"వసంత సేనా, మొన్న ఉత్సవంలో నీ నాట్య కళ మసకబారింది,
మొదట్లో బాగానే చేసావు, అదేంటోగాని, ఆఖర్న అస్తవ్యస్తంగా చేసేసావు.
అప్పటికీ శత పోరుతూనే ఉన్నాను కదా, ఈ తూరి బాగా చెయ్యాలి సేనా - అంటూ.
ఆలాంటిలాంటి వాళ్ళు కాదు, హేమాహేమీలు నీకు కన్నెరికం చేయాలీ అని. .........."
తల్లి ధోరణి సాగి పోతూనే ఉన్నది.
వసంత సేన మాత్రం పరధ్యానంగా ఉన్నది.
"హూ, ఏదో గాలి సోకింది. లేకుంటే ఏమిటీ పిల్ల,
వైద్యునికి కబురంపాను, అరుగో, రానే వచ్చారు, ........ "
"దయ చేయండి ధన్వంతరి మహాశయా!
మొన్న ఉత్సవంలో నాట్య ప్రదర్శన ఇచ్చింది, అప్పటి నుండీ .......
"నాడి చూస్తూ "తెలుసు తెలుసు, నాకన్నీ తెలుసు.
ముందు మంచి నీళ్ళను సావకాశంగా మరిగించి, తీసుకు రండి ........ "
తల్లి లోనికి వెళ్ళింది.
" వసంత మణీ! ఆ రోజు నువ్వు ప్రేక్షక జనంలో ఉన్న
చారుదత్తుని ప్రేమిస్తున్నావు, ఔనా."
తెల్లబోయింది వసంత సేన,
"మీకు తెలుసా, తెలిసిందా!?"
"ఈ ధన్వంతరివి నాడిని పసికట్టడమేనా విధి కదా. పసికట్టాను. ........ "
"ప్రస్తుతానికి ఇది రహస్యంగా ఉంచండి, ముఖ్యంగా మా అమ్మ దగ్గర."
సిగలోని నగను ఇచ్చింది.
"సరే సరే" అంటూ, మందుల పెట్టెలో - అడుగున దాచాడు.
తల్లి, మదనిక - వేణ్ణీళ్ళ గిన్నె పట్టుకుని వచ్చారు.
వైద్యుడు "అమ్మాయీ మణిగారికి ఈ చూర్ణం ఉష్ణ జలంలో కలపండి,
బాగా కాపడం పెట్టండి, ఉష్ణం ఉష్ణేన శీతలం - అన్నారు పెద్దలు."
నర్మగర్భంగా నవ్వుతూ అన్నాడు.
;
వసంత సేన సైగను అర్ధం చేసుకున్నాడు వైద్యుడు.
"అమ్మా! మీ పెరట్లో తమలపాకులు ఉన్నాయా!?"
"మా పెరటి తోటలో లేవు. ఊరి బైట ఉద్యానంలో ఉన్నవి.
వాటినే విపణి వీధిలో అందరూ కొంటారు. ఐనా, మాకు కొనే దుర్గతి ఏమీ పట్ట లేదు...... "
గతుక్కుమని - "ఔనౌను, మరిచాను కదండి.
అందరూ - మీకు దండిగా ధనం, స్వర్ణం -
అన్నింటినీ - తాంబూలలో పెట్టి మరీ ఇస్తూంటారు కదా!"
"ఈ మోహిని లోగిలి స్థాన మహత్మ్యం ఘనత అదే!" అన్నది తాలి.
"తమాల పత్రములను - అదేనండీ, తమలపాకులకు
పిసరంత తైలం రాయండి, కుంపటి రాజేసి,
కొంచెం వెచ్చ జేసి తీసుకు వస్తారూ!?"
వాళ్ళు అటు కేసి వెళ్ళాక, వసంత సేన అడిగింది.
"చారుదత్తుడు నిష్ఠాగరిష్ఠుడట.
ఏదైనా మందు, వశీకరణం ఔషధం - ఇవ్వ గలారా!?"
"నా వృత్తి అదే కదా! ..... "
అతని చూపుల అర్ధాన్ని గ్రహించింది వసంతసేన.
"మీ మేలు మరిచి పోను, ప్రతిఫలం భారీగానే ఇస్తాను లెండి."
వాడ్చిన తమలపాకులు తెచ్చారు తల్లి, మదనిక.
"వీలు కలిగినప్పుడల్లా, అంటే అమ్మాయి అడిగినప్పుడు -
ఈ ఆకులను మేనుపై వేస్తూడండి. మళ్ళీ రేపు ఈ ఝాముకు వస్తాను.
ధన్వంతరి వెళుతూ ' వశీకరణం మందు తెచ్చి ఇస్తాను '
అని వసంత సేనకు సైగ చేసి, నిష్క్రమించాడు.
;
*****************************************;
అధ్యాయ శాఖ ;- 7 ; ధన్వంతరి వాక్కు, నేర్పు ;
వసంతసేన వసంత సేన కోణమానిని, నాటకం తెలుగు, ;

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి