పారితోషికము అక్కర్లేదు. శ్రద్ధగా నేర్చుకోవడమే మీరు నాకిచ్చే జీతంగా భావిస్తాను. మా కాలేజీలో మధ్యాహ్న వేళ, విరామ సమయాన మీరు వస్తే , మీకు తప్పకుండా నేర్పిస్తాను"  అని ప్రత్యుత్తరమునిచ్చారు.అలాగ పుల్ల విరుపు మాటలతో జవాబు వస్తుందని ఊహించలేదు వాల్ష్మ్యాన్. " గిడుగు అహంకారి" అని మొదట్లో భావించినా, ఆ తర్వాత అప్పటి    సమంజసమే!" అని అర్ధం చేసుకున్నాడు వాల్ష్మన్.  ఆ ఐరోపా వాసి,  రామ మూర్తి బహుముఖీన ప్రజ్ఞా పాండిత్యాలను గుర్తించి, ఆయనకు వినమ్ర శిష్యునిగా మారాడు.వెల్ష్ మన్ కు 1911 లలో కుమార్తె పుట్టినది. స్వదేశానికి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ వెళ్ళి పోయాడు.వెల్ష్ మన్ "గిడుగు రామ మూర్తి ఎంతో ప్రతిభా పాటవాలను కలిగిన వ్యక్తి. ప్రతి ఫలాపేక్ష ఎరుగని సేవామూర్తి ఆయన.  అలాంటి మేధావిని గుర్తించి, గౌరవించ లేని అలసత్వము అధికారులలో ఉన్నది....... "అంటూ మందలిస్తూ, వివరించాడు వాల్ష్ మాన్.అలాగ ప్రభుత్వం కళ్ళు తెరిపించిన ఉన్నత గుణశాలి ఆ పాశ్చాత్యుడు. జిల్లా కలెక్టరు మెక్ మైఖేల్ ఆతడు మందలించగనే ప్రతిస్పందించాడు. రామ మూర్తి గారు రచించిన వ్రాత ప్రతులను అన్నింటినీ తెప్పించారు. వాటిని చదివించి, విని, అవి ఎంతో అమూల్యమైనవి- అని గ్రహించారు.అలాగ పంతులు గారి అమూల్య గ్రంధాలు కొన్ని పుస్తకములు  ముద్రణా భాగ్యానికి నోచుకున్నాయి.
అవి ->
1) సవర డైలాగ్స్ - 1912
 2) సవర సాంగ్స్ (1913)  
3) సవర రీడర్ (1914)
 4) సవర తెలుగు నిఘంటువు ;   గిడుగు వేంకట రామ్మూర్తి పంతులు గారికి   తెలుగు జాతి కృతజ్ఞతలు శత కోటి!!!!!!!!!! ( Link :- read Another essay here )
 (Emaata - link also)
 


కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...