ఒక సభా వేదిక మీద ప్రముఖులు ఆసీనులై ఉన్నారు. ఆహ్వానితులలో పట్టాభి సీతారామయ్య, సి.పి.భట్ ఉన్నారు.
ప్రత్యేక అతిథిగా వచ్చిన C.P. Bhat వక్త. భట్టు గారు ఉపన్యసిస్తూ,"భోగ రాజు పట్టాభిరామయ్య ధర్మ గుణములో ధర్మ రాజు, త్యాగములో త్యాగరాజును మించిన మహోన్నత శీలుడు,....."అంటూ ఇలాగ పట్టాభి గొప్పదనాన్ని గురించి చాలా చాలా పొగిడాడు. ఈ పద్ధతిలో సాగిన ఆయన వాక్కులు యావత్తూ సీతారామయ్య గూర్చిన ప్రశంసా వాక్యాలతోనే నిండి పోయినాయి.
తదుపరి,సన్మాన గ్రహీత అయిన పట్టాభి సీత రామయ్య ప్రసంగిస్తూ ఇలా పలికారు.
"...నా సంగతేమో గానీ, ఇవాళ వారి మెప్పు ల వలన నేను ఆనందములో తడిసి, తరించి పోయాను. నా మీద అమిత అభిమానంతో, "భట్"గారు,"రాజు"లాగా నన్ను పొగిడారు."
పూర్వ కాలంలో చక్రవర్తులను, సామ్రాట్టులను పొగిడే వృత్తిలతో భట్రాజులు,
వందిమాగధులు మున్నగువారు ఉండేవారు.
"భట్రాజీయం"లోని శ్లేష అర్ధమైన సభికుల నవ్వులతో ఆవరణ కోలాహలంగా మారినది.
(kadambari piduri,
read my articles,songs for kids in ;
july,29,2009)
2 కామెంట్‌లు:
you can see many of like this here.
http://www.maganti.org/migadatarakaluindex.html
Aruna
భాషకు సంబంధించిన హాస్య,చమత్కారములు,హృదయాహ్లాదకారకములే!ఆ దిశలో,భాషా గని నుండి అగణిత సంఘటనలు మనకు లభిస్తూనే ఉంటాయి.ఆ రత్నాలను,తుడిచి,మసక బారనీయకుండా,మరల మరల,అందరికీ మానస సీమలలో దృశ్యమానం చేయడమే,ఈ పౌనః పౌన్యత వలన లభించే ప్రయోజనం.
"మీగడ తరకలు"ను గమనించలేదు గానీ,maaganti.blog nu చదువుతూ ఉంటాను.ఆంధ్ర భాషకు వారి సేవ గొప్పది,అద్భుతమైనది.(బాల సాహిత్యమును ఎక్కువగా గమనిస్తూ ఉంటాను.)
ఆ యా భాషల అభివృద్ధిని బట్టి,ఈ కోణములో,సారస్వతము పురోగతి అగుపిస్తూ ఉంటుంది.ఈ విషయంలో,తెలుగు మన మాతృ భాష అయినందుకు,మనము గర్వ పడ వలసినదే!
కామెంట్‌ను పోస్ట్ చేయండి