1965 ల నుండి ఆకాశవాణి(అదేనండీ! రేడియో)లో భారత, భాగవత, రామాయణములను తెలుగులో వ్యాఖ్యానములను విపులముగా, వివరంగా చెప్పేవారు. అలాగే శ్రోతల కోసం "ప్రశ్నోత్తరములు" శీర్షిక సర్వ జనానురంజకముగా ఉండేది. విలక్షణ కంఠముతో పాప్యులారిటీని సముపార్జించారు, ఆయనే "ఉషశ్రీ".మిమిక్రీ కళాకారుల ఐటమ్ లలో ఆయన గాత్రము, శైలి, ఉచ్ఛారణ ఉండేవంటే ఉషశ్రీ కంఠములోని వైవిధ్యత ఎంతగా ప్రజలను ఆకట్టుకున్నదో గ్రహించ వచ్చును.
విజయవాడలో రేడియో కేంద్రములో ఉన్న రోజులలో ఒక వింత సంఘటన జరిగింది. పనిలో తల దూర్చారంటే, ఉషశ్రీకి బయటి ప్రపంచము తెలిసేది కాదు. సాహిత్యాభిలాష మిక్కుటము కాబట్టి పరిసరాల గురించి ఉషశ్రీకి ఆట్టే పట్టేది కాదు.
ఒకతను రేడియో స్టేషనులో కాంట్రాక్టు ఉద్యోగము కోసము ఆశతో ప్రయత్నము చేసుకుంటున్నాడు. ఉషశ్రీ పని ఒత్తిడితో సతమతమౌతూన్నారు.
ఉషశ్రీ రికమెండేషనుకై ఆతడు ప్రయత్నం చేయసాగాడు. ఐతే కార్య భారము వలన ఒకింత విసుగ్గా ఉన్నారు ఉషశ్రీ. తన ఎదుట కొత్త మనిషి నిలబడి ఉన్నాడనే స్పృహ కూడా లేకుండింది. అటూ ఇటూ పరిగెత్తుతూన్నపుడు, రవ్వంత అతను గోచరించాడు
.
"ఏం కావాలి? నాయనా!"
"తమరేది ఇప్పించినా సరే!" - చేతులు నులుముకుంటూ అన్నాడు అతడు.
వెంటనే ఆఫీసు కుర్రాణ్ణి పిలిచి "వీరికి టీ ఇచ్చి పంపించు" అనేసి తిరిగి తన పనిలోతల మునకలయ్యారు ఉషశ్రీ.
18, ఆగస్టు 2009, మంగళవారం
ఏం కావాలి? నాయనా !
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ." ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
3 కామెంట్‌లు:
:) Template చాలా బాగుంది పైన header దగ్గర blogger గుర్తు సగం కనిపించకుండా చేస్తే బాగుంటుంది.
మీ సూచనలన ప్రకారము - నా కోణ మానిని -బ్లాగు డెజైనులో కొన్ని మర్పులు చేసే ప్రయత్నము చేస్తున్నాను.
థాంక్యూ విజయ మోహన్ గారూ!
Thank you,
భాస్కర రామి రెడ్డి గారూ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి