;;;;;
మద్రాసులో (నేటి చెన్నై) నివసిస్తూన్న గృహస్థుడు
స్వామీజీ పట్ల భక్తిని ప్రకటించాడు.
ఆతను ఒక పెయింటింగ్ ను తెచ్చాడు.
ఆ మూడు అడుగుల ఎత్తు కల పటములో –
త్రిమూర్తులు ఉన్నారు;
అది సరే! కానీ .........
చిత్రణా విధానము వేరు.................!!!!!!!!!!!!1
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు
శ్రీ మలయాళ స్వామీజీ వారి పైన పూలను చల్లుతున్నారు !!!!!!
ఆశ్రమంలో సమర్పించిన తైల వర్ణ చిత్రాన్ని
మరు నాడు గురు దేవులు తిలకించారు.
అలాగ త్రిమూర్తులు తన మీద పూల వానను కురిపిస్తూన్నట్ట్లు వేసిన
painting ను చూడగనే – మనసు చివుక్కుమన్నది.
ఆహూతులకు ప్రబోధము చేసే సమయాన –
ఆ చిత్ర లేఖనమును తెప్పించారు.
“ఆహా! ఎంత బాగున్నది! ఎంత సుందరముగా కుదిరినది!”
అని మెచ్చుకుంటూనే, సభికులలోని కొందరిని చేరువకు పిలిచారు.
“ఫ్రేమును ఊడ దీయండి.” అని అడిగారు.
వారు కించిత్తు ఆశ్చర్యముతో అట్లే చేసినారు.
అటు పిమ్మట స్వామీజీ వారు –
ఆ చిత్రణా వస్త్రమును చీలికలు పేలికలు చేసారు.
ఆ చర్యతో సర్వ జనులూ నిర్ఘాంత పోయారు.
“ వీనిని తామర కొలను లో కలిపి రమ్మని” పలికారు.
స్వామీజీ వారి ఆనతిని విని శిష్యులు,భక్తులూ
అందరూ నివ్వెఱ పడినారు.
ఆడంబరములకూ, అసత్యములకూ, అతిశయోక్తులకూ –
ఏ మాత్రమున్నూ అవకాశము కల్పించకండి.
నాలో లేని వాటిని పరికల్పన చేసి చెబ్తున్నారేమిటి?
~ అలా చేసినచో ఉన్నది ఊడిపోవుటయే కాక రానున్నది కూడ రాక పోవును.~
నాకు త్రిమూర్తులు ప్రత్యక్షం అవడాన్ని వాళ్ళు ఎవరైనా చూసి ఉన్నారా?
ఇలాంటి కల్పిత చేష్ఠల చేతను, అసత్య వచనముల వలనను
బ్రహ్మ విద్య పతనము అగును - ఇది మరువ వలదు.”
శ్రీ మలయాళ స్వామి, తనను తాను భగవంతునిలాగా ప్రకటిస్తూ,
ప్రచారం చేసుకోబడటానికి ఇష్ట పడ లేదు.
ఆయన ప్రజలలోని దైవత్వ భావనలను మరల ఉద్భిల్లజేసారు.
మొలకలెత్తించిన దైవీ భావనలను పునాదిగా చేసి
ఆదర్శ సమాజ రూపకల్పన సుసాధ్యం చేసారు.
MOre story (Link )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి