11, ఏప్రిల్ 2011, సోమవారం

ముగ్గు రేకులలో పదార్ధాలు















                  త్రేతా యుగంలో అరణ్యవాస క్లేశాలను అనుభవించి, లోక కళ్యాణము గావించిన శ్రీరామ చంద్రుడు మరలి వచ్చాడు.ఆ సాకేత పుర వాసి, సీతా దేవి, లక్ష్మణులతో అయోధ్యకు వచ్చాడు.  అయోధ్యా పుర జనులు సౌమిత్రీ, జానకీ సమేత శ్రీరామ చంద్రునికి స్వాగతం  పలికారు.దాశరధి పట్టాభిషేకుడు ఔతున్నాడని - పుర ప్రజలందరికీ ఆనందోత్సాహాల హేల, దీప తోరణాలు వెలిగించారు, రంగ వల్లులను వేసారు.త్రేతా యుగము నుండి, మొదలైన ఈ సాంప్రదాయము, ద్వాపర యుగమున శ్రీ కృష్ణ సత్య భామా విజయ సందర్భముతో "దీపావళి"గా రూపొందిన పర్వముగా పరిఢవిల్లినది. 
ఇక్కడ ఫొటోలో ఉన్నది " విస్తరాకు ముగ్గు ". విస్తరి ముగ్గును, ఎంత పెద్దదానిగానైనా విస్తరిస్తూ వేసుకోవచ్చును.రంగవల్లి ఆకులలో మనకు ఇష్టమైన పేర్లు రాయవచ్చును. అంటే భోజన పదార్ధాలు ఇత్యాదులను చిత్రించ వచ్చును కూడా!ఆ రేకులలో, ఖాద్య పదార్ధాలనే కాక, సందర్భానుసారంగా, రాష్ట్రముల , దేవతల, సంఘ సేవకులు, రాజకీయనాయకులు - ఇత్యాదిగా సందర్భానుసారంగా రాయవచ్చును, చిత్రించవచ్చును.(భూమిపై వేసిన ముగ్గుపై పవిత్ర నామములను రాసేటప్పుడు ఇంగిత జ్ఞానముతో వ్యవహరించాలి.దైవముల నామావళిని రాసేటప్పుడు,కాగితములపై వేసుకుని, గోడపై తగిలించడము మేలైనది, ఉచిత పద్ధతి.
       ఎల్లరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.  

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...