20, జనవరి 2011, గురువారం

ఫిఫ్టీ శుభ శకునములు


















భారతీయ సమాజములోను, ప్రపంచములోని అనేక
సంఘాలలోనూ
ప్రజలు తాము చేస్తూన్న పనులు సక్సెస్ అవాలనీ ఆశిస్తారు.
అందుకు భగవంతుని అనుగ్రహాన్ని అభిలషిస్తారు .
అయితే తాము ఆరంభించిన వ్యాపారము,ఉద్యోగమూ,
గృహ నిర్మాణములు, ఇంటిలోని బాధ్యతలనూ
సక్రమ పద్ధతిలో పూ ర్తి చేయడానికి కొంత మనో బలము అవసరము అవుతుంది.
అలాంటి ఆత్మ స్థైర్యాన్ని అలరచుకునే ప్రక్రియలో
అంతర్భాగాలుగా జ్యోతిష్యము, శకునములు, శుభ లగ్నములు,
వారములు,వర్జ్యములు,తిథులు మున్నగు వాటిని నమ్మకములుగా ఏర్పరచుకుంటారు.
"సూర్యుని కాంతితో సమానమైనవి కాదు గానీ"
వీటిని కారు చీకటిలో చేతిలో ఉంచుకోదగిన టార్చి లైటుల వంటివి అని గుర్తించ వచ్చును.
వానినే “మాంగల్య పంచావత్తు “ అని పిలుస్తారు.
జనులు ప్రారంభించిన పనులలోను, చేస్తూన్న కార్యాలలోనూ,
ప్రయాణాలలోనూ అప్రయత్నముగా
ఈ శకున వస్తు సామగ్రి ఎదురైతే విజయం సిద్ధిస్తుంది.
నేటి ఆధునిక కాలములో ,వీనినే వినూత్న స్వరూపాలలో ఆపాదించుకుని, ఆవిష్కరించుకొన వచ్చును.
ఉదాహరణకు , టెలి విజను ప్రోగ్రాములలో ఆ యా వస్తు సముదాయాలు అగుపిస్తే , శుభ యోగంగా అనుకో వచ్చును.
అదే ఫక్కీలో ప్రయత్న పూర్వకంగా , ముందరే శుభ దృశ్యాలను ఏర్పాటు చేసు కోవాలి.
అందు వలన కొంత మనో నిబ్బరం కలుగుతుంది.దాని ద్వారా ఆరంభించిన పనులలో జయం లభిస్తుంది.
హిందువులకు విద్యాధి దేవత శ్రీ సరస్వతీ దేవి.
శ్రీ వాణీ దేవి హస్త యుగ్మములో అలంకృతమై అలరారు వాయిద్య రాజమే “ కచ్ఛపీ వీణ”.
సంగీత పరికరాలకు ఆది రూపిణి “ వీణియ”యే! ఇన్నేసి మంచి కారణాలు ఉన్నాయి కదా;
కాబట్టి ఈ పాటికే పాఠక మహాశయులు గ్రహించే ఉంటారు; “ వర వీణా పాణి ఐన శ్రీ శారదా దేవి వాయించే వీణ ,
మనకు ఎదురైతే, ఆటోమాటిక్ గా శుభ దాయినియే కదా!
ఇక మాంగళ్య పంచాశత్త్తు వర్గములో చేరిన అంశాలను పరికిద్దాము.



















1) వీణ ; 2) సంస్కృత వాఙ్మయము 3) పుష్పములు ; 4) అలంకరణ సామగ్రి ; 5) తేనె ; 6)కాటుక ;
7) గోరోజనము ; 8) ఆవు ; 9) ఆవు పేడ ; 10) శంఖము ;
11)చందనము ; 12) అక్షింతలు ; 13) నెయ్యి ; 14) పెరుగు ; 15) పచ్చని గడ్డి ;
16) నిండు కుండ ; 17) భోజనముతో నిండిన పాత్ర ( అనగా క్యారియరు వగైరాలు ) : 18) వడ్డించిన విస్తరి ;19) తాంబూలము ;
20) వాహనము ; 21) ఆసనము ; 22) కొత్త దుస్తులు/ వస్త్రములు ; 23) విసన కర్ర ; 24) జెండా ; 25) గొడుగు ; 26)పానకము ; 27) తెల్లని పూలు/ తెల్లని ధాన్యములు, ధాన్యాలు ; 28) తాజా కూర గాయలు ;
28) తాజా కూర గాయలు ; 29) రావి, మఱ్ఱి , అత్తి , వనస్పతి మున్నగునవి;
30) ఏనుగు ; అద్దము 31)గొఱ్ఱె ; 32) పళ్ళు, ఫలహారాలతో నిండిన బుట్ట, సంచీల వంటివి ; 33) రేగటి మన్ను ముద్ద ; 34) శుభ్రమైన శయ్య ; 34) పీఠము ;35) ఆహారము ఎట్సెట్రాలను రింటూన్న వారు ; 36)కాంచనము = బంగారము ; 37) రజతము = వెండి 38) రాగి వస్తువులు ; 39) రత్నములు ;
40) పట్టు బట్టలు ; 41)చామరములు ; 42) చెరకు ; 43) మేళములు = మంగ వాద్యాలు ; 44)నీళ్ళ గ్లాసు, పాల చెంబు మొదలైనవి ; 45) వెలుగుచున్న అగ్ని ; 46) కల్లు ( ఇది విచిత్రమే! కానీ అల నాడు సోమ రసముతో సమానముగా తలిచే వారు ; కావున “కల్లు”ను కూడా మంచి శకునాల లిస్టులోనికి చేర్చేసి ఉండ వచ్చును.) ; 47) కత్తి, చాకు మున్నగునవి ; . ( కానీ ఎక్సెప్షను ఉన్నది,అది ‘మంగలి కత్తి’ తటస్థ పడ రాదు,అది మాత్రం చెడ్డది. ) ; 48)మాంసము ; (ప్చ్! ఈ వ్యాస రచనా కర్తకు మాత్రం ,దీనిని – శుభ శకునాల లోనికి చేర్చేసేయుట నచ్చ లేదు.) ;
49) పుత్రులతో స్త్రీ, కన్యకా, దంపతులు 50) గుంజకు కట్టిన పశువు .
చూశారు కదా!
మంచి దృశ్య హారములు మన మనసులకు ప్రశాంతతను చేకూరుస్తాయి.
శాంత చిత్తముతో మొదలెట్టిన పనులను దిగ్విజయ భావనతో కొన సాగించ గలుగుతారు.
మనో ధర్మ శాస్తము ( = సైకాలజీ ) ప్రకారము స్వాస్థ్యము కలిగిన మనసుతోనే
నిత్య దైనందిక కార్య క్రమములను మనిషి పూర్తి చేయ గలుగుతాడు.
అనుభవజ్ఞులు ,తత్వ వేత్తలు,జీవిత సరాన్ని కాచి వడబోసిన బుధ జనులు సర్వులకు ఉద్బోధిస్తూన్న బోధనల సారాంశములు ఇవియే కదా!
మానవుని స్వభావములోని మౌలికముగా అంతర్లీనంగా ఉన్న ఫీలింగ్సును, మన దేశీయ లాక్షణిక వేత్తలు "నవ రసములు"గా విభాగించారు.
అలాంటి వింగడింపులలో, లాస, హాస,దరహాసములను మనిషి అధరాల పైన విర బూయించ గల సామర్ధ్యము ఉన్నటువంటి భావ జాలములకు పునాదుల వంటివి శృంగారము , హాస్యము,శాంత రసములు. మన పరిసరాలు అనురాగము, మమత, ప్రేమ , ఆనందములతో నింప బడి ఉండాలి.
అలాంటి వాతావరణము వలన ఎల్లరి హృదయాలు ఆహ్లాదముతో విర బూసే శత దళ పద్మములుగా విలసిల్లుతాయి. మన పూర్వీకులు తాము కని పెట్టినట్టి "ఈ జీవిత రహస్యాలను నాటకములలో, ఇతిహాస , కావ్యాదులలో అంతస్సూత్రాలుగా ఉండ వలెనని " నిబంధనలను విధించారు.$$$$$$
కావ్యాలను సుఖాంతములుగా (= కామెడీ comedy )ఉండేలా రాయవలెనని లాక్షణికులు నిబంధించారు.
ప్రాచీన కాలము నుండి పెద్దలు, వ్యక్తి/ వ్యక్తుల నిత్య ప్రవర్తనలను లోతుగా పరిశీలించారు.
ప్రతి క్షణాన్నీ సంతోష మయంగా చేసుకుంటూ ,
ప్రజానీకం తమ కర్తవ్యములను సంపూర్ణ విజయ వంతముగా ఒనరించుకోగలగాలని ఆర్యులు అభిలషించారు.
అందుకు అవసరమైన విధి విధానాలను ఆచార వ్యవహారములలో అనుసంధించారు.
ఆ అనుక్రమణిక పట్టికలలోని ఒకానొక విభాగమే "శకునములు".
కానీ మూఢంగా అనుసరించ నక్కర లేదు.
ఆలోచనలన్నీ మూఢ నమ్మకముల మయముగా అయిపోతే,
అప్పుడు ఆచరణలు కూడా అసంబద్ధముగా పరిణమిస్తాయి.
అలాంటప్పుడు జీవితములు రసాభాసగా మారి పోయి, ఆస్వాదనా యోగ్యములు కాకుండా పోతాయి.
కాబట్టి, వీలైనంత వఱకూ, వీలు కుదిరినంత దాకా, మన మానసికోల్లాస రూప కర్తలుగా,
" శుభ శకునములను" ఆచరణకు అందు బాటులో ఉంచుకోవాలి.
వీనిని వీలైనంత వఱకు పాటించ వచ్చు; అంతే కానీ, పిల్లి ఎదురైందని ఆగితే,
స్టేషన్లో ఎక్కవల్సిన రైలు కాస్తా జీవిత కాలం లేటు అవుతుంది సుమండీ!

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Gunjaki kattina pasuvu repeated .. :)

kadambari చెప్పారు...

Thank you for your suggetion.
Please, read the Essay now( after the corrections , suggested by you).

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...