శ్రీవారి సేవలో ప్రతి అంశమూ నిత్య నూతనమే! ఆసక్తిదాయకమే!
గర్భ గృహము, స్వామి వారి శయన మందిరముల మధ్య ఉన్నది"కుల శేఖర పడి". తిరుమలేశునికి ప్రతి శుక్రవారము అభిషేకములు చేస్తారు.
శుద్ధి పరచిన కర్పూరము, పసుపు ముద్దలను కలిపిన జలములను బయటే తయారు చేసి రజత కలశాలలో నింపి తీసుకుని వస్తారు. గర్భగుడికి తీసుకుని వచ్చి ఆ మధుర సన్నివేశాన్ని ప్రకటిస్తారు.
"ఇందిరా నిజ మందిరా!"
"హరి అంతరంగ శ్రీ లక్ష్మీ దేవి"
శయనవేళలలోన భోగ శ్రీనివాసునిగా భక్తుల హృదయారవిందములలో కొలువు దీరుతాడు శ్రీ వేంకట రమణుడు.
అందువలననే, భోగ శ్రీనివాసుని అలంకార సేవా విశేషములలో విశేషముగా ఎన్న దగినది శ్రీ గంధ సేవ.
ఆ భోగ శ్రీనివాసుని హృదయ భాగములో "శ్రీ గంధము రూపులో" లక్ష్మీదేవి కొలువు ఉన్నది.
"హృదయ లక్ష్మీ దేవికి గంధము"ను అద్దుతారు. ఆ గంధపు ముద్ద యొక్క పరిమాణములో సగము భాగమును పద్మావతీదేవికి అలదుతారు.
ఇలాగే శ్రీ వారి పాద కవచములను పునుగు నూనెను పూసి, వస్త్రముతో తుడుస్తారు.
ఇలాగే శ్రీ వారి పాద కవచములను పునుగు నూనెను పూసి, వస్త్రముతో తుడుస్తారు.
ఈ వస్త్రమునే "శ్రీ పాద వస్త్రము"అని పిలుస్తారు."విశ్వ రూప సేవ"లో భక్తుల కళ్ళకు అద్దించి నుదుటికి తాకిస్తారు.
శ్రీ సప్త గిరీశ, శ్రీ వేంకటేశుని సేవలో వినియోగించిన వస్తు సంభారాలను స్పర్శించిన భక్తులకు లభించే పవిత్ర భక్తి భావనా తాదాత్మ్యతల విలువలు తులతూచ లేనివే కదా!
(See my articles);
1 కామెంట్:
ప్రతి శుక్రవారం అభిషేక సమయంలో వెంకటేశ్వరస్వామివారి మూలమూర్తికి 84 తులాల పచ్చకర్పూరం,36 తులాల కుంకుమపువ్వు,1 తులం కస్తూరి, 1.5 తులం పునుగు తైలం,24 తులాల పసుపుపొడి మున్నగు పరిమళ ద్రవ్యాలు ఉపయోగిస్తారు. శ్రీస్వామివారికి శిరస్సు మొదలు ఈ ద్రవ్యాలతో అభిషేకం చేయగా వచ్చే తీర్థాన్ని ’పులికాపు తీర్థం’ అంటారు. అభిషేక ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులమీద ఈ శ్రీపాదతీర్థాన్ని సంప్రోక్షిస్తారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి