14, డిసెంబర్ 2010, మంగళవారం

పెన్సిల్ సిత్రాలు


"I am God’s pencil.
A tiny bit of pencil with
which he writes what he likes.
God writes through us,
and however imperfect instruments we may be,
he writes beautifully."
_ Mother Teresa in
"My Life for the Poor"
ఈ అందమైన ప్రబోధాత్మక వాక్కులు చెప్పిన
మహనీయులు ఎవరో మీకు తెలుసా?
ఔను, ఆ స్త్రీ మూర్తి "జనని థెరీసా".
మదర్ థెరెసా గురించి పరిచయం చేయడమంటే,
సూర్యుని దివిటీ వేసి చూపడమే కదా!

And now, see and enjoy the Modern pencil sculpture.

12, డిసెంబర్ 2010, ఆదివారం

హులా హూప్స్! హైలెస్సా!


"హులా హూప్స్" ఈ పేరు మన "హైలెస్సా!హైలెస్సా!" అనే
పడవ నడిపే నావికుల ఊత పదం లాగా వినబడ్తూన్నది కదూ!
"హుల హూప్స్" అనేది ఒక ఆట వస్తువు. ఇది క్రీడగా ఆరంభమై,
నేడు ఒబెసిటీని అదుపు చేసే విన్యాసంగా ఆ బాల గోపాలాన్నీ ఆకట్టుకొంటూన్నది.
నడుము చుట్టూ చక్రాన్ని తిప్పుకొంటూండే
ఈ హులా హుప్స్ నయన పర్వం చేస్తుంది.
ఇది ఈ నాడు డాన్సు & ఎక్సర్సైజ్ గా ప్రపంచ ఆదరణ పొందుతూన్నది.
అతి ప్రాచీన కాలం నుండీ హులా హుప్ సరదా ఆటగా మానవులచే ఆచరించబడసాగినది.
మొదట (Hula hoops"willow, rattan (a flexible and strong vine),
grapevines and stiff grasses) ప్రకృతిలో లభించే లతలు,
ద్రాక్షా తీగలు, గట్టిగా పేనిన గడ్డి వెంట్లు, veduru మొదలగు వాటితో
చక్రంలాగా తయారు చేసుకునే వాళ్ళు.
నేడు తరచుగా ప్లాస్టిక్ ట్యూబులను (plastic tubing)ఉపయోగములో ఉన్నవి.
బాల బాలికలకూ వాడే హూలాలు
ఇంచుమించు 28 ఇంచ్ లు వ్యాసార్ధముతో ఉంటూన్నాయి.
పెద్దలు వాడే ప్లాస్టిక్ చక్రాలు దాదాపు పెద్దలు వాడే ప్లాస్టిక్ చక్రాలు
దాదాపు 40 inches వ్యాసము కొలత కలిగి ఉంటూన్నాయి.
( approximately 28 inches in diameter,
and those for adults around 40 inches )
"Hula hoop day ని సమాన సంఖ్యా కాల మానాన్ని ఎంచుకుని,
పండగలాగా ఔత్సాహికులు చేసుకుంటూన్నారు.
2007 వ సంవత్సరము నుండీ ఈ సంబరాలు మొదలైనాయి.
"Hula hoop day ని సమాన సంఖ్యా కాల మానాన్ని ఎంచుకుని,
పండగలాగా ఔత్సాహికులు చేసుకుంటూన్నారు
2007-07-07 నుండీ అన్ని నగరాలలోనూ, దేశాలలోనూ
ఈ ఆనవాయితీ కొనసాగుతూన్నది.
హులా హూప్స్ ను కొనలేని బీద పిల్లలకు,
donations, చందాలు వసూలు తో కొని అందజేస్తూంటారు.
.2012- 12- 12 వఱకూ వీటిని ఉచితంగా బీదసాదలకు అందించి,
అందరినీ ఉత్సాహపరిచి, మలిచే ప్రక్రియ కొనసాగాలని నిర్వాహకుల తలపు.
2006 సంవత్సరం నుండి"ప్రపంచ హూప్ దినోత్సవము" డాన్సుగానూ,
వ్యాయామముగానూ ఊపు అందుకున్నది.
ఆన్నీ ఓ' కీఫీ , ఆమె భర్త కెవిన్,
స్నేహితులు గ్రూవ్ హోప్,స్టీఫన్ పిల్డెస్
మొదలైన వాళ్ళు లాభాపేక్ష లేకుండా హులా హూప్స్ ని
ఉద్యమంగా ప్రజలకు చేరువ చేసే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టి,
(Founded by Annie O'Keeffe, husband Kevin,
and Groove Hoop friend Stefan Pildes
World Hoop Day is a sponsored project of MarinLink.) సఫలీకృతులు ఔతున్నారు.
ఇది అతి ప్రాచీన క్రీడ,1958 లో హులా హూప్సాట లోకానికి పరిచయం ఐనది.
ఆస్ట్రేలియన్ మిత్రుని ద్వారా విని, బోధ పరుచుకున్న వ్యక్తులకు ఇది నచ్చినది.
వ్హాం-ఓ కంపెనీ స్థాపకులు రిచర్డ్ నేర్, ఆర్థర్ మెలిన్ లు
"వెదురు బద్దలతో గుండ్రంగా మెలిపి చేసిన చక్ర పరికరాన్ని గురించి తెలుసుకున్నారు.
(“re-invented” by an American company
called Wham-O founded by Richard Knerr and Arthur Melin in 1958.)
kneer యొక్క కుమార్తె లోరీ గ్రెగరీ (Lori Gregory)
తన ఆర్టికల్ ( "Once the hippest toy around, Hula Hoop turns 50") లో
"My father always believed the more simple a toy was,
the better it was”. అని, వివరించింది.
Wham-Oఈ హూప్ ఆటపై paTent ను గడించలేదు గానీ,
Hula Hoop" పేరు అనుకోకుండా వారి హక్కు పేటెంట్ ఐనది.
యువత యొక్క స్వేచ్ఛకు symbol గా
హులా హూప్ ప్రాచుర్యంలోనికి వచ్చినది.
Southern California స్కూల్ ప్లే గ్రౌండ్సులోనూ,
చుట్టుపక్కల అడుగిడిన ఈ వస్తు వినిమయం
అతి శీఘ్రంగా ప్రజా జీవన కార్యక్రమాల అంతర్భాగమైనది
.Richard Johnson, author of American Fads
(Beech Tree Books, 1985) wrote
"No sensation has ever swept the country like the Hula Hoop."
మొట్ట మొదటి నాలుగు నెలల్లో 25 మిలియన్ యూనిట్సు విక్రయాలు జరిగాయి.
ఈ ఆట దేహ సౌందర్యానికీ అందుబాటులో ఉన్న సులభ సాధనము
కాబట్టే 1958 లో 100 million అమ్మకములు జరిగాయి.
a report titled "Hula Hoops Swivel Their Way to 50",
filed by AP on June 18 2008 .
పాశ్చాత్య ప్రపంచాన్ని , కెనడా ,
Europe, Australia ఖండాలలో 1960 లలో
విపరీతమన ఆదరణ పొందింది.
ఇంతగా Instant Craze ను సంపాదించిన
రికార్డు బహుశా ఈ హులా హూప్స్ ఆటదేనేమో!!
Lori Gregory, Knerr's daughter,
is quoted in an article titled
"Once the hippest toy around,
Hula Hoop turns 50" in the
"Chicago Tribune" of June 18 as saying
"My father always believed the more simple a toy was,
the better it was”.
అన్నట్టు హూల పాటలు , వీడియోలు కూడా ఉన్నాయి.
ఐతే ఓ.కే!
"హులా హూప్స్
హోలరె హోలరె హోలారే!
హుప్ హుప్ హూప్స్
హైలెస్సా! హైలెస్సా!
Hula Hup !Hula Hup!
హిప్ హిప్ హుర్రే!
హిప్ హిప్ హుర్రే!

6, డిసెంబర్ 2010, సోమవారం

అమ్మరో! యశోదమ్మా!


ఈ వెన్నెల తోటలలో విన వచ్చే ఊసులేవో?
ఈ వన్నెల వీవనగా మొయిళుల ఊహలు ఏమో?

ముద్దు గుమ్మడు బాలుడు
మురిపాల క్రిష్ణుడు
తొంగి చూచు చున్నాడే,
తల్లీ! ఓ యశోదమ్మా!

నవనీతము గోరుముద్ద
ఇంత చాలు, నీవిస్తే.....
కొన గోటను గోవర్ధన గిరిని నిలుపు
అగును తాను!
వీరాధి వీరుడే అగును తాను
!
అమ్మరో! యశోదమ్మా! ;;;;;;;

5, డిసెంబర్ 2010, ఆదివారం

pencils అమర్చిన కళా వైభవ్


ఆశ్చర్యము కదా, ఈ నైపుణ్యములు!!!
పెన్సిళ్ళను జాగ్రత్తగా అమర్చిన ప్రజ్ఞ !!!
pencils కూర్పులతో సాధించిన
ఈ ఆధునిక కళా ప్రపంచానికి సరి కొత్త జిజ్ఞాసలు, ఆసక్తులున్నూ.
ఔరా! కాదేదీ కళలకు అనర్హములు!

4, డిసెంబర్ 2010, శనివారం

2, డిసెంబర్ 2010, గురువారం

శ్రీ సీతా రాముల కళ్యాణము & Koranjiilu


















శ్రీ సీతా రాముల కళ్యాణము ;
చైత్ర మాసములో, శుక్ల పక్ష నవమి నాడు,
పునర్వసు నక్షత్రంలో శ్రీ విష్ణు మూర్తి భువిపై శ్రీ రామ చంద్రుని గా జన్మించాడు.
కనుక చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీ రాముని పూజించాలి అని అగస్త్య సంహిత చెప్పింది.
ఆ రోజు మధ్యాహ్న"కాల వ్యాపిని" గా ఉండాలని ధర్మ శాస్త్రాలలొ చెప్పారు.
చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకూ ,
తొమ్మిది రోజులు “శ్రీ రామ నవమి ఉత్సవ ములను”
భారత దేశంలో ప్రజలు జరుపుకుంటారు.
మన ఆంధ్ర దేశంలో నవమి నాడు మాత్రమే కాకుండా,
ఎప్పుడూ శ్రీ సీతా రాముల కళ్యాణమును వేడుకగా చేసుకుంటూంటారు.
భద్రా చలం లో “పాంచ రాత్రాగమము”ను అనుసరించి,
పూజాదికములను నిర్వహిస్తారు.
@) కళ్యాణానికి సంకల్పం చెప్పి, ఆరంభిస్తారు.
(ఇతర సందర్భాలలో ఐతే వినాయక స్వామి పూజను చేయుట స్మార్త పద్ధతి)
@)భద్రాద్రిలో సంకల్పం చెప్పిన తర్వాత “విశ్వక్సేన పూజను” చేస్తారు.
@) పిమ్మట కళ్యాణ కర్తలకూ, కళ్యాణ వస్తువులకూ,
ఆ ప్రదేశానికీ పవిత్రతను కల్పించుటకై “పుణ్యాహ వచనం” చేస్తారు.
@)ఉత్సవ మూర్తులను గొని వస్తారు.
@)వధువు జానకీ దేవిని వరుడు దాశరధికి ఇచ్చి పెళ్ళి చేయుటకు “సంకల్పం చెబుతారు”.
@)యోక్త్రము ను తయారు చేసి ఉంచుతారు. ఈ యోక్త్రము 24 అంగుళాల నిడివి ఉంటుంది.
24 దర్భలతో సిద్ధంచేసి ఉంచిన ఈ యోక్త్రం న్ని పూజిస్తారు.
కన్య నాభి వద్ద – ఉల్ముకుడు అనే రాక్షసుడు – ఉంటాడు,
వానిని వధించడం కోసం జరిగేదే యోక్త్ర ధారణము.
అరిష్ట నివారణం కోసం ఈ తతంగం జరుగుతుంది.
యోక్త్రమును అమ్మ వారికి ధరింప జేస్తారు.
@) ఇలాగే రక్షార్ధమై కంకణ పూజ తో పవిత్రం చేసిన
“రక్షా బంధనము ను ధరింప” జేస్తారు.
@) ఇక్కడ వరుని కార్యక్రమములు నిర్వహించవలసి ఉంటుంది.
ఉపనయనము మాత్రమే జరిగి, బ్రహ్మచర్యాశ్రము పాటిస్తూన్నాడు అబ్బాయి.
మరి అతణ్ణి గృహస్థాశ్రమానికి తయారు చేయాలి కదా!!!
ఉపనయనము మాత్రమే జరిగి ఉన్న వరునికి, మళ్ళీ జంధ్యం వేయాలి.
ద్వితీయ యజ్ఞోపవీతమును ప్రసాదించేదే గృహస్థాశ్రమ అర్హత.
గార్హస్థ్యాశ్రమ నిర్వహణకు యువకుని, మానసికంగా సిద్ధం పరచ గలిగేదే ఈ ఆచారం.
శ్రీ రాఘవునికి సువర్ణ యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు.
@ “కోరంజీలు” -> వీరు ఎనిమిది మంది బ్రాహ్మణుల గ్రూపు.
ఈ కోరంజీలకు తాంబూల, దక్షిణలను ఇస్తారు.
తర్వాత వారు కన్యా దాత వద్దకు వెళతారు.
@) మూడు సార్లు వీరు “ప్రవరలు చెబుతారు”.
అనగా, మొదట “గోత్రమును” చెబుతారు.
అటు పిదప ఆ ఇరువురి గోత్రీకుల వంశస్థులలోని
ముఖ్యుల యొక్క, ప్రముఖుల యొక్క,
పేరు పొందిన వ్యక్తుల వివరాలను వివరిస్తారు.
వధూ వరుల వంశములయొక్క వివరాలను
ఇరు వర్గాల వారికీ, అతిథులకూ తెలియ జేయడమే ఈ ఆచారంలోని ప్రముఖ ఉద్దేశ్యం.
పరస్పరమూ కొత్త – కాబట్టి ఈ పరిచయ వేదిక గా ఈ ఆచారం సమన్వయం చేస్తున్నది.
@) భద్రాచలంలో “రామ నారాయణుడు” అనీ,
“సీతా లక్ష్మి” అనీ వ్యవహరిస్తారు.
అందు చేత, ఇచ్చట మూడు తరాల ప్రముఖులనూ పేర్కొను పద్ధతి
కాస్త విభిన్నంగా ఉంటుంది.
ఆంధ్ర దేశములోని మన భద్రాచలంలో
“ శ్రీ రామ చంద్రుడు అచ్యుత గోత్రోద్భవుడు,
పర బ్రహ్మ ముని మనుమడు,
వ్యూహ నారాయణుని మనుమడు
విభవ వాసు దేవుని పుత్రుడు ......... “ అంటూ వివరణలను వక్కాణిస్తారు.
అదే రీతిగా “సీతా మహా లక్ష్మీ అమ్మ వారి వివరాలు
ప్రేక్షకులకు లభించే వినూత్న వరాలు!
“చతుర్వేదాధ్యాయిని,
సౌభాగ్య విశ్వంభరి,
సౌభాగ్య గోత్రోద్భవి,
విశ్వంభర శర్మ ముని మనుమరాలు,
రత్నాకర పౌత్రి, కీరార్ణవ శర్మ పుత్రి “
అలాగ ఒక విచిత్ర జగత్తు మనకు పరిచయం ఔతుంది.
@) ఆశీర్వచనం చేసి, పెళ్ళి కొడుకు శ్రీరామునికి పాద ప్రక్షాళన చేస్తారు.
పుష్పోదక స్నపనమునూ, ఆభరణాలంకరణనూ చేసి,
పూజలు చేస్తారు.
మధు పర్కముల కార్యక్రమము జరుగుతుంది.
(పెరుగు, నెయ్యి) దధి, మధు, ఘృత, మధుపర్క ప్రాశనము చేస్తారు.
ఇట్లు ప్రయాణ బడలికను తీర్చిన వెనుక,
తతిమ్మా కార్యక్రమాలు కొనసాగుతాయి.
@) వస్త్రములు ఇస్తారు. గో దానము చేస్తారు.
దృష్టి దోష నివారణకై కొన్ని పనులు చేస్తారు.
అన్నము చూపిస్తారు.
@ కన్యా దాన కార్యక్రమము మొదలౌతుంది.
అందుకు “మహా సంకల్పము”ను పఠిస్తారు.
@) కన్యా దాన ప్రశస్తి చెప్పిన తదుపరి ఇతర దానాలను చేసి,
“చూర్ణిక” ఎలుగెత్తి చదువుతారు.
సుముహూర్త ప్రశస్తి పరమైన పద్యం వంటి గద్య రచనయే చూర్ణిక.
@) ఇక జీలకర్ర, బెల్లం, పసుపులు కలిపిన ముద్దను
వధూ వరుల తలలపైన పెడ్తారు.
ఈ మిశ్రమాన్ని ఇరువురికీ ఉంచే నేత్ర పర్వమైన ఆచారమును
తెలుగు దేశములో భక్తులు యావన్మందీ ఎంజాయ్ చేస్తూంటారు.
ఇలాగ “హస్త మస్తక ప్రయోగ సంయోగముతో
పెళ్ళి పందిరికే జయ కళ వస్తుంది.
@) “అక్షతారోపణ” అంటే నవ వధూ వరులు
ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకొనుట
అత్యుత్సాహ భరితముగా జరుగుతుంది.
మొదట మూడు దోసిళ్ళు హరిద్రాక్షతలు పోస్తారు.
$}”యజ్ఞము వృద్ధి చెందాలని నా అభిలాష.”
అని మొదటి దోసిలిలోని అక్షింతల రాశినీ,
$}”ధర్మము సమృద్ధి పొందాలని నా కోరిక.”
అని రెండవ దోసిలివీ,
$} “పశు సంపదలు బాగా ఉన్నత స్థాయిని పొందాలని నా మనోభీష్టము.”
అనే భావనలతో మూడవ దోసిలిలోనివీ పోసుకుంటారు.
@) “బ్రహ్మ గ్రంధీ ధారణము”
“పెళ్ళి కుమార్తె, పెళ్ళి కుమారుడూ భార్యా భర్తలు అయ్యారు కదా!
కాబట్టి గృహస్థాశ్రములో అడుగిడి,
పరస్పర బద్ధ అనురాగముతో ప్రవర్తిస్తూ,
ధర్మ మార్గానుయాయులై దిన దిన ప్రవర్ధ మానముగా వర్ధిల్లాలనే
యోచనతో ఏర్పడినదీ ఈ బ్రహ్మ గ్రంధీ ధారణము.
కళ్యాణ ఆరాధనలు పూర్తి ఐన పిమ్మట, నివేదన తరువాత
భక్తులకు ప్రసాదము లభిస్తుంది.
ఆ ప్రసాదములే తెలుగువారికి నోరూరించే
వడ పప్పు, పానకములు అని ఈ పాటికే మీరు గ్రహించి ఉంటారు,

( ఆధారము ; late ananta ramayya)

1, డిసెంబర్ 2010, బుధవారం

వర్ణ భరితం తూలికలు
















అందాలకు నెలవులు,
చిన్న చిన్నరేఖలకు
అద్భుత భావాలను
అందించే సుదతీ మణుల
చిరు నవ్వులు;
కుంచెల (తూలికల)హృదయాలలో
వర్ణ భరితంగా
సాక్షాత్కరింప జేసే ప్రజ్ఞ
దరహాసాలకే సాధ్యం.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...